సీపీఎస్ రద్దుచేస్తేనే మా ఓటు..!


Ens Balu
258
amaravathi
2024-04-07 19:29:02

నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే.. ఇది ఏ సినిమాలో డైలాగో గుర్తింది కదా..రజనీకాంత్ నటించిన భాషా సినిమాలోనిది.. అ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది కూడా.. ఇపుడు అదే డైలాగ్ ను ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాజకీయపార్టీల దగ్గర వల్లెవేస్తున్నారు. అంతేకాదు మాకు ఏదీ రెండోసారి చెప్పే అలవాటూ లేదంటున్నారు. అవునండీ సీపీఎస్ రద్దు చేస్తేనే మా ఓటు మీకు వేస్తామని..లేదంటే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాదు చాపక్రింద నీరుగా రాష్ట్రప్రభు త్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, వారి వారి సోషల్ మీడియాల్లో వీటిపైనే ప్రధానంగా చర్చలు పెడుతున్నారు. కొన్ని రాజకీయపార్టీలు వారికి అనుకూలంగా వున్న ఉద్యోగ సంఘాల నేతలతో రహస్య మంతనాలు, సిటింగ్ లు, సంప్రదింపులు చేస్తున్నా.. అంతా ఒకే మాట చెప్పంతో అధికార పార్టీ  నుంచి ప్రతిపక్ష పార్టీల వరకూ అందరూ తలలు పట్టుకుంటున్నారు. అదేంటీ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లు లేకపోయినా పక్కాగా మ్యాజిక్ ఫిగర్ తోనైనా గెలిచి జెండా ఎగురేస్తామనే రాజకీయపార్టీల ధీమా ఇపుడు కాస్త సన్నగిల్లినట్టే కనిపిస్తున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒకరే రకంగా సమాధానం చెప్పడం, ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం మిశ్రమంగా స్పందించడం చర్చనీయాంశం అవుతున్నది.

రాష్ట్రంలో గత నాగులు రోజుల వ్యవధిలో ప్రధాన రాజకీయపార్టీలకు చెందిన నేతలు, వారి అనుకూల ఉద్యోగ సంఘాలతో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఉద్యోగుల డిమాండ్లను వారి ముందు ఉంచడంతో నాయకులు తెల్లమొహం వేశారట. ఒకానొక దశలో మీరు ఎవరి అండ చూసుకొని ఇంత దైర్యంగా మాట్లాడుతున్నారు..? మీ ఓట్లు, మీ కుటుంబాల ఓట్లు పడకపోతే నష్టమా అని బెదిరించే పనిచేసినా.. మీరంతా ఏం చేసినా..విధి నిర్వహణ పేరుతో ఎలాంటి ఇబ్బందులు పెట్టినా..? ఈసారి ఎన్నికల్లో మాకు నమ్మకం కలిగించే పార్టీలు, పక్కాగా హామీ ఇచ్చి వాటిని అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అమలు చేసే పార్టీలకే మా ఓటు వేస్తామని చెప్పడంతో వారంతా ఈ విషయాన్ని మా పార్టీ అధిష్టానం వద్ద ఉంచుతామని..వాళ్లు ఒప్పుకుంటే మరోసారి మిమ్మల్ని కలుస్తామని..లేదంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చునని చెప్పేసి వెళ్లిపోయారని తెలిసింది. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రథినిధుల ముందు ఉంచిన డిమాండ్లు ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే.. ప్రధానంగా సీపిఎస్ రద్దు చేయాలని, రివర్స్ పీఆర్సీ లాంటి తేడా వ్యవహారాలు చేసి ఉద్యోగులను మోసం చేయకూడదని, పక్కగా ప్రతీ ఐదేళ్లకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలని, సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలు రద్దుచేసి..ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, సరెండర్ లీవులు, అరెయర్ బిల్స్ ఒకేసారి విడుదల చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయాలని, ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, అటెండర్ దగ్గర నుంచి గ్రూప్-1 అధికారి వరకూ అన్ని కేటగిరీల్లోనూ ఉద్యోగులకు పక్కాగా పదోన్నతులు కల్పించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా వారికి కూడా అన్ని ప్రయోజనాలు కల్పించాలని, కోర్టు కేసులతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వ సెలవులు, రెండవ ఆదివారాల్లో ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చే విధంగా అధనపు పనులు పురమాయించకూడదని, పెన్షనర్లకు ఒకటోతేదీ నాటికే పెన్షన్లు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులందరికీ సర్వీసు చివరి రోజే అన్ని ప్రయోజనాలు ఒకేసారి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఉపాధ్యాయులతో విద్య తప్పా, కార్యాలయ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాలల్లో ప్రత్యేకంగా పనులు చేసేందేకు గ్రూప్-4 ఉద్యోగులను నియమించాలని, సర్వీసు నిబంధనల ఆధారంగానే విధులు, పనులు చేయించాలి తప్పితే 
ఉద్యోగులకు ఖాళీ అనేది లేకుండా అదనపు పనిభారం మోపకూడదని, ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బ్యారర్లకు ప్రాధాన్య ఇస్తూ బదిలీల్లో వారికున్న ప్రయోజనాలు అమలు చేయాలని, ఉద్యోగులపై ఐటీ దాడులు వంటి వేధింపులు నిలుపుదల చేయాలనే డిమాండ్లు రాజకీయపార్టీల ప్రతినిధుల వద్ద పెట్టడంతో తెల్ల మొహం వేయడం వారి వంతైందని కూడా చెబుతున్నారు.

ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సేవకులుగా ఉండేవారిని గౌరవించి వారితో చక్కగా పనులు చేయించుకోవాలి తప్పితే కక్షసాధింపు చర్యల కు పాల్పడితే మాత్రం ఈసారి ఓటు రూటు మారుతుంది తప్పితే రుబాబు చేస్తే మాత్రం చెల్లదని కూడా బెరుకు లేకుండా అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒకే 
చెప్పడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వాస్తవానికి అన్ని ఉద్యోగ సంఘాల్లోనూ అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగు లు ఉంటారు. వారి ప్రయోజనాలకోసం ఉద్యోగులను బలిపశువులను చేసే వారూ ఉంటారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ కళ్లు తెరుచుకునే విధంగా రివర్స్ పీఆర్సీ ఇవ్వడం, పదోన్నతులు ఆలస్యంగా చేపట్టడం, డిఏలు ఏళ్లకు ఏళ్లు విడుదల చేయకుండా వదిలేయడం, ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం, పీఆర్సీ అంటే అంకెల గారడీలా చేసి చూపించడం, సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి..దానిని జిపిఎస్ గా మార్చి వారి పంతాన్ని నెగ్గించుకోవడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పంతానికి వారికి నెల నెలా ఇవ్వాల్సి జీతాలు 10, 15 తేదీలు దాటిన తరువాత విడుదల చేయడం వంటి చర్యలకి పాల్పడంతోనే ఉద్యోగులంతా ఒక నిర్ణయాణికి వచ్చి..రానున్న రోజుల్లో ఉద్యోగుల మనుగడే ప్రశ్నార్ధం ఉండబోతుందని భావించి ముందుగానే మేల్కోవడానికి రక్షణ చర్యలు  చేపట్టారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి వైఎస్సార్సీపీకి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అలాగని అందరూ వ్యతిరేకంగా ఉన్నారా..? అదీకాదు.. మరీ అలాగని ప్రతిపక్ష టిడిపి కూటమికి ఓట్లు వేస్తారా అంటే అక్కడి నుంచి స్పష్టమైన హామీ కూడా రాలేదు. పైగా రెండు పార్టీలు వారి వారి మేనిఫెస్టోలు విడుదల కూడా చేయలేదు. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్లు ముందుగా చెబితే ప్రయోజనం ఉంటుందని భావించి తమ జాగ్రత్తో తాము ఉన్నారని సమాచారం అందుతుంది. అంతేకాదు ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు, వాయిస్ మెసేజులు చక్కర్లు కొడుతున్నాయి. శని, ఆదివారాల్లో ఓ ఐదుగురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ కలిసినా వచ్చే ఎన్నికల్లో చేయాల్సిన, చేపట్టాల్సిన వ్యూహంపైనే చర్చిస్తున్నారట. ఉద్యోగులు, వారి కుటుంబాల ఓటు పవర్ ఏంటో ఈసారి ఎన్నికల్లో చూపించి వార్ వన్ సైడ్ అయితే ఎలా వుంటుందో తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చే వారికి మాత్రం పక్కాగా ఓటు వేయాలని నిర్ణయానికి కూడా వచ్చారట. చూడాలి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓట్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో..వారి డిమాండ్లను ఏ పార్టీ ఓప్పుకుంటుందో..!