బయో మెట్రిక్ అటెండెన్స్ వేయకపోతే జీతానికి రంగుపడుద్ది


Ens Balu
74
Vijayawada
2023-08-25 04:14:20

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జిఎస్ డబ్ల్యూఎస్ యాప్ ద్వారా నూరుశాతం బయో మెట్రిక్ అటెండెన్సు పడితేనే ఉద్యోగులకు ఇకపై పూర్తిస్థాయి జీతాలు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులు విధిగా ఉదయం విధులకు వచ్చినపుడు పది గంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఖచ్చితంగా హాజరు వేయాల్సి వుంటుంది. కాగా చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉత్తర్వులను పెడచెవిన పెట్టి వారికి నచ్చినట్టుగా ఉద్యోగాలు చేస్తూ బయో మెట్రిక్ అటెండెన్స్ వేయడం మానేస్తున్నారు. దానిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. అటెండెన్సు ఆధారంగానే జీతాలు ఇస్తామని సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానికోసం గ్రామ,సచివాలయశాఖ డైరెక్టర్ డా.లక్ష్మీషా మెమో-114/F/2022ను జారీచేశారు. ఈ మెమో ప్రకారం ఆగస్టు 1నుంచి 31 వర్తిస్తాయని, దానికి బాధ్యత డిడిఓలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. దీనితో ఉద్యోగులు క్రమం తప్పకుండా బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు.