ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక మొబైల్ న్యూస్ యాప్, Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా అందించిన వరుస కధనాలపై విశేషంగా స్పందించింది. 75 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల ఖాళీలు, పెండింగ్ లో ఉన్న పదోన్నతులు, లెక్కగట్టని ఖాళీలు, ఇన్చార్జిలు, ఏఫ్ఏసీ అధికారుల నియామకం వలన పరిపాలన గాడితప్పుతున్న విధానాలపై ప్రత్యేక కథనాలు అందించింది. దీనితో వాస్తవాలను పసిగట్టడంతోపాటు, భారీ మార్పులకు శ్రీకారంచుట్టి ఆపై కీలక నిర్ణయిం తీసుకుంది. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఉన్న అన్నిస్థాయిల్లోనూ ఇన్చార్జి, ఎఫ్ఏసీ విధానాలను రద్దు చేయాలని, అధికారులకు పదోన్నతులు కల్పించాలని, ఖాళీలను లెక్కించి ప్రభుత్వానికి నివేవిదించాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కార్యదర్శి రేవు ముత్యాలరాజు అన్ని ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలకు, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా పేర్కొన్నారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వశాఖల్లోని ఎఫ్ఏసీ, ఇన్చార్జి అధికారుల జాబితాలను కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు సిద్దం చేస్తున్నారు.
ఇన్చార్జిలు, ఎఫ్ఏసీల ఆశలపై రద్దు ఉత్తర్వుల నీళ్లు..
ఎన్నో ఆశలతో, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల రికమెండేషన్లతో ఇన్చార్జిలు, ఎఫ్ఏసీ పోస్టుల్లోకి వచ్చిన మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారుల ఆశలపై ప్రభుత్వం ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే ప్రభుత్వం కొందరు అధికారులను ఇన్చార్జిలు, ఎఫ్ఏసీలుగా నియమించినా ప్రభుత్వ ప్రాధాన్యత విధులు కాకుండా పైరవీలు, పైసావసూల్, సొంత తెలివితో క్రింది స్థాయి సిబ్బందిని, అధికారులను వేధించడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉన్న ఉద్యోగాన్ని పక్కనపెట్టి ఇన్చార్జిలుగా కొందరు అధికారులను నియమించడం వలన వారి అసలు ఉద్యోగం కూడా ఇన్చార్జిలతోనే చేయించాల్సి వస్తుందని తద్వారా పరిపాలన గాడితప్పుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఇన్చార్జిలు, ఎఫ్ఏసీలను తొలగించడం ద్వారా అసలు ప్రభుత్వశాఖల్లో ఎన్ని పోస్టులకు పదోన్నతులు కల్పించవచ్చు... తద్వారా ఎన్ని పోస్టులు ఖాళీలు ఏర్పడతాయి.. ఎన్ని పోస్టులను భర్తీచేయడానికి ప్రభుత్వానికి నివేదించవచ్చు అనే విషయాలను తెలుసుకోవడానికి అవకాశం వుంటుందని ఈ తొలగింపు కార్యక్రమానికి దిగినట్టుగా ఒక రాష్ట్రస్థాయి అధికారి ఈఎన్ఎస్ కి వివరించారు.
పదోన్నతులు, కొత్త పోస్టులకు లైన్ క్లియర్
ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం వలన 75 ప్రభుత్వశాఖల్లో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అధికారులు, సిబ్బందికి పదోన్నతులు రావడంతోపాటు, కొత్తపోస్టులు మంజూరుకి లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది. సీఎం కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఇచ్చినఆదేశాలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో పదోన్నతుల కోసం వెయిట్ చేస్తున్నారందరికి ప్యానల్ వైజ్ ప్రమోషన్లు వచ్చే అవకాశంకూడా ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కువగా
ఇన్చార్జిలు, ఏఎఫ్ఏసీలు ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే న్నాయి. ఈఓపీఆర్దీలుగా వున్న ఎంపీడీఓలుగానూ, ఎంపీడీఓలుగా పనిచేస్తున్నావారు జిల్లాశాఖల అధికారుల గానూ ఇన్చార్జి, ఎఫ్ఏఏసీల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాచేయడం వలన అన్ని ప్రభుత్వశాఖల్లోనూ, అధికారులు ఉన్నట్టుగానే ప్రభుత్వ లెక్కల్లో వుంటుంది. ఒక్కసారి మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న ఇన్చార్జిలు, ఎఫ్ఏసీలను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి పక్కాగా లెక్కవస్తుందని ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీచేసినట్టు చెబుతున్నారు.
వాస్తవానికి ఇన్చార్జిలు, ఏఫ్ఏసీ అధికారుల విధులు ఎలా ఉన్నాయి.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏవిధమైన కలెక్షన్లు చేస్తు్న్నారు.. ఇటీవల కాలంలో వారికి బదిలీలు జరిగినా మళ్లీ ప్రజాప్రతినిధుల పైరవీలతో అనుకున్న ప్రదేశాలకు ఏవిధంగా తిరిగివచ్చారనే విషయాలను ఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు
అధికారిక మొబైల్ న్యూస్ యాప్, Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా వరుస కథనాలను అందించింది. దీనితో స్పందించిన ప్రభుత్వం.. ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కూడా భావించడంతో ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఇన్చార్జి పోస్టులు ఉండకుండా చేస్తే అసలు విషయం వెలుగు చూస్తాయని దానికి తగ్గట్టుగానే ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, వారి జిల్లాల్లోని శాఖల్లో పనిచేస్తున్న ఇన్చార్జి ఉద్యోగాలను, ఎఫ్ఏసీ ఉద్యోగాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర సచివాలయంలో కూడా ఎఫ్ఏసీలు, ఇన్చార్జిలుగా ఇచ్చిన జీఓలను రద్దు చేసే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. చూడాలి ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా జారీచేసిన ఈ ఉత్తర్వులు ఏ స్థాయిలో అమలవుతాయో..లేదంటే మళ్లీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఎఫ్ఏసీలు, ఇన్చార్జి వ్యవస్థల కాలవ్యవధిని పెంచుతారో అనేది..!