ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్ అయ్యన్నార్, వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌషల్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా విశ్వజిత్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా త్రివిక్రమ వర్మ, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్,విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కే. శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, అనంతపూర్ 14వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆర్. గంగాధర్‌రావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయిం అస్మీ, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్ నియామకం అయ్యారు. విశాఖ సిపి త్రివిక్రమ వర్మను అత్యంత తక్కువ సమయంలోనే బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో విశాఖ సిపీ ప్రభుత్వం అడిషనల్ రేంక్ అధికారిని నియమించింది.