ఆయుష్ లో రెగ్యులర్ రచ్చ..!


Ens Balu
507
amaravathi
2024-03-18 03:57:08

ఆయుష్ లోని ఉన్నతాధికారులు ఏక పక్ష నిర్ణయాలు ఏకంగా 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులు గాల్లోనే ఉండిపోయాయి. ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిన నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ శాఖలో 34 మంది పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కమిషనర్ ఎస్.బి.రాజేంద్రప్రసాద్ అందులో కేవలం 22 మంది ఉద్యోగులనే రెగ్యులర్ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబుకి ఫైలు పంపారు. ప్రభుత్వం ఇచ్చింది కేవలం వీరికే అనుకొని ముఖ్యకార్యదర్శి కూడా ఫైలుపై సంతకం చేసేశారు. తీరా ఇంకా 12 మంది ఉద్యోగులం మిగిలిపోయాని ఉద్యోగులంతా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వెంటనే కమిషనర్ ను మిగిలిన ఉద్యోగుల ఫైల్ కూడా పెట్టాలని ఆదేశించినా..వారి నియామక సమయంలో రోస్టర్ పాయింట్లు తేడాలున్నాయని..వాటిని రిజిస్టర్ చేయడంలో తప్పులున్న కారణంగానే వాటిని పెట్టడం కుదరలేదంటూ ముఖ్యకార్యదర్శికి సమాధనం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వమే జాబితా సిద్దం చేసి ఆయుష్ శాఖకు పంపితే కేవలం 22 మందికి మాత్రమే ఎలా పెడతారని కమిషనర్ పై ఆరోగ్యశాఖ కార్యదర్శి సీరియస్ అయినా ఫలితం రాలేదు.

 అలా అని వారి ఫైల్ ని రిజక్ట్ కూడా చేయకుండా కమిషనర్ వద్దనే ఉంచుకోవడంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశతో విధులు నిర్వహిస్తుంటే..ఇపుడు ఉన్నతాధికారులు చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి తమ భవిష్యత్తుని గాల్లో పెడుతున్నారని రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయాన్ని కమిషనర్ కి బాగా అనుకూలంగా ఉన్న ఓ ఇద్దరు ఆర్డీడిలు మీడియాకి లీకులిచ్చినట్టు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కమిషనర్ తమను ఇబ్బందులు పెట్టారని..ఇపుడు ప్రభుత్వం ఆదేశాలిస్తే కావాలనే కమిషనర్ 12 మంది పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయడానికి ప్రపోజల్ ఫైల్ పెట్టకుండా కేవలం 22 మంది ఉద్యోగులవి మాత్రమే పట్టారని విషయం బయటకి బొంకినట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ అయిన వారికి ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా కమిషనర్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విషయాలు తెలుసుకునే అనకూలితులే బయటకు పంపారని చెబుతున్నారు. ఇపుడు ఆ ఉత్తర్వులుకాస్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఆయుష్ శాఖలో ఆది నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న కమిషనర్ ఇపుడు 12 మంది పారామెడికల్ ఉద్యోగుల విషయంలో ఏకంగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలను కూడా పక్కనపెట్టి ఉద్యోగు రెగ్యులర్ ఫైల్ ప్రపోజల్ పెట్టకపోవడం చర్చనీయాంశం అవుతుంది. 

విషయం కోర్టుకెక్కితే ముఖ్యకార్యదర్శి సమాధానం చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖలోని ఆయుష్ విభాగంలో 34 మంది పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆర్డరు వేస్తే దానిని అమలుచేయని కారణంగా ఉద్యోగులు కోర్టుకి వెళ్లినా..సర్వీసు నిబంధనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా..దానికి ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సమాధానం చెప్పాల్సి వుంటుంది. అయితే ఈ విషయంలో ఆయుష్ కమిషనర్ ఎస్.బి.రాజేంద్రప్రసాద్ నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తున్నది. ఒకవేళ విషయం కోర్టుకెక్కితే ముఖ్యకార్యదర్శి తప్పులేకుండా ఉన్నది ఉన్నట్టు లిఖిత పూర్వగా కోర్టుకి నివేదించినా కమిషనర్ మీద చర్యలు పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇస్తే.. చిన్న చిన్న కారణాలు, రోస్టర్ పాయింట్లలో నమోదులను సాకుగా చూపి ఏకంగా ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను ఆపేసిన కమిషనర్ చర్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే పలుప్రభుత్వ శాఖల్లోని అఖిల భారతస్థాయి అధికారుల నిర్ణయాల వలన ప్రభుత్వం కోర్టులకి సమాధా నాలు చెబుతూ వస్తుంది. ఈ రెగ్యులరైజేషన్ విషయంలో కోర్టు మెట్లెక్కితే ఆయుష్ శాఖ నుంచి సమాధానం చెప్పాల్సిందే నంటున్నారు అధికారులు కూడా. కాగా ఈ విషయంలో కొందరు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మార్చడానికే ఈ విధంగా కావాలనే ఉద్యోగుల ఫైలుని ఆపించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినందున..ప్రస్తుతం 12మంది పారామెడికల్ ఉద్యోగాలను ఆయుష్ కమిషనర్ ప్రపోజల్ ఫైల్ ద్వారా రెగ్యులర్ చేస్తుందా..లేదంటే కమిషనర్ నిర్ణయానికి ప్రభుత్వం సహకరించి ఉద్యోగులను గాల్లోనే ఉంచుతుందా అనేది వేచి చూడాలి. సర్వీసులు రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన 12మంది పారామెడికల్ ఫైలు మాత్రం కమిషనర్ ప్రపోజల్ కోసం ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు వద్ద ఉన్నట్టు తెలిసింది. నేడు ఈ ఫైలు విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..?!