ఫిబ్రవరి7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


Ens Balu
10
Srinivasa Mangapuram
2023-02-06 11:31:26

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11 నుండి  19వ  తేదీ  వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు  నిర్వహించనున్నారు . ఈ సందర్బంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో  భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

వాహనసేవల వివరాలు :
11-02-2023 -  ధ్వజారోహణం - పెద్దశేష వాహనం
12-02-2023 - చిన్నశేష వాహనం - హంస వాహనం
13-02-2023 - సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం
14-02-2023 - కల్పవృక్ష వాహనం - సర్వభూపాల వాహనం
15-02-2023 - పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) - గరుడ వాహనం
16-02-2023 -  హనుమంత వాహనం - వసంతోత్సవం, స్వర్ణరథం, గజ వాహనం
17-02-2023 - సూర్యప్రభ వాహనం - చంద్రప్రభ వాహనం
18-02-2023 - రథోత్సవం -     అశ్వవాహనం
19-02-2023 - చక్రస్నానం - ధ్వజావరోహణం చేస్తారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆలయ మాడ వీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.