పదోన్నతులకు శాస్వతంగా దూరమైన సచివాలయ మహిళాపోలీసులు


Ens Balu
3127
Mangalagiri
2024-02-05 13:35:46

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు శాస్వతంగా పదోన్నతులకు దూరమయ్యే పరిస్థితి ఎదురైంది. ఏపీ హైకోర్టులో తేలని కేసులే వీరి పదోన్నతులకు శాపంగా పరిణమించాయి. ప్రభుత్వం కూడా వీరి విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే మహిళా పోలీసులకు అప్పగించే రకరకాలవిధులు(మల్టీటాస్కింగ్) భారంగా ఉన్నప్పటికీ గ్రామ, వార్డు స్థాయిలో వీరు సేవలందిస్తున్నారు. సచివాలయశాఖలోని 19ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్న వేళ వీరి పరిస్థితి మాత్రమే అగమ్య గోచరంగా మారింది. కోర్టులో కేసులు పడిన దగ్గర నుంచి మహిళా పోలీసులు ఏశాఖ ఉద్యోగులో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అన్ని శాఖల ఉద్యోగులు వీరితోనే చేయిస్తోంది ప్రభుత్వం. మిగిలిన ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే కాస్త అధికంగా ఉన్నఉద్యోగులు మహిళా పోలీసులు మాత్రమే. ఆ కారణంతోనే వీరిని ప్రభుత్వం అన్ని శాఖల పనులకూ వినియోగించేస్తున్నది. హైకోర్టులో పోలీసుశాఖ నుంచి అఫడివిట్ దాఖలుచేయడంతో వీరిని అధికారికంగా పోలీసు విధులకు వినియోగించడం లేదు. ఆయా సచివాలయాల్లో ఖాళీలనను బట్టి ఆయా ఖాళీలలోని ఉద్యోగుల స్థానంలో వీరిసేవలను వినియోగిస్తున్నది ప్రభుత్వం. 

ఇప్పటి వరకూ బాగానే ఉన్నా ఏప్రిల్ నెల నుంచి పంచాయతీరాజ్ శాఖలో వేల సంఖ్యలో కార్యదర్శిలు రిటైర్ కానున్నారు. అప్పుడు వీరిపై మరింత భారం పడనుంది. మొద టి బ్యాచ్ లో మెరిట్ లో వచ్చిన మహిళాపోలీసులతోపాటు, రెండవసారి గ్రేస్ మార్కులు కలిపిన మహిళా పోలీసుల విషయంలో కూడా కలిపిన మార్కులు ఆన్ కాలేదు. ఆ కారణంగా కూడా వీరి సీనియారిటి జాబితా మొదట నియమితులైన వారితోనే చేపట్టే అవకాశాలున్నా..కోర్టు కేసుల కారణంగా పోలీసుశాఖలో వీరిని ఉంచుతారా..? లేదంటే త్వరలో అత్యధిక సంఖ్యలో ఖాళీ అవుతున్న ఇతర ప్రభుత్వ శాఖల్లోనికి స్లైడింగ్ పద్దతి ద్వారా వీరికి ఆప్షన్లు ఇస్తారా అని జరుగుతున్న ప్రచారంలో కూడా క్లారిటీ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం, వీరి సీనియారిటీ జాబితాని రూపొందించాల్సి వుంటుంది. అందునా వీరికి ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేసినందున. కానీ పోలీసుశాఖలో వీరి నియామకాలు అన్నీ బోర్డు ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా డిఎస్సీ విధానంలో భర్తీచేసినవిధానంలో ఈ శాఖపై కోర్టులో కేసులు దాఖలు అయ్యాయి.

ఇప్పటికే రెండేళ్ల తరువాత సర్వీసులు రెగ్యులర్ పేస్కేలు పొందాల్సిన సచివాలయ ఉద్యోగులంతా అదనంగా ఆరు నెలలు పూర్తిపేస్కేలుకి నోచుకోలేదు. ఆ సమయంలో రెండు డిఏలు కూడా కోల్పోయారు. ఆతరువాత సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత కూడా రెండు ఇంక్రిమెంట్లవిషయంలో ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అంతేకాదు పీఆర్సీ ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన అరియర్స్ ను కూడా ఇవ్వలేదు. విధుల్లో చేరిన దగ్గర నుంచి అన్ని రకాలుగా నష్టపోయిన ఉద్యోగుల్లోని మహిళా పోలీసులు ఇపుడు అన్నిశాఖలకు సీనియారిటీ జాబితాలు సిద్దమవుతున్న తరుణంలో కోర్టు ఆఫడివిట్ మోకాలు అడ్డిశాస్వతంగా వీరికి పదోన్నతి కల్పించే విషయంలో ప్రతిబంధకం అయ్యింది. ప్రభుత్వం కూడా వీరి విషయాన్ని లైట్ తీసుకోవడంతో వీరి పని సచివాలయాల్లోని ఖాళీ ప్రభుత్వ శాఖల ఉద్యోగ బాధ్యతలు అధనంగా నిర్వహించ డానికి, బిఎల్వో విధులకు(అన్ని ఖర్చులూ వీరే భరించి..ఆఖరికి స్టేషనరీ,టిఏ ఖర్చులతో సహా) ఉపయోగపడుతున్నది. వాస్తవానికి అన్ని ప్రభుత్వశాఖల కంటే త్వరగా మహిళా పోలీసులకే సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

అలాంటి ఉద్యోగుల పరిస్థితి నేడు గాల్లో ఉంది. అసలు తాము ఏప్రభుత్వశాఖకు చెందిన ఉద్యోగులమో మాకే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుమహి ళా పోలీసు లు. కోర్టుకేసుల తరువాత వీరిని అధికారికంగా పోలీసు సేవలకు వినియోగించకపోవడం,అనధికారికంగా అన్నిశాఖల విధులకు వినియోగించేయడమే దానికి కారణం. ఈతరుణంలో సచివాలయ మహిళా పోలీసుల పదోన్నతుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇంత జరుగుతున్న ఏ ఉన్న ఎన్జీఓ సంఘ నేత కూడా వీరి విషయంలో ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లే దైర్యంచేయకపోవడం విశేషం..!