కారుణ్య నియామకాల ద్వారా సచివాలయ ఉద్యోగాలభర్తీ


Ens Balu
84
Amaravati
2023-07-26 15:59:07

ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో మ్రుతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించనుంది. ఆ ఉద్యోగాలన్నీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఖాళీల్లో భర్తీచేయాలని 26 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా రాష్ట్రవ్యాప్తంగా 2917 మంది మ్రుత్యువాత పడగా.. ఇప్పటి వరకూ 2744 మంది కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఆగస్టు 24 నాటికి అపాయింట్ మెంట్లు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కాగా నియామాలు పూర్తిచేసిన నివేదికను సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వానికి అందజేయాలని ఆయా ప్రభుత్వశాఖల అధికారు లు, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన తరువాతన రెండుసార్లు డిఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1.25 లక్షల మంది ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.