ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకుంటుందా..? పార్టీకి పూర్వ వైభవం వస్తుందా..? ఈ పార్టీలోకి చేరికలు భారీగా వస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితిలు..అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు రాకుండా భంగపడిన వారంతా ఇపుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చూస్తున్నారు. జాతీయ పార్టీ కావడం, 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆశావాహులంతా క్యూ కడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి దాటిన తరువాత ముహూర్తాలు చూసుకొని మరీ జంపింగ్ లు చేయడానికి కార్యాచరణ కూడా సిద్దమైందని చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70 స్థానాలకు పై చిలుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ వైఎస్ షర్మిల పార్టీలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసి అవకాశాలు రానివారంతా కాంగ్రెస్ లోకి చేరి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతుంది. సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టింగ్ లోకి వచ్చేయడం ఇపుడు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అటు జనసేన-బీజేపీ మధ్య పొత్తు, జనసేతో టిడిపి పొత్తు ఉండటంతో చాలా సీట్లు ఇటు టిడిపిలో కూడా సీనియర్లుకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి వారు కూడా ఇపుడు కాంగ్రెస్ లోకే వెళ్లే అవకాశాలు కినిపిస్తున్నాయి.
175 నియోజకవర్గాల్లో 70కి పైగా పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్ధుల్లో సుమారు 45 మంది బడా బడా నేతలే రంగంలోకి దిగుతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమా చారం. గత కొద్ది రోజులుగా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తున్న ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే, గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా అత్యంత కీలక వ్యక్తులే ఈసారి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి సుమారు ఏడు నుంచి 10 మంది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో 12 మంది, రాయలసీమం నుంచి 15, ఇప్పటి వరకూ తమ తమ సీట్లను ఖరారు చేసుకు న్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ నుంచి ఇంత మంది పోటీచేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోయే అవకాశాలు కనిపిస్తు న్నాయి. వైఎస్సార్సీపి, టిడిపి, జనసేన వారి వారి పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు ఉన్నా, అభ్యర్ధులు ఎక్కువ కావడంతో ఓట్లు చీలిపోయే పరిస్థితి నెలకొం ది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుమారు 40మందికి సీట్లులేవు..మరోజాబితా వస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశాలూ ఉన్నాయి.
దీనితో సీట్లు రానివారంతా ఇపుడు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ గూటికే చేరుతారన్నది స్పష్టం అవుతోంది. మరోవైపు అధికార పార్టీ కాకుండా మరే మారేపార్టీ నుంచి అభ్యర్ధులు నిలబడినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, యువత ఓట్లు పడే అవకాశాలూ ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ విషయంలో స్పష్టమైంది. ఎక్కువమంది ఎంపీస్థానాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీలు, సర్వశిక్షా ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ ప్రభుత్వం వారి డిమాండ్లను తీర్చకుండా బింకపట్టు పట్టుకొని కూర్చుంది. అదేసమయంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరడటం, ఆమె అనుచరులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కూడా క్యూలు కడుతున్నారు. ఈరోజు పేపర్ లెక్క నిజమైతే ఫిబ్రరి మొదటి వారంలోనే కాంగ్రెస్ తొలిజాబితా వెలువడే అవకాశాలున్నాయి. ఈ 2024 సాధారణ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, మూడు సామాజిక వర్గాల బలాబలాలు, ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ సమీకరణలు, జంపింగ్ జపాంగ్ లు వారి వారి బలాన్ని ఎంతలా ప్రదర్శించనున్నారనేది..!