గ్రామ, వార్డు సచివాలయశాఖను కదిలించిన ఆర్టీఐ


Ens Balu
161
Vijayawada
2023-08-26 06:36:47

ఏపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై దాఖలైన సమాచారహక్కు చట్టం దరఖాస్తుపై స్పందించింది. ఉద్యోగులకు సర్వీసు రూల్స్ అమలు చేస్తూ జీఓల ఆధారంగా పదోన్నతులు కల్పిస్తున్నది. శ్రీకాకుళంజిల్లాలో 10మంది, గుంటూరు జిల్లాలో 1, వైఎస్సార్‌ జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 2 చొప్పున పదోన్నతులు పొందారు. మిగిలిన జిల్లాల్లో 35మందికి పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 17శాఖల సిబ్బందికే ప్రమోషన్ ఛానల్ ఉండగా, ఇంజనీరింగ్ , ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. వారికి కూడా త్వరలోనే విధి విధానాలు ఖారారు చేయనుంది . అదే సమయంలో ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, పీఆర్సీ అరియర్స్, 9నెలల బకాయిల విషయం, మిగులు ఉద్యోగాల ఖాళీలపైనా స్పష్టత రానుంది.