ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ హైకోర్టుకి డిజిపి కార్యాలయం నుంచి ఏజి ద్వారా సమర్పించిన అఫడవిట్ అంతా వట్టిదేనని..ఈ విషయంలో డిజిపి ఉత్తర్వులు కూడా ఎక్కడా అమలు చేయమని ఉమ్మడి విశాఖజిల్లా పోలీసులు, విభజన అనకపల్లి జిల్లా పోలీసులు ఆధారాలతో సహా రుజువుచేసి చూపించారు. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడంపై హైకోర్టులో కేసు దాఖలైంది. దానికి స్పందించిన రాష్ట్రప్రభుత్వంలోని పోలీసుశాఖ..వారిని పోలీసు సిబ్బందిగా పరిగణించమని, పోలీస్ స్టేషన్ విధులు, బందో బస్తు విధులు అప్పగించమని హైకోర్టుకి ప్రత్యేక అఫడవిడ్ దాఖలు చేసింది. అయితే దాఖలు చేసిన నెలరోజులు గడవక ముందే ఉమ్మడి విశాఖజిల్లా పోలీసులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా పరిధిలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ లోనూ, అనకాపల్లి జిల్లా పరిధిలోని అరట్లకోట గ్రామంలోని జాతరలో బందోబస్తు డ్యూటీలు మహిళా పోలీసులకు వేశారు. రెండు రోజుల వ్యవధిలో పోలీసులు దిక్కరించిన హైకోర్టు ఆఫడవిట్ నిబంధనను ఉల్లంఘించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిజిపీ లేదూ..హైకోర్టికి సమర్పించిన అఫడిట్ భయం అసలే లేదు..అలాంటివేమీ ఏపీ పోలీస్ అందునా ఉమ్మడి విశాఖజిల్లా, విభజన విశాఖ జిల్లా పోలీసులకు అసలే పట్టవని..మళ్లీ అదే పోలీసు స్టేషన్ల విధులు, బందో బస్తు విధులు మహిళా పోలీసులకు అప్పగిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇపుడు ఇవే ఆధారాలు హైకోర్టుకి ఏపీపోలీసుశాఖ దిక్కరించిన ఆధారాలుగా కూడా మరనున్నాయి. పోలీసుశాఖలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ, డిజిపి ఉత్తర్వులు ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయనే అంశానికి క్రింది స్థాయి పోలీసులు ఇస్తున్న గౌరవం ఏంటో కూడా పక్కాగా రుజువైంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీసుశాఖ విధులు అప్పగించకూడదని, 26 జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ చేసిన ఆదేశాలు విశాఖ, అనకాపల్లి జిల్లాలో పక్కాగా బుట్టదాఖలు అయ్యాయి. ఇంకా కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుశాఖలోని స్టేషన్లలోని అధికారులు సచివాలయ మహిళా పోలీసులకు పోలీసు బందోబస్తు, స్టేషన్ డ్యూటీలు డిజిపి ఆదేశాలు ఉల్లంఘించి మరీ వేయడాన్ని బట్టి మహిళాపోలీసు విభాగంలో కోర్టుకేసులకు సిబ్బందే ఉప్పందించి, కేసులు వేయించారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏపీ పోలీస్ బాస్ ఆదేశాలను క్రిందిస్థాయి పోలీసులు ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో..కోర్టు కేసులు ఉండగా కోర్టు దిక్కారానికి ఏ విధంగా పాల్పడుతున్నారో రెండురోజులు పాటు మహిళా పోలీసులకు అదనంగా వేసిన విధులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పోలీసుశాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా పోలీసులను పోలీసు విధులకు పక్కనపెట్టడంతో ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ఇబ్బందులను ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. విషయం చక్కబడుతుందని ఆశపడుతున్న వేళ పోలీసులు కోర్టు దిక్కారానికి పాల్పడటం కూడా చర్చనీయాంశం అవుతున్నది. చూడాలి ఈ విషయంలోడిజిపి కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందనేది.