ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిల ద్వారా అందుతున్న సేవలన్నింటిని భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ ( ఎన్సీఎస్) పోర్టల్ తో ఆన్లైన్ లో అనుసంధానించారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు సులభ రీతిన http://employment.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన యెడల వారికి లాగిన్ వివరాలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే ఎస్సెమ్మెస్ ద్వారా పండం జరుగుతుందని, సంబంధిత జిల్లా అధికారి వారి అభ్యర్థనను ఆమోదించిన తర్వాత వారికి ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియజేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్డ్ ను లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. సందేహాలకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఫోన్ 96407 60352 నెంబర్ కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు.