ఆయుష్ లో అడ్డదారి ఆగడాలు..!


Ens Balu
157
Amaravathi
2024-03-17 12:32:33

ఆయుష్ లో అడ్డదారిలో ఉత్తర్వులిచ్చి స్టేట్ లెవల్ పోస్టులను కుదించేయడానికి ఇదేశాఖలోని కమిషనర్  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేదో ప్రభుత్వానికి మేలు చేయ డానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎస్సీ, ఎస్టీ వైద్యాధికారులకు పదోన్నతులు రాకుండా అడ్డుకోవడానికి తన పరిధిలోని విచక్షణాధికారాలను అడ్డుపెట్టి మరీ ఫైల్ సిద్దం చేశారు. విషయం తెలుసుకున్న ఆయుష్ శాఖలోని దళిత వైద్యులు ఏకమై విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం, మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈవిషయం రాష్ట్రంలో సంచలనం అవుతోంది. ఈ తంతు నడిపించానికి ఇదే శాఖలో ఆర్డీడి గా పనిచేస్తున్న ఒక అధికారి సహాయ సహకారాలు అందిస్తున్నారని సమా చారం. తమకు జరుగుతున్న అన్యాయంపై మాతృశాఖలోని అధికారుల ద్వారా పనిజరగదని బావించిన సీనియర్ మెడికల్ ఆఫీసర్లు విషయాన్ని మీడియాకి లీక్ చేయ డంతో వ్యవహారం మొత్తం బట్టబయలైపోయింది. రాష్ట్రస్థాయిలో ఆరుగురు ఉండాల్సిన ఆఫీసర్ స్ట్రెంగ్త్ ను ఆగమేఘాలపై ఐదుగురికి కుదించి ఫైలును సిద్దం చేసి వైద్యఆరో గ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ.క్రిష్ణబాబుకి పంపారు ఇదేశాఖలోని కమిషనర్. ఇది జరిగితే ఖచ్చితంగా రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతి అవకాశం కోల్పోతా మని భావించిన ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలంటూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 

అదే సమయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈరోజు ద్వారా కూడా ఫిర్యాదుని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి చేర్చింది. వెంటనే అప్రమత్తం అయిన ఆరోగ్యశా ఖముఖ్యకార్యదర్శి ఈ విషయంపై కమిషనర్ ను పిలచి మాట్లాడారట. అయితే వెంటనే ఫైల్ ని తిరిగి సరవరణలు చేసి పంపాలని ఆదేశించినప్పటికీ కమిషనర్ ఆ ఫైలుని పోస్టులని కుదించాలనే తలపుంతోనే ఉన్నారని చెబుతున్నారు. ఏ అధికారినైతే గుడ్డిగా నమ్మి సహాయ సహకారాలు తీసుకుంటున్నారో సదరు ఆర్డీడీ కూడా తనకు తెలి సిన మీడియాకి మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్టుగా లీక్ చేసేశారని కూడా చెబుతున్నారు. ఇలా చేస్తే తనపై ఉన్న అవినీతి ఆరోపణల విషయం పక్కదారి పట్టి..కేడ ర్ స్ట్రెంగ్త్ విషయంపైకే మీడియా దృష్టి వెళ్లిపోతుందని సదరు అధికారి బావించారని సమాచారం అందుతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఎలాంటి పరిపాలన పరమైన పదోన్నతులు, ఉన్నపోస్టుల కుదింపు చేయడానికి అవకాశం లేదు. కానీ పాత తేదీలతో ఫైలుని నడపాలని చూసినా..విషయం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి దృష్టికి వెళ్లడంతో మొత్తానికి అడ్డుకట్ట పడినట్టుగా సమాచారం అందుతుంది. ఆయుష్ లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఇదేశాఖకు చెందిన వైద్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 

ఏదైనా ప్రభుత్వశాఖలో అన్యాయం జరిగితే తమ బాధలను కమిషనర్ దృష్టికి తీసుకెళారని..కానీ ఏకంగా కమిషనరే తమ దళితులకు దక్కాల్సిన పదోన్నతులను ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కుదించేయాలని చూడటంతోనే తమన బాధను ముఖ్యమంత్రికి ఫిర్యాదు ద్వారా విన్నవించుకున్నామని సీనియర్ వైద్యాధికారులు వాపోతున్నారు. సర్వీసు నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న క్యాడర్ స్ట్రెంత్ కుదింపు విషయంలో తక్షణమే విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు వచ్చే పదోన్న తులు నష్టపోకుండా చూడాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరజేషన్ విషయంతో ఏక పక్షంగా వ్యవహరించి కొందరికి పారామెడి కల్ సిబ్బందికి పోస్టులు రెగ్యులర్ చేయకుండా చేసిన విషయంలో అటు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కూడా గుర్రుగా ఉన్నారు. అందులోనూ ఇపుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినందు..పోస్టులు రెగ్యులర్ కాని వారి అభ్యర్ధనలు ఇపుడు కమిషనరేట్ గాల్లో ఉన్నాయి. వీరు కూడా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని కలిసిన సందర్భంలో కమిషనర్ ని సదరు ఫైల్ విషయమై ముఖ్యకార్యదర్శి ప్రశ్నించినా రెగ్యులర్ ఉత్తర్వులు ఇవ్వకుండా 12మంది ఉద్యోగుల విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిషనర్ ఉండిపోయారన చెబుతున్నారు. 

అయితే దళితులను చిన్నచూపు చూస్తూ..వారికి రావాల్సిన పదోన్నతులు శాస్వతంగా తొక్కిపెట్టడానికి కమిషనర్ ఈ తరహా చర్యలు చేపడుతున్నారని దళిత వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి న్యాయం చేయాలంటూ సీఎంఓకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో రంగంలోకి దిగిన ముఖ్యకార్యదర్శి ఎంటి క్రిష్ణబాబు వద్ద రెండు వ్యవహారాలు హాట్ హాట్ గా నలుగుతున్నాయి. చూడాలి కమిషనర్ చర్యలను ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సమర్ధిస్తారా..? లేదంటే దళత వైద్యులకు న్యాయం చేయడానికి సర్వీసు నిబంధనల ప్రకారం అనుసరిస్తారా..? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్నిక కోడ్ కూసిన వేళ ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు..!