టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం


Ens Balu
13
Tirumala
2024-02-20 12:20:34

 బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీలోని  పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు.  తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం డీడీలను టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 33 లక్షలా 33 వేల రూపాయలు, ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షలా 11 వేల రూపాయలు  అందించారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.