13ఫైనాన్స్ కమిషన్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయండి


Ens Balu
154
Amaravati
2023-07-26 11:11:25

ఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్న సమయంలో 13 ఫైనాన్స్ కమిషన్ కాంట్రాక్టు హెల్త్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో ఏపి ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రాజారావు ఆధ్వర్యంలో ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, సర్వీసుల సలహాదారు ఎన్.చంద్రశేఖరరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల వినతిని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉద్యోగులంతా 2016లో జిఓ నెంబరు 9‌0 ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్దతిలో 1‌‌‌‌00శాతం గ్రాస్ సాలరీతో నియమితులయ్యారని చెప్పారు. ఆ తరువాత ఉద్యోగులందరినీ జిఓనెంబరు 27 అమలుచేసిన సమయంలో ఎంటిఎస్ క్రిందకి మార్పు చేశారని తెలియజేశారు. అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. సలహాదారుని కలిసిన వారిలో నాగరాణి, సోమామణి, అనురాధ, శ్రీలక్ష్మి, చైతన్య, నాగరాజు అన్నపూర్ణ, సౌమ్య, కిషోర్, వలి, నిరంజన్, పల్లవి, చిన్న, వీరభద్ర, చందన, ప్రశాంతి, రవినాయక్, విజయలక్ష్మి, వినయ్, చినవెంకయ్య, రజనీ, చక్రవర్తి, శిల్ప కళ్యాణి తదితరులు పాల్గొ్న్నారు.