ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Tirumala
                            2020-09-25 18:35:59
                        
                     
                    
                 
                
                    హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త  దండు అనిల్‌కుమార్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు  శివకుమార్ ద్వారా రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఈ విరాళం డిడిని శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి చేతుల మీదుగా టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి కార్యక్రమాలు ఎస్వీబీసీ ట్రస్టు ద్వారా నిర్వహించే ఛానల్ లో ఎంతో వైభవంగా చూపిస్తున్నారని, దీంతో బయటకు రాలేని భక్తులకు ఎంతో నయనానందకరంగా వుంటుందని కొనియాడారు. రానున్న రోజుల్లో ఛానల్, ట్రస్టు ద్వారా మరిన్ని కార్యక్రమాలు రూపొందించి భక్తులకు చేరేలా చూడాలని సీఈఓని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.