ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(హెచ్-228) సభ్యుల అభ్యున్నతి, అభివృద్ది లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తామని నూతన చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఫెడరేషన్ చైర్మన్ భాద్యలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమను నమ్ముకొని పనిచేస్తున్న 24 క్రాప్స్ లోని ఏ ఒక్క ఉద్యోగి అన్యా యం జరగకూడదని, కళామతల్లిని నమ్ముకుని పనిచేస్తున్నవారి అభివృద్ధి, సంక్షేమం అందించే విధంగా తనవంతు కృషి చేస్తానని అన్నారు. సినిమాలకు ప్రభుత్వం నుంచి రావాల్సి అనుమతులు ఇకపై సింగిల్ విండో విధానం ద్వారా వచ్చేవిధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రభు త్వం సినీ పరిశ్రమలకు అనుమతులతోపాటు, సినీ కార్మికులకు హౌసింగ్ కూడా మంజూరుచేయాలని.. ఈ సమస్యను తాను స్వయంగా ప్రభు త్వం దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. ఎన్ని సినిమాలు నిర్మాణం జరిగితే అన్ని రోజులు సినీ కార్మికులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు ఉంటాయన్నారు. ఉద్యోగులందరికీ ఈపిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా సంస్థలు చెల్లించే విధంగా కృషి చేస్తామన్నారు.
సినిమా సంస్థలు తమ సిబ్బందిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చూసుకున్నరోజు వారు కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏ సమ యంలోనై కష్టపడి పనిచేయడానికి ముందుకి వస్తారన్నారు. అన్ని సినిమాలను ప్రజలు ఆదరించడం ద్వారా మరిన్ని కొత్త సినిమాలు రావడా నికా ఆస్కారం వుంటుందన్నారు. సినిమా సంస్థలకు కూడా పూర్తిస్థాయి నిర్మాణలు దిశగా ముందుడుగుు వేయాలన్నారు. అదేవిధంగా తెలు గు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ నగరాలు, సిటీల్లో సినిమాలు తీయడం ద్వారా స్థానిక సినీ కార్మికులకు ఉపాధి చూపించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ విషయంలో దర్శక, నిర్మాతలు కూడా మంచి మనసుతో ఆలోచించాలని కంచర్ల అచ్యుతరావు కోరారు. అనం తరం ఫెడర్ సభ్యులు నూతన చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఫెడరేషన్ ఉద్యోగులు దుస్సాలువా, మాలతో ఘనంగా సత్కరించారు. కాగా ఈనెల 29న ఆయన ఫెడరేషన్ చైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఫెడరేషన్ యూనిట్ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సలాది గణేశ అచ్చుత రామస్వామి తదితరులు పాల్గొన్నారు.