ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు, వచ్చే ఫలితాలు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ చేయించిన సర్వే అయినా లోకల్ అభ్యర్ధి కాకపోతే.. ఆ ఓటు నోటాకి వేస్తామనే వాదనను ఓటర్లు బలంగా తెరమీదకి తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా అధికార వైఎ స్సార్సీపి నుంచి ప్రతిపక్ష టిడిపి వరకూ చాలాస్థానాల్లో నాన్ లోకల్ అభ్యర్ధులనే తెరమీదకు తీసుకు రావడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈఎన్‌ఎస్ నేషనల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈరోజు సంయుక్తంగా నిర్వహించిన గ్రౌండ్ లెవల్ సర్వేలోనూ ఇదే విషయం బయటకు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో సంచలన వాస్తవాలు బయటకి వచ్చాయి. ము ఖ్యంగా తమ ప్రాంతాలు అభివ్రుద్ధి చెందాలంటే స్థానిక నాయకులు ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందనే విషయాన్ని 70శాతం మంది ఓటర్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాజకీయం అంతా నాన్ లోకల్ అయిపోయిందని, దాని వలన స్థానిక నాయకత్వం పరిస్థితి ఆగం అవుతుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలా వరకూ అంతా నాన్ లోకల్ వాల్లే వచ్చి జిల్లాల్లో వారి వ్యాపారాలు చేసు కుంటున్నారని.. ఎక్కడా అభివ్రుద్ధి అనేది కనిపిం చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో నాన్ లోకల్ అభ్యర్ధికి వేసే ఓటు నోటాకి వేస్తే కనీసం ఓటు హక్కు వినియోగిం చుకున్నా మనే సంత్రుప్తి అయినా మిగులుతుందనే మాట వాడు తున్నారంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు.
దానిక ితోడు నాన్ లోకల్ నాయక త్వాన్ని రాజకీ యపార్టీ లు అభ్యర్ధులు పెట్టే ఆర్ధిక మొత్తాలను చూసి ప్రోత్సహిస్తున్న తీరుపై విద్యావం తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎంతకాలం నాన్ లోకల్ అభ్యర్ధుల నాయత్వంలో స్థానిక నాయకత్వం పనిచేయాలని పెదవి విరుస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన రాజకీయ నాయకులకి స్థానిక సమస్యలు, అభివ్రుద్ధి ఏం తలకెక్కుతుందని..మరే విధంగా ద్రుష్టి సారిస్తారో చెప్పాలంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంద్రా, ఉబయ గోదావరి జిల్లాల్లో అయితే నాన్ లోకల్ పాలిటిక్స్‌ని ఈసారి తిప్పి కొడతామని బల్లగుద్ది మరి చెబుతుండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రమంతా రాజకీయ వ్యాపారం జరుగు తుందని..ఆదిలోనే దానిని తిప్పికొట్టకపోతే దాని ప్రభావం అన్ని జిల్లాల కు పాకి స్థానిక నాయకత్వం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా రావొచ్చునని..ఇప్పటికే నాన్ లోకల్ డామినేషన్ అన్ని రంగాల్లో పెరగిపోతున్నందున ఓటర్లు మేలుకోకపోతే నాన్ లోకల్ లీడర్లు చేసే రాజకీయ వ్యాపారంలో ఓటర్లు వస్తువులైపోతారనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. లోకల్ ఫీలింగ్ తెలియడం కోసం సామాజిక మాద్యమాలు, ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకునే సమయంలో లోకల్ నాయకులు ముద్దు..నాన్ లోకల్ నాయకత్వం వద్దు అనే స్లోగన్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న విషయం కూడా బయటకు వచ్చింది.ప్రజల నాడి సర్వేల ద్వారా రాజకీయపార్టీలకు చేరకపోతే తమ ప్రాంతాల ఉనికి కూడా ప్రశ్నార్ధకం అయిపోతుందని..దానిని తిప్పికొట్టడం కోసమే లోకల్ పాలిటిక్స్‌కి మాత్రమే మద్దతు చెబుతున్నామని, తమకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని 65శాతం మంది చెప్పారు. 23 అంశాల్లో చేసిన సర్వేలో ప్రజలు బలంగా తమ వాణిని బెరుకు లేకుండా వినిపిచారు. ఈఎన్‌ఎస్`ఈరోజు నిర్వహించిన 23 అంశాలను, ప్రజాభిప్రాయాన్ని వచ్చే కథనంలో తెలియజేయనున్నాం.