గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో శుభవార్త..!?


Ens Balu
94
Amaravati
2023-08-27 02:31:09

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పబోతున్నట్టు తెలిసింది. సచివాలయశాఖలో ఉన్న 19 విభాగాల్లో ఇన్ సర్వీస్ కోటాలో ఉద్యోగులకు ఉన్నత చదువులు, శిక్షణకు లైన్ క్లియర్ చేసేందుకు యోచన చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏఎన్ఎంలుగా  పనిచేస్తూ ఇంటర్ క్వాలిఫై అయిన వారికి జిఎన్ఎం(నర్శింగ్)లో శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వం . ఇక వ్యవశాయశాఖలోని డిప్లమా అగ్రికల్చర్, డిప్లమా హార్టికల్చర్, డిప్లమా సెరీకల్చర్, డిప్లమా ఫిషరీష్, డిప్లమా యానిమల్ హజ్బండరీ, డిప్లమా ఎలక్ట్రికల్, డిప్లమా ఇంజనీరింగ్, క్వాలిఫికేషన్ తో ఉద్యోగాల్లోకి చేరిన వారికి వారి మెరిట్ ఆధారంగా ఇన్ సర్వీసు శిక్షణ ఇస్తే పదోన్నతులతోపాటు త్వరలో ఖాళీలు కాబోతున్న ఉద్యోగాలను కూడా భర్తీచేయాలని యోచిస్తున్నది. ఉద్యోగులకు ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు పదోన్నతి ఉద్యోగాలకు అర్హులవుతారు. అదే కొత్త ఉద్యోగాలు భర్తీచేయాలంటే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అదే ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులకే ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వడం ద్వారా త్వరలో ఖాళీలు కాబోతున్న స్థానాలకు వీరిని సిద్ధం చేయవచ్చు. అదేవిధంగా మళ్లీ ఖాళీలు భర్తీచేయాలనుకుంటే సచివాలయశాఖలోనే భర్తీచేయడం ద్వారా తక్కువ జీతంతో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం వుంది. దీనితో ఏఏ శాఖల్లోని ఉద్యోగులు ఇన్ సర్వీసు శిక్షణకు అర్హులుగా ఉన్నారనే కోణంలో జోరుగా పరిశీలనలు జరుగుతున్నాయని సమాచారం.

వైఎస్సార్సీపీ అధికారంలోని వచ్చిన తరువాత రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు విరమణ వయస్సుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఆ పెంచిన వయస్సు కూడా 2024 డిసెంబరులోగా వివిధ నెలలతో పూర్తయి ఉద్యోగ విరమణలు జరుగనున్నాయి.  ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి. వాటిని భర్తీచేయాలంటే ప్రభుత్వంపై అత్యంత అధిక ఆర్ధిక భారం పడుతుంది. అలాంటి సందర్భంలో ప్రస్తుతం 19 విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆ ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించడానికి కూడా సర్వీసు నిబంధనలు అడ్డంకి తొలగుతుంది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు 2 పీఆర్సీలు, బకాయిపడ్డ ఇంక్రిమెంట్లు వర్తింపజేస్తే సాధారణ మండల స్థాయి ఉద్యోగుల పేస్కేలుకి చేరుకుంటారు. దీనితో వారికి ఇచ్చే ఇన్ సర్వీసు శిక్షణ వలన మండల స్థాయిలో ఉద్యోగులను ప్రత్యేకంగా అత్యధిక జీతంతో నియమాకాలు చేపట్టే పనుండదు. ఏదైనా కొత్త ఉద్యోగాలు భర్తీచేయాలన్నా క్రింది స్థాయి ఉద్యోగాలతోనే భర్తీచేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులుకు పదోన్నతులు, ఇన్ సర్వీసు శిక్షణ, ప్రభుత్వంపై ఆర్ధిక భారం అన్నీ తగ్గుతాయి. 

రాష్ట్రంలో వివిధశాఖల్లోని ఉద్యోగాల్లో చాలాశాఖల్లో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీచేయాలంటే గ్రూప్-1, 2, 4, 5 కేటగిరీల్లో భర్తీచేయాల్సి వుంటుంది. ప్రస్తుతం
ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇస్తే  తద్వారా చాలా మంది గ్రూపు-2 కేడర్ కు చేరుకుని మండల స్థాయి అధికారులుగా మారే అవకాశం ఉంటుంది. అప్పటికే మండల స్థాయి అంటే గ్రూపు-2 కేటగిరీల్లో ఉన్న అధికారులు పదోన్నతుల ద్వారా గ్రూప్-1 అధికారులుగా మారడానికి అవకాశం వుంటుంది. అప్పుడు ఉద్యోగాల కల్పన, జీతాలు చెల్లింపుల భారం ప్రభుత్వంపై పెద్దగా ఉండదు. దానికి తోడు ఉద్యోగులందరికీ సకాలంలో పదోన్నతులు ఇస్తున్నప్రభుత్వంగా కూడా కీర్తిని ఆర్జించవచ్చు. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ శిక్షణ, లేదా చదువు చెప్పించడానికి సర్వీసు రూల్స్ ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వాలంటే ప్రభుత్వ కళాశాలల్లోనే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల్లో అవకాశం ఉన్నంత మేరకు ఎక్కువ మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం చేస్తున్న విధులకు ఆటంకం రాకుండా నైట్ కాలేజీ విధానం లేదా, ప్రత్యేక పూర్తిస్థాయి ఇన్ సర్వీసు శిక్షణ విధానంలో ఉద్యోగులను ఎంపికి చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచం అందుతున్నది. 

డిప్లమా అగ్రికల్చర్ చేసిన వారికి బిఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సర్వీసు శిక్షణ వచ్చి పూర్తయితే వీళ్లు మండల అధికారులుగా పదోన్నతి పొందవచ్చు. డిప్లమా హార్టికల్చర్ వారికి బిఎస్సీ హార్టికల్చర్ శిక్షణ పూర్తిచేసుకుంటే వీరు మండల హార్టికల్చర్ అధికారిగా పదోన్నతి పొందవచ్చు. డిప్లమా సెరీ కల్చర్ వారు బిఎస్సీ సెరీకల్చర్ పూర్తిచేస్తే మండల సెరీకల్చర్ ఆఫీసర్, డిప్లమా ఫిషరీష్ వాళ్లు బిఎస్సీ ఫిషరీష్ పూర్తిచే ఎఫ్డీఓ లేదా ఎఎఫ్ఇ, డిప్లమా వెటర్నరీ సైన్స్ వాళ్లు పశువైద్యులు , బివిఎస్సీ, డిప్లమా ఇంజనీరింగ్ వాళ్లు బిటెక్ ఇంజనీరింగ్( సివిల్, అండ్ ఎలక్ట్రకల్, అండ్ మెకానికల్) మండల ఇంజనీరింగ్ అధికారులు ఏఈగానూ,విద్యుత్ శాఖలో ఏఈలుగానూ  ఏఎన్ఎం చేసిన వారు జిఎన్ఎం(నర్శింగ్) పూర్తిచేసిన వారు స్టాఫ్ నర్సులుగానూ పదోన్నతులు పొందడానికి అవకాశం వుంటుంది. ఇప్పటికే ఏఎన్ఎంల ఇన్ సర్వీసు శిక్షణను రాష్ట్రప్రభుత్వం మరో ఏడాదిలో పూర్తిచేయబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7నుంచి 10వేల మందికి పైగా జిఎన్ఎం శిక్షణ పూర్తిచేయబోతున్నారు. వీరంతా శిక్షణ అంనంతరం మళ్లీ సచివాలయాలు, లేదా గ్రామీణ విలేజ్ క్లినిక్ విధులు నిర్వహించడానికి వినియోగించుకునే అవకాశం వుంటుంది. కాగా ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లుగా ఉన్నవారికి ఇన్ సర్వీసు బిఈడి లేదా డిఈడి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులుగా లేదా హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా పదోన్నతి కల్పించే అవకాశాలు, ఇతర శాఖల ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షల ద్వారా పదోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భారం పూర్తిగా తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. చూడాలి ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!