గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలు తప్పనిసరి..త్వరలో ఉత్తర్వులు


Ens Balu
382
Amaravati
2024-02-09 15:28:40

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 11, 252 గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శిని నియమించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ తరువాత సుమారు 2300లకి పైచిలుకు  పంచాయతీ కార్యదర్శిలు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతకంటే ముందుగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3వేల పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఒక్కో కార్యదర్శి రెండు నుంచి నాలుగు పంచాయతీలు ఇన్చార్జిలుగా అదనపు బాద్యతలు చూడాల్సి వస్తోంది. చాలా గ్రామపంచాయతీల్లో సిబ్బంది సమస్య అధికంగా ఉండటంతో గ్రామ సచివాలయాల్లోని మేజర్ పంచాయతీల్లో సచివాలయాల వారీగా నియమితులైన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను సింగిల్ పంచాయతీలకు నియమించాలని యోచిస్తున్నది. తొలుత ఆ విధంగా నియామకాలు చేపట్టిన తరువాత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల 4 గ్రామ వార్డు సచివాలయాల్లోని కార్యదర్శిల ఖాళీలను గుర్తించి వాటిని ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. 

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19శాఖల సిబ్బంది సీనియారిటీ జాబితాలను సిద్దం చేస్తున్న ప్రభుత్వం పనిలో పనిగా కార్యదర్శిల జాబితాలను కూడా తయారు చేస్తున్నది. వాటి ఆదారంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి వారిని గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా ఒక కార్యదర్శి ఉండే విధంగా భర్తీచేయనున్నది. అయితే ఇక్కడ మిగులు ఉద్యోగాలను కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలా..లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలోని 75ప్రభుత్వశాఖల్లో విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుంటుంబాల్లోని పిల్లలకు ఇచ్చే కారుణ్య నియామకాల ద్వారా భర్తీచేయాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నది. ప్రస్తుతం సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాలన్నింటినీ  ఆ విధంగానే ప్రభుత్వం భర్తీచేస్తున్నది. గత నాలుగేళ్లలో పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్య కార్యదర్శిలు గానీ, కమిషనర్ లు గానీ గ్రామ పంచాయతీల్లోని ఖాళీల భర్తీ విషయంలో పెద్దగా దృష్టిసారించలేదు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడి పోయింది. ఇన్చార్జిల పాలతో కార్యదర్శిలు కూడా వారి సొంత పంచాయతీలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా చాలా అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలు పరిష్కారం కష్టతరంగా మారింది. అదే సమయంలో ఏప్రిల్ లో భారీగా ఖాళీలు 
ఏర్పడుతుండటంతో ప్రభుత్వం ముందుగానే మేల్కొని సర్దుభాటు చర్యలు చేపడుతోంది.

 బహుసా ఎన్నికలకు ముందే అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలను నియమించే ఉత్తర్వులు వెలువనున్నాయి. అపుడు మేజర్ పంచాయతీల పరిధిలోని సచివాలయాల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలను సదరు ఖాళీల్లో నియమించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ ఎన్నికల ముందు చేయడం ద్వారా ఎన్నికల్లో పంచాయతీల డేటా ప్రభుత్వానికి సకాలంలో అందించడానికి వీలుపడుతుందని, పంచాయతీల నుంచి కార్యదర్శిలు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నది. అటు చాలా కాలంగా పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రెగ్యులర్ ఉత్తర్వుల ద్వారా రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకుంది. వారిని సచివాలయాల్లో బిల్ కలెక్టర్లు, గుమస్తాలు లేదా డిజిటల్ అసిస్టెంట్లుగా, గ్రేడ్-5 కార్యదర్శిలుగా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ విషయంలో ఏమైనా స్పష్టత వచ్చి గ్రేడ్-5 కార్యదర్శిలుగా తీసుకుంటే మాత్రం కొత్తనియామకాల భారం ప్రభుత్వంపై తగ్గుతుంది. ఇటీవలే పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో చాలా అంశాలను ప్రభుత్వం పరిశీలించినట్టు తెలిసింది. ప్రస్తుతం సచివాలయ కార్యదర్శిలుగా ఉన్నవారిని, ఇటీవలే రెగ్యులర్ చేసిన పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్ధుబాటు చేస్తే ఏప్రిల్ లో జరగనున్న భారీ ఖాళీలు చాలా వరకూ భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. చూడాలి ప్రభుత్వం 
అన్ని గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా కార్యదర్శిలను నియమించే తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!