ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలను తక్షణమే నియమించాలని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జిఓనెంబరు-11 జారీ చేశారు. ఇటీవలే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లో గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలు తప్పనిసరి..త్వరలోనే ఉత్తర్వులు అనే ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. దానిని నిజం చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విశేషం. దీనితో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ప్రచురించే ముఖ్యమైన వార్తలకు వాస్తవికత ఉంటుందనేది మరోసారి రుజువైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని మేజర్ పంచాయతీల్లో ఒక్కోచోట గ్రేడ్-5 కార్యదర్శిలు ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాంటి వారందరికీ ఇపుడు ఇండివిడ్యువల్ పంచాయతీలు అప్పగిస్తారు. తద్వారా ఇన్చార్జి కార్యదర్శిదర్శి వ్యవస్థకు మంగళం పాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శిలు ఒక్కొక్కరూ మూడు నుంచి ఐదు పంచాయతీలకి ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఇలాంటి ఇబ్బందులు తొలగి దాదాపుగా అన్ని పంచాయతీలకు కార్యదర్శిలు రానున్నారు. 500 జనాబా దాటిన పంచాయతీల్లో నియమించే వారికి డిడిఓ పవర్స్ తోనే వీరిని నియమించాలనే నిబంధనను కూడా జీఓలో ప్రధానంగా పొందుపరచడం విశేషం. త్వరలో సాధారణ ఎన్నికలు వస్తుండటం, ఆ తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాలంటే ప్రతీ పంచాయతీకి కార్యదర్శి తప్పని సరి అని ప్రభుత్వం భావించి తక్కు సమయంలోనే ఈ నిర్ణయం తీసుకొని అమలు దిశగా చర్యలు తీసుకుంటోంది.