ఉద్యోగులకు జీతాలులేని ‘సమగ్ర దసరాపండుగ శిక్ష’..!


Ens Balu
110
Tadepalli
2023-10-21 03:58:24

దసరా పండుగవేళ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో పనిచేసే కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా మూడు నెలల నుంచి జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 25వేలమంది క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిఆర్టిలు, ఎస్ఓలు గాపనిచేస్తున్నారు. విద్యాశాఖలోపెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి ప్రభుత్వంసక్రమంగా నెలనెలా జీతాలు విడుదల చేయడంలేదు. ఎన్ని సార్లుతమ సమస్యను జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా, జగనన్నకు చెబుదాం, స్పందన లాంటి కార్యక్రమాల్లో అర్జీలు పెట్టినా ఫలితంలేకుండాపోతుందని వీరంతా చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ తాము క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ, నేటికీ  మాకు రావాల్సినజీతాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేసుకొనిమరీవిధులు నిర్వహిస్తున్న వీరి విషయంలో ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వశిక్షా అభియాన్ లోని అందరూ చదవాలి..అందరూ ఎదగాలి..అనే సంకల్పంతో ప్రారంభమైన ఈస్కీములో పనిచేస్తున్న మాకు ఇచ్చే అరకొరజీతాలుకూడాసమాయానికి ఇవ్వడం లేదని విద్యాశాఖ అనుబంధంగాపనిచేస్తున్న వీరంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాముపనిచేసవన్నీ ఫీల్లుతరహా పనులని..ఎక్కడికి వెళ్లాలన్నా పైసాలేనిదే పనిజరగడంలేదని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. జీతంతక్కువే అయినా జీవితానికి భరోసా ఉంటుందని భావించి విధులునిర్వహిస్తున్నామని, అయినా ప్రభుత్వం తమపై కనీసం జాలి చూపించడంలేదని వాపోతున్నారు.తమకు రావాల్సిన జీతాల బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తే తప్పా తమకు ఏడాది దసరాపండుగ  చేసుకునే భాగ్యం కూడా కలగదని చెబుతున్నారు. సమగ్ర శిక్ష లో పనిచేసే ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు,బకాయిజీతాల విషయమై మండల విద్యాశాఖ అధికారి నుంచి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకూ అర్జీలు పెట్టుకున్నారు. తొలుత నాలుగు నెలలు జీతాలు బకాయిలు ఉంటే ఒక నెల జీతం ఇచ్చారు. ఇంకా పూర్తిగా రెండు నెలలు బకాయిఉంది. ఈపదిరోజులు  పూర్తయితే(ప్రభుత్వ శాఖల్లో 25వ తేది నుంచి 25వతేదికి నెలగాపరిగణిస్తారు,ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీలోగా సాలరీ బిల్లులు పెడతారు) పూర్తిగా మూడు నెలలు జీతాలు ఉద్యోగులకు అందాల్సి వుంటుంది.

 ప్రతీసారి ఉద్యోగులు జీతాల కోసంప్రభుత్వం చుట్టూ, విద్యాశాఖలోని ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వచ్చే అరకొర జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోతే తాము ఎలాబ్రతకగలమని,  పెరిగిపోతున్న నిత్యవసర సరుకుల ధరలు కూడా తమ ఆర్ధిక ఇబ్బందులకు తోడవుతున్నాయని వీరంతా గగ్గోలుపెడుతున్నారు. పండుగ వేళ పస్తులుంటున్న ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో పనిచేసే కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఆర్ధిక ఇబ్బందులు,కుటుంబ పోషణలను ద్రుష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం ద్రుష్టికి ఈసమస్యనుతీసుకెళ్లి కు జీతాల సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులంతా ముక్తకంఠంతో  సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.