మెగాస్టార్ ఆరోజు ప్రభుత్వానికి వ్యతిరేంగా గళమెత్తారు


Ens Balu
52
Rajamahendravaram
2023-08-09 11:04:34

మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల దినోత్సవ వేడుకలలో చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్థించారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ, చిరంజీవి చెప్పినట్లు సినీ పరిశ్రమ నిజంగా పిచ్చుకే కానీ.. చిరు మాత్రం కాదన్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కేంద్రమంత్రిగా పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. దీనితో రాజకీయంగా వేడి రాజుకుంది. కేంద్ర మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అంత ఆషామాషీ విషయం కాదు.. అలాంటి  చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందనే విషయం చాలా మంది తెలుసుకోవాలన్నారు. చిరులాంటి వ్యక్తి ప్రత్యేక హోదాపై పోరాడమని మంత్రులకు సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదని లేదన్న ఉండవల్లి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు..

ఆంధ్ర కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని.. అది సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హాయంలో కంటే వైఎస్సార్సీపీ హాయంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పత్రికను, ఛానల్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు అక్రమాలు, అవకతవకాలు పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు కళాంజలి కళకృతులు అని కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై కేసు పెట్టారన్నారు. ఈ కేసులో రామోజీరావుపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారని చెప్పారు. డబ్బున్న వారికే కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టి మార్గదర్శిపై పోరాటం చేస్తున్నానన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారిన ఈ ప్రాజెక్టు పూర్తి కాదని రుజువైందని అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ కాకుండా వేరే ప్రభుత్వం రావాలని బాంబు పేల్చారు.