ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేస్తున్న తాత్సారంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ Ens Live, న్యూ స్ వెబ్ సైట్ www.enslive.net ప్రచురించిన ‘సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ సరే..నియామక ఉత్తర్వులేవి’ వార్తపై అధికారులు స్పందించారు. వెనువెంటనే కౌన్సి లింగ్ అయిన అభ్యర్ధులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీచేశారు. ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేశారు. మరోవైపు పట్టణ పురపాలకశాఖ రాష్ట్ర అధికారులు కూడా కౌన్సిలింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్ధుల వివరాలను ఆన్ లైన్ చేసి..ఆ జాబితాను అధికా రికంగా విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల సమయంలో కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే అదేరోజు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. లేదంటే జాబితా ప్రకటించి, సదరు కార్యాలయాలకు ఉత్తర్వులు చేరవేస్తారు. కానీ సచివాలయ ఉద్యోగుల విషయంలో చెప్పిన సమయానికి కౌన్సిలింగ్ నిర్వహించకపోగా.. ఆలస్యంగా చేసిన కౌన్సిలింగ్ తరువాత కూడా వారికి బదిలీల అయిన చోటుకి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వ శాఖకు జరగని విధంగా..విభిన్నంగా ప్రక్రియ జరగడాన్ని కూడా ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లిం ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాం.
విషయం తెలుసుకున్న అధికారులు ఆఘమేఘాలపై పోస్టింగ్ ఆర్డర్లకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేశారు. ఏఏ ప్రాంతాలకు అభ్యర్ధులకు బదిలీలు జరిగాయో ఆయా ప్రదేశాల్లోని సచివాలయాల్లో విధుల్లోకి చేరాలంటూ సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులురావడంతో సచివాలయ ఉద్యోగులు ఈవిషయాన్ని ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయాని ఫోన్లు చేసి తెలియజేసి ధన్యవాదములు తెలియజేశారు. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడంతోపాటు, ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే విషయంలోనూ సామాజిక బాధ్యత వహిస్తుందని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులపై వరుస కథనాలు ప్రచురించడం వలనే ప్రభుత్వ వర్గాలు సత్వరమే స్పందించాయని పేర్కొన్నారు. వాస్తవాలను అత్యంత వేగంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు తెలియజేసే విషయంలో మొదటి నుంచి ఒకే ఒరవడిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఇకపై కూడా ఉద్యోగుల సమస్యలపైనే కాకుండా..కొన్ని తేడా వ్యవహారాలపైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం..!