ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారుణ్యనియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఖచ్చితంగా ఉద్యోగాలు పొందిన వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సిపిటి) పాస్ కావాలనే కీలక నిబంధన పెట్టింది. ఈ మేరకు అభ్యర్ధులు ఉద్యోగాలు పొందిన తరువాత రెండేళ్ల ప్రొభేషన్ కాలంలో ఈపరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని..ఆ తరువాత మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 75 ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ మ్రుతిచెందిన వారి పిల్లలకు కారుణ్యనియామకాలు గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేపట్టింది. అప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన వారందరికీ సిపిటి పరీక్షను తప్పనిసరి చేసింది. ఇపుడు అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులు కూడా ఈ పరీక్ష పాస్ కావాలని నిబంధన పెట్టింది. కాగా ప్రస్తుతం చాలావరకూ ఉద్యోగులు విధులన్నీ కంప్యూటర్ పైనే జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ కీలకనిర్ణయం తీసుకుంది.