APCPSEAతో వాస్తవాలను తెలియజేసే సిపిఎస్ ఉద్యోగి మేలుకో


Ens Balu
81
Amaravathi
2023-06-23 02:13:40

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి.. ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రచారాలను, సంబురాలను ఉద్రుతం చేస్తున్న వేళ..ఆం ధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వాస్తవాలను అందరికీ తెలియజేసే పనిలో పడింది. అసలు సిపిఎస్ రద్దుచేసి ప్రభుత్వం మనం దాచుకున్న డబ్బుని మనకే ఇస్తుందంటూ ఒక వాస్తవాన్ని తెలియజేసే చైతన్యకార్యక్రమాలకు తెరలేపింది. ఇపుడు ఆ మెసేజు, అవగాహన రాష్ట్రంలోని సుమారు 3.50 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ను ఆలోచింప జేస్తున్నది. ఈ క్రమంలోనే సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ ద్వారా ప్రభుత్వం అంతకంటే గొప్పగా ఇస్తామని చేస్తున్న ప్రచారంలో నిజమెంతో తెలియజేస్తుంది. ఆ విషయాలను సిపిఎస్ ఉద్యోగులతోపాటు పాఠకులు కూడా తెలుసుకుంటారనే ఆలోచనతో సోషల్ మీడియాలో తారా స్థాయిలో జరుగుతున్న ఆచర్చను మీ ముందుకి తీసుకు వస్తున్నా్ం. ఈ లెక్కలు చూసిన వారు ఎవరైనా కిమ్మనకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో.. అవేంటో మీరూ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి.. !

ప్రతీ నెల కట్ చేసిన (బేసిక్+డి.ఎ. పై) 10% అమౌంట్ అంటే.... నెలకు సుమారు రూ.6,000/-  చొప్పున 33 సంవత్సరాల సర్వీస్ అంటే సంవత్సరానికి ₹72,000/- చొప్పున 33 సంవత్సరాల సర్వీసుకు మొత్తంమీద  రూ.23,76,000/-  ఉద్యోగుల జీతం నుండి కట్ అవుతుంది. దీనికి వడ్డీ తక్కువలో తక్కువగా సుమారు రూ. 6,24,000/- అనుకుంటే .... మన పదవీవిరమణ నాటికి ప్రభుత్వం వద్ద ఒక  సిపిఎస్ ఉద్యోగి నుండి రూ.30,00,000/- లకు పైబడిన అమౌంట్ ఉంటుంది. ఈ  అమౌంట్ ఏమోవుతుందో తెలిసిన వారు చెప్పగలరు. ఇక ఆ రూ.30,00,000బ్యాంకులో జమ చేస్తే నెలకు సుమారు ఎంత వడ్డీ రావచ్చునో అంచనా వేస్తే....ప్రభుత్వం మనకు 50% పింఛను ఎలా ఇస్తానంటుందో తెలుస్తుంది. 

 చిన్న మనవి..
 మనం ప్రతీ నెల సిపిఎస్ డిడక్షన్ కింద లెక్కించిన రూ.6000/- అంచనా మాత్రమే సర్వీసు మొత్తం ఈ అమౌంట్ పెరుగుతూ పోతుంది. అంటే పదవీవిరమణ నాటికి ప్రభుత్వం వద్ద ఉద్యోగి అమౌంట్ రూ.30,00,000/- లకు పైబడే ఉంటుంది.


ముఖ్య గమనిక:- 
1) జిపిఎస్ అమలైతే ప్రభుత్వం నెలనెలా కట్టే తన మేచింగ్ గ్రాంట్ 10% ఆపేస్తుంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ కాదు. 2) ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ఈ పదకం వల్ల ఉద్యోగులకు లాభం లేదు. ఎందుకంటే ఈ రోజున జీవన ప్రమాణాల ప్రకారం 62 సంవత్సరాలకు పదవీవిరమణ చేసిన ఉద్యోగి సుమారు 10 లేదా 15 సంవత్సరాలకు మించి జీవించరు. కావున ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బులు తీసుకున్న ప్రభుత్వమే లాభపడుతుంది తప్ప ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు నిట్ట నిలువునా మోసపోతారు

 
కొసమెరుపు... జిపిఎస్  పేరుతో ఇచ్చే పెన్షన్ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా ప్రభుత్వానికి మంచి రాజకీయ ప్రచారం. మాత్రం జరుగుతుందని ఆ ప్రచారంలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగి ఇన్నేళ్లు సర్వీసు చేసినందుకు ప్రయోజనం వుంటుంది తప్పితే.. జిపిఎస్ వలన తాము దాచుకున్న డబ్బు తమకే ప్రభుత్వం ఇస్తూ..తమకోసం చాలా మంచిగా ఆలోచిస్తుందన్నట్టుగా రంగులు పులుముకుంటుందని కూడా ఈప్రచారకులు చైతన్యం తీసుకు వస్తున్నారు. మరో పక్క గత్యంతరం లేక ప్రభుత్వం అమలు చేస్తానన్న జిపిఎస్ ను స్వాగతిస్తున్నామని చెబుతున్న ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా సిపిఎస్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక ఎదురవుతుంది. సిపిఎస్ రద్దు అంశం ముగిసిపోయిందని ప్రభుత్వం చెబుతున్నా.. సిపిఎస్ ఉద్యోగులు మాత్రం దానిని వదలడం లేదు. చూడాలి ఈ జిపిఎస్ ప్రభావం 2024 సాధారణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది..!

సిఫార్సు