సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై ఆర్టీఐ


Ens Balu
232
Tadepalli
2023-08-24 03:03:55

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న సుమారు 1.30లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై సమాచారహక్కు చట్టం దాఖలైంది. సచివాలయశాఖలోని సుమారు 19శాఖల సిబ్బంది నియామకాలు, డ్యూటీ చార్ట్, సర్వీస్ రూల్స్, పీఆర్సీఅమలు, సర్వీస్ రెగ్యులర్ చేసిన సమయంలో రెండు ఇంక్రిమెంట్లు కలపకపోవడం, కోల్పోయిన డిఏలు, పేస్కేలు, డ్యూటీచార్ట్, ప్రమోషన్ ఛానల్ తదితర అంశాలపై 20 అంశాలతో కూడిన దరఖాస్తు దాఖలైంది. సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లకు చేయాల్సిన ప్రొబేషన్ డిక్లరేషన్ తొమ్మిది నెలలు ఆలస్యంగా చేశారు. అదే సమయంలో పీర్సీ అమలు చేస్తున్నారని చెప్పి వీరికి పేస్కేలు పెంచారు తప్పితే అరియర్స్ జమచేయలేదు. ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం ఏం చేస్తుంది, వీరికి జరిగిన అన్యాయంపై ఏ విధమైన సమాధానం ఇస్తుందనే సమాచారం తెలుసుకునేందుకు దాఖలైంది. అయతే ప్రభుత్వం  సమాచారం ఏవిధంగా ఇస్తుందనేది వేచి చూడాలి.