ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసుల విభాగానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఆది నుంచి ఈ విభాగం ఉద్యోగులపై కోర్టు కేసులు పడుతూనే ఉన్నాయి. తాజాగా సచివాలయ మహిళా పోలీసులను సాధారణ పోలీసులు మాదిరిగా విధులకు పంపించడా న్ని..పరిగ ణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలైంది. దానికి ప్రభుత్వం నుంచి ఏజి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వారిని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్, బందోబస్తు డ్యూటీలు వేయడానికి సవాల్ చేస్తూ ఈ కేసు దాఖలైంది. దానితో డిజిపి కార్యాలయం నుంచి వారికి పోలీసు విధులు అప్పగించకుండా ఆదేశాలిస్తామని కోర్టుకి విన్నవించింది. గతంలోనే వీరిని మహిళా పోలీసులుగా ఏవిధంగా నియమిస్తారనే అంశంపై ఉమ్మడి విశాఖజిల్లా నుంచి నిరుద్యోగ అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. దానిపై పూర్తిస్థాయి తీర్పు పూర్తవకుండానే మరో కేసు దాఖలవడం చర్చనీయాంశం అవుతోంది. ఒక్క మహిళా పోలీసుల విభాగంలోనే కోర్టు కేసులు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. దానికి ప్రభుత్వం దగ్గర కూడా సాంకేతిక పరమైన సమాధానాలు లేకపోవడంతో ఆ కేసుల విషయంలో హోంశాఖ నెగ్గే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు హోంశాఖ ద్వారానే వీరికి నియామక ఉత్తర్వలు జారీచేశారు. తొలుత మహిళా సంరక్షణా కార్యదర్శిల పేరుతో నియామకాలు ఇచ్చిన ఏపి ప్రభుత్వం తరువాత వారి హోదాను మహిళా పోలీసుగా మార్చింది. వారికి సర్వీస్ రూల్స్ ని అమలు చేస్తూ ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేసింది. సీనియర్ మహిళా పోలిస్(హెడ్ కానిస్టేబుల్ హోదా) ఆ తరువాత ఏఎస్ఐ, ఎస్ఐ, ఆపై సిఐలుగా పదోన్నతులు వీరికి కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే వీరందరినీ దిశ పోలీస్ స్టేషన్లు, విధులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచించింది. ఆదిశగా ఒక్కో పోలీసు విధులను వీరికి కేటాయిస్తూ వచ్చింది. సరిగ్గా పోలీస్ స్టేషన్లలో విధులు, బందోబస్తులు, కోర్టు సమన్లు, నాటుసారా రవాణా సమాచారం ఇలా అన్నివిభాగాల్లోనూ వీరిని వినియోగించి నిజమైన పోలీసులుగా వీరిని పరిగించడంపై అభ్యంతరాలు వ్యక్తమై విషయం కోర్టులో కేసు వరకూ వెళ్లడంతొ.. పోలీసు విధులను వారికి అప్పగించమని ఏజి ద్వారా డిజిపి కార్యాలయం హైకోర్టుకి విన్నవించింది.
మరోప్రక్క వీరికోర్టు కేసుల నెపమో, లేదంటే ఉద్యోగులందరి సర్వీసులు రెగ్యులర్ కాలేదనే సాంకేతిక కారణమో తెలీదు కానీ గ్రామ, వార్డు సచివాలయ
ఉద్యోగుల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వశాఖకు మంత్రివర్గ బేటీలో ఆమోదించి.. ఆపై అసెంబ్లీలో చట్టబద్దత కల్పించకుండా వదిలేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరికి సర్వీసు రూల్సును కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. రెండేళ్ల తరువాత రెగ్యులర్ చేస్తామ ని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత అదనంగా 9నెలలు వీరితో పనిచేయించింది. ఆ సమయంలో ఉద్యోగులు రెండు ఇంక్రిమెంట్లు, రెండు డిఏలు, ఆ 9 నెలలపాటు ఫుల్ పేస్కేలు, పీఆర్సీకి సంబంధించి ఐఆర్ ను కూడా ఉద్యోగులు కోల్పోయారు. వీరు కోల్పోయిన ఇంక్రిమెంట్లు, డిఏలు, ఐఆర్ పై నేటికీ ఇదేశాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రశ్నించడం లేదు. ఈ లెక్కన చూస్తే ఈ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత రాకపోతే వచ్చే ప్రభుత్వం మారితే వీరి ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది.
భారతదేశం మొత్తం ఏపీవైపు తొంగిచూసే విధంగా కొత్తగా ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శాఖకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. నేటికీ సుమారు 19శాఖల సిబ్బందికి, జిల్లాకలెక్టర్లకు, జిల్లా, మండల అధికారులకు కూడా పూర్తిస్థాయిలో ఈశాఖపై అవగాహన రాలేదంటే..ఈశాఖపై ప్రభుత్వం ఏ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ఇటీవల అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసిన డిఏని, సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడంపైనా ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. సర్వీసు రెగ్యులర్ అయిన ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇంక్రిమెంటు విషయంలో టార్గెట్లు పూర్తికాకపోతే మొదటి ఇంక్రిమెంట్ వేసేది లేదని జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఎందుకు ఇవ్వడం లేదంటే ఆ ఒక్కటీ అడగొద్దు అని జిల్లా అధికారులు సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అనుమానాల మధ్య మా ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలినియని ఆయోమయ భయం తమను వెంటాడుతోందని ఉద్యోగులు భయాంతోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు కూడా 2024 ఎన్నికల్లో ప్రభావం చూపిచే అవకాశాలున్నాయిని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి.