ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయపార్టీలు వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుం బాల సాలిడ్ ఓట్లను వారిపైపునకు తిప్పుకోవడానికి అన్ని దారులూ వెతుకుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చేసిన రివర్స్ హామీలను ఓట్ బ్యాంకుగా మార్చుకునేందుకు పక్కాగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో 74 ప్రభుత్వశాఖల్లోని ఏ శాఖలోనూ జరిగి ఉండదనే కోణంలో ఆలోచిస్తున్నాయట. దానికోసం ప్రధాన ప్రభుత్వశాఖల ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై టిడిపి-జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకొని మరీ అధ్యయనం చేస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులు చేస్తూ.. సమస్యల పరిస్కారానికి కూడా హామీలిస్తున్నారని తెలిసింది. అసలే అధికార పార్టీపై ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారు. వారితోపాటు నాలుగేళ్ల క్రితం వీరితోపాటు చేరిన 1.30లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా వారి ప్రధాన సమస్యలను కూడా ఏ రాజకీయపార్టీ ముఖ్య నాయకులు వారిని సంప్రదిస్తుంటే వారి ముందు వల్లెవేస్తున్నారనే ప్రచారం ఇపుడు తాజాగా బయటకొచ్చింది. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా తమ సర్వీసులు రెగ్యులర్ అయినా తమశాఖకు చట్టబద్దత కూడా కల్పించని విషయాన్ని రాజకీయపార్టీ ముందు ఉద్యోగ సంఘాల నాయకులు వల్లె వేస్తున్నారని సమాచారం. పేరుకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్పప్పటికీ..తమ ప్రధాన సమస్యల పరిస్కారం కావడం లేదనే బాధ సచివాలయ ఉద్యోగులను వెంటాడుతున్నది. దానితో తమ సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయితే పక్కాగా హామీ ఇస్తే వారికే తమ ఉద్యోగు ఓట్లన్నీ వేస్తామనే అభయం కూడా సచివాలయ ఉద్యోగులు కూడా ఇస్తున్నారని..దానికోసం పది ప్రధాన సమస్యలును రాజకీయ పార్టీల ముందు ఉంచుతున్నారట.
ఆ సమస్యల చిట్టా ఏంటో ఒక్కసారి తెలుసుకుని..వారి ఆలోచన.. సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న వారి డిమాండ్లు తెలుసుకుంటే.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారనే సందేశంలోని ప్రధాన డిమాండ్లు..1)సర్వీస్ రెగ్యులర్ సమయంలో కల్పోయిన 9నెలల పేస్కేల్.. 2)సర్వీస్ రెగ్యులర్ అయిన తర్వాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు.. 3)కోల్పోయిన రెండు డిఏలు..4)పీర్సీ ఇచ్చామని చెప్పి ఎగ్గొట్టిన అరియర్స్.. 5) తేల్చని కోర్టుకేసులు..6)19 ప్రభత్వశాఖల్లో నేటికీ 5శాఖలకు పైగా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం..7)కేవలం కొన్నిశాఖల్లోనే ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి..మిగిలిన శాఖలను వదిలేయడం..8)ప్రమోషన్లు కూడా రెండు మూడు డిపార్ట్ మెంట్లకే ఇచ్చి మిగిలిన వారి కోసం పట్టించుకోకపోవడం..9) మిగులు ఖాళీలను భర్తీచేయకుండా రేషనలైజేషన్ పేరుతో సిబ్బందిని మదించేయడం..10)పంచాయతీ కార్యదర్శిలకి అధికారాలు ఇవ్వకపోవడం..ఇలా చెప్పుకుంటూ పోతే ఇబ్బందుల జాబితా గట్టిగానే ఉందట. ఏపార్టీ వీరి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుందో వారికే ఈసారి గుద్దాలని నిర్ణయించుకున్నారట. 1.30 లక్షల ఉద్యోగుల కుటుంబాలంటే ఎన్ని ఓట్లు తేడా వచ్చేస్తాయో ఒక్కసారి అర్ధం చేసుకోవాలి. ఒక్కో కుటుంబంలో సరాసరి నాలుగు ఓట్లు వేసుకున్నా.. 5.20లక్షల ఓట్లు ప్రభావితం చూపిస్తాయి. అంతేకాదు సచివాలయా లకు వచ్చిన ప్రజలతో ఉద్యోగులంతా ఏకమై తమ సమస్యలే పరిష్కరించని ప్రభుత్వం ఇక ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తుందని ఏ మాత్రం చెప్పినా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్కశాఖ కారణంగా సుమారు కోటి ఓట్లు ప్రభావితం అయినా అయ్యే అవకాశాలు లేకపోలేదని సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న వీరి డిమాం డ్లపై అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు..!