చంద్రబాబు ఆరోగ్యం కోసం తిరుమల శ్రీవారికి ఆడారి కిషోర్ పూజలు


Ens Balu
125
Tirumala
2023-11-19 07:09:14

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని..జైలు నుంచి తిరిగి వస్తే తిరుమల వస్తానన్న మొక్కును టిడిపి యువనేత ఆడారి కిషోర్ కుమార్ శ్రీవారికి పూజలు చేసి తీర్చుకున్నారు. ఈ మేరకు ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఒక విజన్ ఉన్న జాతీయ నాయకుడని..ఆయన బయట ఉంటే 2024ఎన్నికల్లో ఎక్కడ వైఎస్సార్సీపి ఓడిపోతుందోనని భయపడి అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెట్టిందని ఆడారి ఆరోపించారు. వైఎస్సార్సీపి కక్షరాజకీయాన్ని ప్రజల అంతా నిసితంగా గమనిస్తున్నారని, త్వరలనే సీఎంజగన్ ఊహించని రిటన్ గిఫ్ట్ తీసుకుంటారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగాలని ఆ శ్రీనివాసుడుని బలంగా కోరుకున్నానని అన్నారు. చంద్రబాబుకోసం శ్రీవారిని కోరుకున్న మొక్కులో నా కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయన ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారన్న ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకి తీసుకెళ్లడానికి, అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలకు తెలియజేసే చైత్యవేధిక సేవ్ డెమోక్రసికి శ్రీవారి ఆశీస్సులు కావాలని ఆవదేవదేవుడిని కోరుకున్నానని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుని వైఎస్సార్సీపి పెట్టిన అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు తీసుకురావాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు.   ఆడారి కిషోర్ వెంట సేవ్ డెెమోక్రసి ప్రతినిధులు పాల్గొన్నారు.