అనకాపల్లిలో సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగి ఉసురు తీసింది ఉద్యమం. 21రోజుల పాటు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తూ అకస్మాత్తుగా మూగబోయింది జడ్డు వాసుదేవరావు గొంతు. జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తూ.. తమను ఎంటీఎస్ పరిధిలోకి తీసుకు రావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు ఇందులో భాగంగా తీవ్ర అస్వస్థకు గురున వాసుదేవరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీనితో కుటుం సభ్యులు ఇతర ఉద్యోగులు మృతదేహంతోనే డిఈఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధనకోసం ఉద్యమిస్తే.. మాకు దక్కేది మా సహచర ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడమా అంటూ ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్యోగుల ఆందోళన ఒకవైపు, మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మరోవైపు అక్కడి దశ్యాలు గుండెలను పిండేసే విధంగా కనిపించాయి. వాసుదేవరావు ఉద్యోగల ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించేవాడు. ఉద్యోగల డిమాండ్లసాధనకోసం ఏం చేయడానికైనా సిద్దమేనని ప్రకటించి ఉద్యమానికి ఊపిరి పోశాడు. అలాంటి ఉద్యమనేత ఉద్యమం చేస్తూనే ప్రాణాలు వదిలి తమను విడిచి వెళ్లిపోయాడంటూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు బరువైన గుండెలతో రోధించిన తీరు అందరినీ ఆలోచింప చేస్తున్నది. ఉద్యోగులు ఉద్యమిస్తే డిమాండ్లు పరిష్కారం అవుతాయని..కానీ సర్వశిక్ష ఉద్యోగుల విషయంలో సహచర ఉద్యోగిని కోల్పోవాల్సి వచ్చిందని ఉద్యోగులంతా గుండెలు బాదుకుంటున్నారు. ఇన్ని రోజులుగా రక రకాల విధానాల్లో తమ నిరసనచేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తరపున పోరాడి ప్రాణాలు త్యధించిన వాసుదేవరావు మృతిసాక్షిగా తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామనిహెచ్చరించారు.తక్షణమే మృతుని కుటుంబానికి ఆసుపత్రికి అయినఖర్చు, ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం కూడా చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అనకాపల్లి డిఈఓకి కూడా వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సర్వశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.