పోలీసుల వీక్లీ ఆఫ్ ఏమైనట్టు..?!


Ens Balu
80
visakhapatnam
2024-07-02 19:04:57

ఆంధ్రప్రదేశ్ పోలీసులను గత ప్రభుత్వం చేసిన మోసం ఇంతా అంతా కాదు.. వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్ ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లు ఈ విషయాన్ని నాన్చేసింది తప్పితే దానిని అమలు చేయలేదు. పైగా వివిధ రకాల అలవెన్సులు కూడా కోత విధించేసింది. సాధారణ ప్రజలకు మాత్రం పోలీసులకేంటి..ఖాకీ చొక్కా వేసుకుంటే కాసుల వర్షం కురుస్తుందనే బావన ఉంటుంది. కానీ వారం అంతా పనిచేయాలంటే ఎవరికైనా కష్టమే కదా.. ఒక్కోసారి అవసరం అనుకుంటే 24 గంటలూ కూడా పోలీసులు పనిచేస్తారు. ఆవిషయం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి తెలుసు. అనాధిగా వస్తున్న ఈ విధానం మారుస్తామని.. పోలీసుశాఖ మొత్తాన్నే గత ప్రభుత్వం ఏమార్చింది. దీనితో 2019 ఎన్నికల్లో ఎగేసి మరీ తమ ఓట్లను గుద్దారు పోలీసులంతా. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఇవ్వకపోగా.. భారీగా సిబ్బంది ఖాళీ అయిపోతున్నఈశాఖలో ఒక్క పోలీసు ఉద్యోగం కూడా తీయలేదు. దీనితో ఉన్న సిబ్బందిపైనే భారం మొత్తం పడిపోతున్నది. ఈ పరిస్థితి వచ్చే ఏడాది మార్చినాటికి మరింత జఠిలం కానుంది. గత ప్రభుత్వం రెండేళ్ల ఉద్యోగ విరమణ వస్సు పెంచేయడంతో వారికి ఆ పొడిగించిన కాలం వచ్చే ఏడాదితో ముగుస్తుంది. అపుడు భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే చాలా ఖాళీలు ఏర్పడటంతో ఉన్న సిబ్బందే కనీసం వారానికి ఒక్కరోజు కూడా శెలవు లేకుండా పనిచేస్తున్నారు. 

ఎంత పోలీసులైతే మాత్రం వారికి కుటుంబాలు ఉండవా..వారితో వారంలో ఒక్కరోజైనా గడిపాలని ఉండదా..ఈ ఆవేద హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ ఉంది. కాకపోతే డిఎస్పీ క్యాడర్ నుంచి డిజిపీ క్యాడర్ వరకూ వారి సౌలభ్యాన్ని బట్టి సెలవులు వినియోగించుకున్నా..క్రింది స్థాయి క్యాడర్ సిఐ నుంచి హోం గార్డు వరకూ వారం మొత్తం పనిచేయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అందులోనూ కొందరు పోలీసు అధికారుల ఆదేశాలు, వేధింపులు వారిలో ఆత్మ స్తైర్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయనే ప్రచారం కూడా గట్టిగానే సాగుతుంది. పోలీసు అధికారులు కూడా చేయడానికి ఏమీ ఉండట లేదు..సిబ్బంది కొరత ఎక్కువగా ఉండటంతో ఉన్నవారితో పని చేయించాల్సి వస్తుంది. రొటేషన్ పద్దతిలో స్టేషన్లలో పనులు చేయించాలంటే వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సి వుంటుంది. దానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఉన్నవారే వారి మధ్య ఉన్న ఒప్పందాలతో అత్యవసర సమయంలో అదనపు పనులు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇపుడు ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వంలో మారే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసుల వీక్లీ ఆఫ్ లపై వైఎస్సార్సీపీ విధానాలపై ప్రస్తుత డిప్యూటీ సీఎం పెద్ద ఎత్తున గళం కూడా విప్పేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో పోలీసులకు మళ్లీ వీక్లీ ఆఫ్ లపై ఆశ మొదలైంది. ఇటీవల పోలీసు అధికారులతో చర్చించిన సమయంలో హోం మంత్రి అని దృష్టికి పోలీసుల సమస్యలు తీసుకెళ్లినట్టు సమాచారం.

 కాగా ఇక్కడ రాష్ట్రవ్యాప్తం పోలీసుశాఖ అండగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను సుమారు 12500 మందికి పైగా నియమించినా ఫలితం లేకుండా పోయింది. వీరి నియామకాలే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకి విరుద్దంగా  జరిగాయింటూ కోర్టులో కేసులు నమోదు అయ్యాయి. దీనితో సదరు మహిళా పోలీసుల సేవలను కూడా పోలీసుశాఖ వినియోగించుకోవడానికి వీలులేకుండా పోయింది. వీరి నియామకాలు పోలీసుశాఖ ద్వారానే జరగడంతో అనధికారికంగా వీరి సేవలను పోలీసుశాఖ వినియోగించుకుంటోంది. అలాంటి పరిస్థితుల్లో పోలీసుల వీక్లీ ఆఫ్ పై మళ్లీ ప్రభుత్వంలో చర్చ మొదలైంది. రానున్న క్యాబినెట్ లో పోలీసుల వీక్లీ ఆఫ్ సమస్యను మంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను పోలీసుశాఖలోనే ఉంచి వారిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాఫ్ గా కూడా మార్పు చేయడం ద్వారా పోలీసుశాఖలోని సిబ్బంది కొరతను అధిగమించవచ్చుననే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు వారికి డిపార్ట్ మెంటల్ స్లైడింగ్ ఇవ్వడం ద్వారా ఈ ఏడాది లోపు భారీగా ఖాళీలు అవుతున్న పంచాయతీ కార్యదర్శిల ఖాళీలను కూడా భర్తీచేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే 75 ప్రభుత్వశాఖల్లోని మినిస్టీరియల్ స్టాఫ్ ఖాళీలను కూడాప్రభుత్వం సుకరిస్తున్నది. 

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పోలీసుశాఖకు అనుకూలంగా ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరతను తీర్చడానికి అవకాశం వుంటుంది. అపుడు మహిళా పోలీసులు కాస్తా మినినిస్టీరియల్ స్టాఫ్ గా మారిపోతారు. తద్వారా పోలీసులకు ఒకరోజు వీక్లీ ఆఫ్ ఇవ్వడానికి కూడా ఆస్కారం వుంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పా..పోలీసుల వీక్లీ ఆఫ్ సమస్య గట్టెక్కేటట్టు కనిపించడంలేదు. మంత్రి దృష్టిలో ఇప్పటికే పోలీసు అధికారులు వీక్లీ ఆఫ్ విషయాన్ని పెట్టినందున..వచ్చే క్యాబినెట్ సమావేశాల్లో ఏదైనా పరిష్కారం లభించవచ్చునని ఖాళీలు కాస్త ఆశలో ఎదురుచూస్తున్నాయి. అపుడే పోలీసుల వీక్లీ ఆఫ్ లపై ప్రశ్నించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితలు పూర్తిస్థాయిలో దృష్టా సారిస్తే తమకు ఒక రోజు వారాంతపు ఉపసమనం దొరుకుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి పోలీసుల వీక్లీ ఆఫ్ ల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందనేది..!