గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు, వారి సమస్యలు, సర్వీసు నిబంధనలు, పదోన్నతుల వ్యవహారంపై గ ప్రభుత్వం చేసిన తప్పిదా లపై ఈఎన్ఎస్-ఈరోజు వరుస కథనాలపై ప్రచురించడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ శాఖలోని భారీ మార్పులు చేపట్టి ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. అందునా పంచాయతీరాజ్ శాఖలోని భారీగా పంచాయతీ కార్యదర్శిల ఉద్యోగ విరమణలు కూడా ఉండటంతో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ తీసి ఉద్యోగులను భర్తీచేసే పనిలేకుండా ప్రస్తుతం సచివాలయ శాఖలో ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలనే పంచాయతీరాజ్ శాఖలో స్లైడింగ్ ఇచ్చి ఖాళీలను భర్తీచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తు న్నది. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి రెండు నుంచి నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా పంచాయ తీల్లో ప్రభుత్వ సేలు సక్రమంగా అందడం లేదు. ఇదే సమయంలో చాలా సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పనిలే కుం డా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. కాకపో ఇక్కడ శాఖాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వాటిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఉన్నవారిని పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వశాఖలు మార్చినా వారికి కల్పించాల్సిన ప్రయోజనాలు, బాకీ పడ్డ నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ బకాయిలపై క్లారిటీ కూడా ఇవ్వాల్సి వుంటుంది. అటు మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్ల విషయంలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.
రాష్ట్రం లోని 660 మండలాల్లోని 13 వేల 325 గ్రామ పంచాయతీలు ఉండగా 14 వేల 989 కార్యదర్శిలు పనిచేస్తున్నారు. ఇక 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల పరిధిలో... మొత్తంగా సుమారు 1.28 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో పంచాయతీ కార్యదర్శిలకు సర్పంచ్ లతోపాటుగా ప్రభుత్వం శిక్షణ శిక్షణ కూడా ఇవ్వడానికి ఆదేశాలు జారీచేసింది. ఇదే క్రమంలో ఒక్కో జిల్లాల్లో ఎంతమంది పంచాయతీ కార్యదర్శిలు అదనంగా పంచాయతీల్లో పనిచేస్తున్నారో కూడా లెక్కలు వేసింది. చాలా చోట్ల ఖాళీలు, కొన్ని చోట్ల అధనంగా పనిచేస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో ముగ్గురు గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు సచివాలయాల్లో ఉ న్నారని.. ఒకే పంచాయతీలో ముగ్గురిని ఉంచే కంటే.. ఖాళీగా ఉన్న అన్ని పంచాయతీల్లోనూ కార్యదర్శిలను భర్తీచేయడం ద్వారా అద నం గా విధులు నిర్వహించే పని ఉండదని యోచన చేసింది. దానికోసం ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాశాఖలో ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యద ర్శిలను పంచాయతీరాజ్ లోకి మార్చి కార్యదర్శిలందరికీ పంచాయతీలను అప్పగించనున్నారు. ప్రస్తుతం డిజిటల్ అస్టేంట్ గా ఉన్న గ్రేడ్- 6 పంచాయతీ కార్యదర్శిలతో ఇతర సిబ్బందితో పాటు 8 మంది సిబ్బంది సచివాలయాల్లో ఉండే విధంగా మార్పులు చేయబోతున్నారు.
గత ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని జీఓలు జారీచేసినా అది కార్యరూపం దాల్చలేదు. దానికితోడు ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో ఆ సమయం కాస్త కూటమి ప్రభుత్వం వచ్చేసరికి పూర్తయిపోయి.. ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగ విరమణలు చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు తీయాలంటే ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ ఖజానా ప్రకారం జరిగే పని కానందున ఉన్న ఉద్యోగులనే ప్రత్యేక ఉత్త ర్వులు, విధి విధానాలు రూపొందించి స్లైడింగ్ ద్వారా పంచాయతీల్లో నియమిస్తే పైసా ఖర్చు లేకుండా పని పూర్తయిపోతుందని ప్రభు త్వం భావిస్తున్నది. ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఎలాగూ పదోన్నతులు ఇచ్చే సమయం ఆశన్నమైంది. పనిలోపనిగా పదోన్నతులు కల్పించి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా మార్చి వారందరినీ ఖాళీలు ఉన్న పంచాయతీల్లోకి సర్ధుబాటు చేయనున్నారు. అయితే సచివాల యశాఖలో ఉన్నప్పుడు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు వీరికి గత ప్రభుత్వం ఇవ్వలేదు. పీఆర్సీ ప్రయోజనాలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుం మళ్లీ వీరికి పదోన్నతి కల్పిస్తే మరో రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది..? అలా మొత్తం ఇంక్రిమెంట్లు ఇస్తుందా..? లేదంటే ఉన్నవారిని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పంచాయతీరాజ్ శాఖలోకి మార్చేస్తుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక మిగిలిన ఉద్యోగుల్లో డిజిటల్ అసిస్టెంట్ కం గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీష్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీఆర్వో, సర్వేయర్, మహిళా పోసులను ప్రతీ సచివాలయానికి ఉండేవిధంగా మార్పులు చేయబోతున్నారట. అయితే ఇక్కడ ప్రస్తుతం మహిళా పోలీసుల ఉద్యోగాలపై కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో వీరిని ఇదే పోస్టులో ఉంచాలా..? లేదంటే క్వాలిఫికేషన్ ఆధారంగా వేరే ఉద్యోగాలకు స్లైడింగ్ ఇచ్చి పంపించేయాలా అనే కోణంలో ప్రభుత్వం ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. సచివాలయశాఖలోనే మిగులు ఉద్యోగాల భర్తీ వీరి క్వాలిఫికేషన్లు, పేస్కేలు ఆధారంగా చేపడితే ఎలా వుంటుందనే విషయంలో కూడా ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే కోర్టులో మహిళా పోలీసుల విషయంలో పెండింగ్ లో ఉన్న కేసులకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసే పనుండదు.
ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ప్రభుత్వ సౌలభ్యం కోసం వారిని పంచాయతీరాజ్ లోకి మార్పు చేసినా.. వారికి సదరు ప్రభుత్వ శాఖ సర్వీసు నిబంధలు, పేస్కేలు, ప్రమోషన్ ఛానల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాల్సి వుంటుంది. అదే జరిగి మిగిలిన సచివాలయ ఉద్యో గులు తీవ్రంగా నష్టపోతారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒకేసారి సచివాలయ ఉద్యోగులు నియామకాలు జరిగినా ఒకటి రెండు శాఖల్లోని కొద్ది మందికి మాత్రమే పదోన్నతులు కల్పించారు. అప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. ఎందుకంటే గ్రామ, వార్డు సచివాల యశాఖ ఏర్పాటై సుమారు ఐదేళ్లు దాటిపోతున్నా..నేటికి చాలా శాఖల సిబ్బంది సర్వీసు నిబంధనలు గానీ, ప్రమోషన్ ఛానల్ గానీ లేదు. తద్వారా ఉద్యోగులు జీవితాంతం ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఇదే శాఖలో ఉద్యోగులుగా పనిచేసి..ఇక్కడే ఉద్యోగ విరమణలు కూడా చేయాలి. ప్రభుత్వం ఒకటి రెండు ప్రభుత్వశాఖల కోసం తప్పితే మొత్తం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ఆలోచన చేయడం లేదు. అలాగని ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను వారి మాతృశాఖలకు అటాచ్ చేసినా వీరికి పెద్ద మొత్తంలో ప్రయోజనాలు కల్పించాల్సి వుంటుంది. అదంతా ప్రభుత్వానికి ఆర్ధిక భారం కావడంతో గత ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులను, వారి సర్వీసు నిబంధనలు, పదోన్నతులు పట్టించుకోకుండా గాల్లో ఉంచేసింది. ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను పంచాయతీరాజ్ లోకి మార్పుచేయాలని చూస్తున్న విధానంపైనా పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. చూడాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, చర్యలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది.