తిరుమలలో మరో ఐదు చిరుత‌ల క‌ద‌లిక‌లు


Ens Balu
41
Tirupati
2023-08-25 17:02:57

తిరుమల కాలిబాటల సమీపాన మళ్లి ఐదు  చిరుతల కదలికలు కనిపించాయి. నామాల గవి, నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో ఐదు చిరుతల కదలికలు గుర్తించారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు బోన్లు పెట్టి మూడు చిరుతలను బంధించగా ఇపుడు కనిపించినవి కొత్తవిగా భావిస్తున్నారు. తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాప్‌ కెమెరాల ఆధారంగా ఇంకా ఐదు చిరుతలు ఉన్నట్లు- అధికారులు గుర్తించారు. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి..వాటిని ఎలా బంధించాలి అనే దానిపై అటవీ శాఖ వ్యూహం సిద్ధం చేస్తోంది. త్వరలో వాటిని బంధించి జూకు తరలిస్తామని డిఎఫ్‌ఓ సతీష్‌రెడ్డి చెబుతున్నారు. గతంలో అప్పుడప్పుడు తిరుమల కాలినడక బాట, అడవికి సమీపాన ఉండే గెస్ట్‌హౌస్‌ల వద్ద మాత్రమే కనపించిన వన్యమృగాలు.. ఇటీవల జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే ధైర్యంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

 నడకదారి భక్తబృందంలోని ఓ బాలుడిపైన చిరుత దాడి చేసి గాయపరచడం, ఇటీవల బాలిక లక్షితను ఓ పొట్టన పెట్టుకోవడడం వంటి సంఘటనలతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నా యి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ కాలినడక మార్గాలు ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.  దీంతో టిటిడి అటవీ శాఖ వన్యమృగాల రాకను అడ్డుకోవడానికి భక్తులలో నెలకొన్న భయాందోళ నలు తొలగించడానికి అనేక చర్యలు చేపట్టాయి. తిరుమలలో సాగుతున్న ఆపరేషన్‌ చిరుతలో భాగంగా కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ చిరుత బోను దగ్గరికి వచ్చి వెంటనే పక్క నుంచి వెళ్లిపోయిందని డిఎఫ్‌ఓ చెప్పారు. మరో ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు- గుర్తించారు. వీటిని బంధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.