జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలు


Ens Balu
5
Tirupati
2024-02-20 11:58:33

 హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ను మంగ‌ళ‌వారం టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆవిష్క‌రించారు. తిరుప‌ తిలోని ప‌ద్మావ‌తి పురంలో గ‌ల ఛైర్మ‌న్ నివాసంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  ఈ ఆల‌యంలో మార్చి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నా యి. మార్చి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సే వ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 17న సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.   ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో ఎం.ర‌మేష్‌బాబు పాల్గొన్నా రు.