అక్టోబరులో శ్రీవారికి జరిగే ఉత్సవాలివే..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Tirumala
                            2020-09-29 16:21:40
                        
                     
                    
                 
                
                    తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరులో విశేష ఉత్సవాలను నిర్వహించడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ ను ద్రుష్టిలో పెట్టుకొని స్వామివారికి నిర్వహించే అన్ని కార్యక్రమాలను ప్రత్యక్ష్యంగా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా అందించనుంది. అక్టోబరు నెలలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు ఈ విధంగా ఉంటాయి... అక్టోబరు 1, 31వ తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ,15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ,16న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 20న గరుడసేవ,  21న పుష్పక విమానం,  24న చక్రస్నానం, 25న పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. స్వామివారికి నిర్వహించే ఉత్సవాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమాలే ఆలయ అర్చకులు అధికారులు పాల్గొంటారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ, కేసుల ఉద్రుతి అలాగే ఉన్నందున భక్తులను స్వామివారి ఉత్సవాల్లోకి అనుమతించడం లేదని పేర్కొంది..