విశాఖలోని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ వైఎస్సార్సీపికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. విశాఖ నుంచే అసంతృప్తులు ఎక్కువవతున్నారని, దానికి గల కారణాలను కూడా సీఎం జగన్ ప్రశ్నించినట్టు సమాచారం అందుతోంది. విశాఖ తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే సీటు విషయంలోనే నిరసన వ్యక్తం చేస్తూ వంశీ పార్టీ రాజీనామాచేశారని, దాని ప్రభావం పార్టీపై పెద్దగా పడే అవకాశం కూడా ఉండదని సజ్జల ముఖ్యమంత్రికి తెలియజేసినట్టుగా చెబుతున్నారు. అయితే వంశీ విషయం ముందుగా తెలుసుకొని మాట్లాడి ఉండాల్సిందని..విశాఖ తూర్పుతోపాటు, అక్కడ నగరంలో యాదవుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్నందున దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉండే అవకాశాలున్నాయనే కోణంలోనూ సమాలోచనలు చేసినట్టు చెబుతున్నారు. అయితే అక్కడ ప్రస్తుస్తం వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలు ఆ లోటుని భర్తీచేస్తారని దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని, ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో మనపార్టీ తరపున సమన్వయకర్తగా ఉన్న ఎంవివి సత్యన్నారాయణ పూర్తిస్థాయిలో పట్టు పెంచుకుంటున్న విషయాన్ని ఇంటెలి జెన్స్ నివేదికలపైనా చర్చజరిగినట్టు సమాచారం అందుతుంది. కాగా పార్టీలో అసంతృప్తులు లేకపోతే ఆ పార్టీకి గుర్తింపు ఉండదనే విషయాన్ని మీడియా ముందు కూడా సజ్జల ప్రకటించడం కూడా సీఎం జరిగిన చర్చల నేపథ్యంలోనే చేసినట్టుగా చెబున్నారు. అయితే ఎమ్మెల్సీ వంశీ రాజీనామ తరువాత చాలా మంది నాయకులు క్యూ కట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా సీఎం కాస్త సీరియస్ గానే చర్చించినట్టు తెలుస్తోంది.