ఈఎన్ఎస్ వార్తకు స్పందన..వెలువడిన ఆన్ లైన్ ఉత్తర్వులు


Ens Balu
95
Visakhapatnam
2023-07-20 15:27:09

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు సంబంధించిన అంతర్ జిల్లాల బదిలీలపై హోంశాఖ స్పందించింది. గత నెలలో పూర్తికావాల్సిన బదిలీల ప్రక్రియన వాయిదా పడుతూ వచ్చింది. ఈ విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్తంగా మహిళా పోలీసుల బదిలీలకు ఎదురుచూపులే శీర్షికన వరుస కథనాలు ప్రచురించింది. దీనితో ఎట్టకేలకు ప్రభుత్వం హోంశాఖ ద్వారా జిఓఆర్టీనెంబరు 776 పేరిట ఉత్తర్వులు జారీచేస్తూ..బదిలీలుకోరుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్లో జాబితా విడుదల చేసింది. మరో రెండురోజుల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వీరికి బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలొచ్చాయి. మరోవైపు ఆన్ లైన్ జాబితాలో పేర్లు ఉన్నవారు సంబంధింత నోడ్యూస్ సర్టిఫికేట్లు సిద్దం చేసుకోవాలని కూడా సూచించారు.