జగనన్న ఆరోగ్య సురక్ష..అంగన్ వాడీలకు ఆర్ధిక శిక్ష


Ens Balu
39
Amaravati
2023-10-27 02:42:41

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అంగన్ వాడీ స్టాల్స్ చాలా చక్కగా కనిపించాలి..అన్ని రకాల ఆకుకూరలు, బరలవర్ధక ఆహారం ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి.. గర్శిణిలకు సీమంతాలు చేయాలి..బట్టలు పెట్టి, పూలు గాజులు ఇవ్వాలి..ఇవీ అంగన్ వాడీలకు జిల్లా అధికారుల నుంచి వచ్చే ఆదేశాలు. ఆదేశాలొస్తే..సదరు కార్యక్ర మాలకు నిధులు కూడా వస్తాయనుకునుకుంటే మీరు పొరపాటు పడినట్టే..నిధులా.. ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు ఐసిడిఎస్ అధికారులు...! ఏం ఆ మాత్రం పెట్టు కోలేరా..? జగనన్నకోసం ఒక్కరోజు ఖర్చుకూడా మీరు భరించలేరా..? ప్రతీదానికి నిధులు అంటే ఎక్కడి నుంచి వస్తాయ్..కొన్నింటిని సిబ్బంది మీ బాధ్యతగా నిర్వర్తిం చే యాలి..ఇలా చిన్న కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులంటూ ఏమీ ఇవ్వదు అని సన్నాయి నొక్కుల్లు నొక్కుతున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ల నుంచి ఆదేశాల రావడంతో అంగన్ వాడీలు ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో అయ్యే ఖర్చుమొత్తం వీళ్లే భరించాల్సి వస్తున్నది. అందులోనూ ఐసిడిఎస్ పౌష్టి కాహార ప్రదర్శన అంటే మామూలుగా ఉండదు. ఇవన్నీ నిజంగా గర్భిణిస్త్రీలు తింటే ఆరోగ్యం వీరికి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనేలా అన్ని రకాల వంటకాలు, ఆకు కూర లు, ఇతర పౌష్టికాహారం మొత్తం ప్రదర్శనకు ఉంచుతారు. 

ఇలా ఒకరోజు కార్యక్రమం చేసి, వచ్చినవారికి సీమంతాలు చేయాలన్నా ఒక్కో అంగన్ వాడీకి రూ.3 నుంచి 5వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేస్తుందా అంటే అదీలేదు. అంగన్ వాడీ కేంద్రాల్లో కేవలం, బియ్యం, గ్రుడ్లు, కందిపప్పు, పాలు, బెల్లపు చక్కీలు, కర్జూరం ప్యాకెట్లు, మంచినూనె మాత్రమే ఉంటాయి. ఇతర వస్తువలన్నీ వీళ్లు సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసుకోవాల్సిందే. పోనీ ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతో ప్రదర్శన పెట్టాలని చూస్తే మాత్రం వారికి హెచ్చరికలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతోపాటు, రకరకాల పిండివంటలు, ఆకు కూరలు, పౌష్టికాహారానికి సంబంధించిన మొత్తం వంటకాలు తేవాలంటూ హుకం జారీ చేస్తున్నారు. ఏం చేయాలతో పాలపోని పరిస్థితిలో అప్పలు చేసి మరీ గ్రామాల్లో ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేస్తే ఇద్దరు ముగ్గు అంగన్ వాడీలు కలిపి వారి చేతి డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సి వస్తున్నది. ఈ విషయం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లకు తెలిసినప్పటికీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం లేదు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నందున భారీగా కార్యక్రమాల్లో ప్రదర్శనలు చేయాలని మాత్రం హుకుం జారీచేస్తున్నారు.

 వచ్చే జీతాలే సక్రమంగా రాక అప్పులు చేసి మరీ అంగన్ వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న వర్కర్లు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరింతగా అప్పులు చేయాల్సి వస్తున్నది. మండల కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలు కాస్త భారీగా చేపడుతుండటంతో మండలంలోని అందరు అంగన్ వాడీలకు చేతి చమురు వదిలిపో తున్నది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో అనుకుంటే కాదు..రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అందులోనూ ఐసిడిఎస్ జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఆఫీ సర్లు, సూపర్ వైజర్లు కూడా కార్యక్రమాలకు హాజరవుతుండటంతో వారికి మళ్లీ ప్రత్యేకంగా మధ్యాహ్నాం భోజనాలు కూడా వీరే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నది. తమ అధికారులకు తాము ఏ విధంగానైనా భోజనాలు పెట్టుకోగలం కానీ, ప్రభుత్వ కార్యక్రమానికి తమతో ఖర్చులు పెట్టించి మరీ కార్యక్రమాలు చేయమంటే తాము ఎక్కడి నుంచి తేవాలంటూ అంగన్వాడీలు వాపోతున్నారు. విషయం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు తెలిసినా వీళ్లు కూడా ప్రభుత్వానికి ఈ సమస్యను నేరుగా చెప్పే పరిస్థితి లేదు. దీనితో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు మాత్రం ఐసిడిఎస్ సిబ్బందికి ఆర్ధిక శిక్షగానే మారుతున్నాయి. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అంగన్వాడీలు ముక్త కంఠంతో కోరుతున్నారు.