గ్రామ సచివాలయాలకు దిక్కెవరు..?!


Ens Balu
672
amaravathi
2024-04-07 02:04:47

గ్రామ, వార్డు సచివాలయ శాఖ దేశంలోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏర్పాటైన ఒక సరికొత్త ప్రభుత్వ శాఖ..ఈ శాఖ ఏర్పాటు చేయడంతోనే ఒకేసారి సుమారు 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీచేశారు. అప్పుడే దేశం మొత్తం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పేలా చేశారు సీఎం. వైఎస్.జగన్మోహనరెడ్డి. అయితే ఆ గౌరవం ఎంతో కాలం నిలువ లేదు. హడావిడిగా ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి ఉద్యోగాలనైతే భర్తీచేశారు తప్పితే ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ఈశాఖ ఉద్యోగులకు తమ ఉద్యోగాలపై నేటికీ గ్యారెంటీ లేదు. దానికి కారణం ప్రభుత్వం చేసిన తప్పిదం వలనే నేటికీ ఈ శాఖకు అధికారికంగా చట్టబద్ధత లేకుండా పోయింది. దీనితో ఈ శాఖ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోననే అనుమానం ఇతర 74 ప్రభుత్వ శాఖల్లోనూ ఉంది. అందులోనూ గ్రామస్థాయిలో మహిళలకు రక్షణగా ఉంటారని నియమించిన సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగాలు కోర్టులో పడ్డ కేసు వలన ఇపుడు వీరంతా ఏ శాఖకు చెందిన ఉద్యోగులుగా పరిగణించ బడుతున్నారో ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది.

ఇతర ఉద్యోగులతోపాటుగా ఏదో ఒక పనిచేయిస్తూ జీతాలైతే ఇస్తుంది తప్పితే.. కోర్టుకి సమర్పించిన అఫడవిట్ కారణంగా వీరిని పోలీసుశాఖ ఉద్యోగులుగా మాత్రం అధికారిగా గుర్తించలేదు.. వీరికి ఆ శాఖ పనులు కూడా చెప్పడం లేదు. అలాగే ఇంజనీరింగ్, వెల్ఫేర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు నేటికీ సర్వీసు నిబంధనలను ప్రభుత్వం తయారు చేయలేదు. వీరికి రేపు అన్నరోజు పదోన్నతులు వస్తే ఏ శాఖలోకి వీరిని పంపుతారో ప్రభుత్వానికే క్లారిటీ లేకుండా పోయింది. మహిళా పోలీసులకు సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు అయినా వీరి ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుని విరుద్దంగా జరిగాయనే కారణంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఫలితంగా వీరికి కూడా పదోన్నతులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో తమ ఉద్యోగాల విషయంలో ఏ పార్టీ అయితే స్పష్టమైన హామీ ఇస్తుందో వారికే తమ మద్దతు అనే విధంగా ఉద్యోగులు ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ వారి ఉద్యోగాల విషయంలో అన్ని అంశాల్లోనూ క్లియర్ గా ఉన్నవారు, పదోన్నతులు పొందిన వారు వైఎస్సార్సీపీకి విధేయులుగా ఉన్నట్టు కనిపించినా, మిగిలిన విభాగాల్లోని ఉద్యోగులు మాకు తీవ్రమైన అన్యాయం జరిగిందనే కోపంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నది. ఈ మేరకు ఏ పది మంది ఉద్యోగులు కలిసినా..ఇదే టాపిక్ పై చర్చలు నడుస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక అని భారీస్థాయిలో ప్రకటనలు చేసినా..ఈశాఖ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తూనే వచ్చింది. నాలుగేళ్లలో ఈ శాఖకు అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకురాలేదంటేనే అర్ధం చేసుకోవచ్చు. కొన్ని శాఖల ఉద్యోగులకే ప్రయోజనాలు దక్కి.. మరికొన్ని శాఖల ఉద్యోగులు నష్టపోయే విధంగా తయారుచేసిన సర్వీసు రూల్సు, ప్రమోషనల్ ఛానల్ ఇపుడు ఉద్యోగులందరినీ తవ్రంగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో తమ ఉద్యోగాలు,పదోన్నతులు విషయంలో ఏ రాజకీయపార్టీ అయితే పక్కగా చెబుతుందో వారికే తమ మద్దతు, ఓటు వేస్తామని కొందరు సచివాలయ ఉద్యోగులు బాహాటంగానే చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టిడిపితో కూడిన కూటమి ఇంకా ఎవరూ తమ తమ మేనిఫెస్టోలను ప్రకటించలేదు. చూడాలి గ్రామవార్డు సచివాలయశాఖ ఆదుకునేలా, ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగేలా ఏ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చేర్చుతారనేది..!?