ఈఎన్ఎస్-ఈరోజు వార్త నిజమైంది..! గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు మంగళం..?


Ens Balu
711
visakhapatnam
2024-09-18 15:06:04

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అతి కొద్ది సమయంలోనే చట్టబద్దత లేని ఒక ప్రభుత్వ శాఖ కనుమరుగు కాబోతుంది.. గతప్రభుత్వం కావాలని చేసిన తప్పు ప్రస్తుత ప్రభుత్వానికి అది సాంకేతిక కారణంగా కనిపించింది.. అంతే వెను వెంటనే దానిని కేబినెట్ లో చర్చించి.. సాధ్యా సాధ్యాలను పరిశీలించి ఆపై ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయడానికి నిర్ణయం తీసుకుంది.. ఆ ప్రభుత్వ శాఖ మరేంటో కాదు. ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ శాఖే.. మేమేదో కావాలని రాస్తున్న వార్త కాదిది.. సాక్షత్తూ కూటమి ప్రభుత్వంలోని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి క్యాబినెట్ లో ప్రస్తావించిన అంశాలు మీడియాకి ప్రకటించిన విషయమిది..  ఒక్క ఉద్యోగులనే కాదు.. గ్రామ,వార్డు సచివాలయాల్లో వాలంటీర్లను కూడా ఇతర ప్రభుత్వ శాఖలకు బదలాయింపు కోసం సాధ్యాసాధ్యాలు వెతుకుతున్నామన్నది ఆ ప్రకటన యొక్క సారాంశం.

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ-ఈరోజు దినపత్రికలు ఏ పరిశోధనాత్మక కథనం ప్రచురించినా.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వమైనా.. నేటి కూటమి ప్రభుత్వమైనా నిజమవుతూనే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అంటే సరిగ్గా 3 నెలల ముందు రాసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ‘ఉంటుందా..ఊడుతుందా..’ కథనాన్ని ప్రచురింది. దానిని కాస్త నిజం చేస్తూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను, వాలంటీర్లను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయడానికి సాంకేతిక అంశాలు పరిశీలిస్తున్నామని చేసిన ప్రకటన ఇటు ఉద్యోగులను, మీడియాను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.. ఈఎన్ఎస్-ఈరోజు  మీడియా ఎప్పుడూ చీకటిలో బాణాలేస్తూ.. గ్రామ, వార్డు సచివాలయశాఖపై తాము మాత్రమే పరిశోధన చేసి ప్రత్యేక కథనాలు రాస్తున్నామని..మరే ఇతర మీడియా రాయడం లేదని ఎద్దేవా చేసిన ఇతర మీడియాలన్నింటికి సరిగ్గా ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. 

అసలు అంత పెర్ ఫెక్ట్ గా సమాచారం తెలుసుకొని మరీ రాయడానికి గల కారణాలేంటో తెలియని వారంత ఇపుడు తలలు  పీక్కుంటున్నారు. ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖ తలా తోకా లేకుండా ఏర్పాటైతే సర్వీసు నిబంధనలు ఉద్యోగుల పాలిట శాపాలవుతాయని గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి నిజం  చేసి కూడా చూపించింది. 2019లో అక్టోబరు 2 గాంధీజయంతి రోజు ఏర్పాటైన ఈ ప్రభుత్వ శాఖ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలని తప్పులు చేస్తూనే వచ్చింది. అందులో ప్రధాన మైనది.. నేటి కూటమి ప్రభుత్వానికి ఈశాఖలోని ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయాలని పించేలా చేసిన సాంకేతిక కారణం ‘ఈ ప్రభుత్వ శాఖకు చట్ట బద్ధత చేయకపోవడం’ అంటే కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలో తీర్మాణం చేసి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా పక్కాగా ఏర్పాటు చేయడం.

 దీనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలనే చేయలేదు. సదరు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో జరిపిన క్యాబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో సుస్థిర నిర్ణయాలు తీసుకోలేదంటే ఏమనుకోవాలి. నిజంగానే కావాలని చేయలేదా..? లేదంటే ఉద్యోగులను భయపెట్టడానికి చేయలేదా..? అదీ కాదనుకుంటే ఎలాగూ ఈశాఖకు నూతన భవనాలు నిర్మించేశాం కదా ఈ శాఖను ఎవరూ టచ్ చేయలేరని చేయలేదా..? అనే విషయాలు పక్కన పెడితే.. గత ప్రభుత్వం అనుసరించిన తేడా విధానాలనే నేడు కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు, వాలంటీర్ల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యాయి. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొబేషన్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఈఎన్ఎస్-ఈరోజు ప్రత్యేక కథనాల ద్వారా ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ‘ఉంటుందా..ఊడుతుందా..’ శీర్షికన రాసిన కథనాన్ని మాత్రం కాస్త సీరియస్ గానే తీసుకుంది. వెంటనే స్పందించకపోయినా మూడు నెలల తరువాత క్యాబినెట్ సమావేశం అయిన తరువాత స్పందించింది.  గత ప్రభుత్వం చేసిన తేడా వ్యవహారాలన్నింటినీ ఉటంకిస్తూ రాసిన కథనాలపై మాత్రం మూడు నెలల్లోనే స్పందించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేలా చేసింది.  

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో కవాలని చేసిన తప్పులు
-ఈ శాఖ ఏర్పాటు చేసి కూడా చట్టబద్దత చేయకపోవడం
-ఈ శాఖకు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ను నియమించకపోవడం
-సుమారు రాష్ట్ర ప్రభుత్వంలోని 19శాఖలను ఒక ప్రభుత్వ శాఖ కలిపి ఏర్పాటు చేయడం
-ఈ శాఖలోని ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం
-ఉద్యోగులకు 2ఏళ్ల సర్వీసు ప్రొబేషన్ పూర్తయిన వెంటనే 2 ఇంక్రింమెంట్లు కలపకపోవడం
-పేస్కేలు ఇవ్వాల్సి వస్తుందని రెండేళ్లకంటే అదనంగా మరో తొమ్మిది నెలలు అధనంగా  ఉద్యోగులతో రూ.15వేలకే పనిచేయించడం
- సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ముందే డిఏ, హెచ్ఆర్ఏలు కుదించేసి ఆ తరువాత మళ్లీ సవరణలు చేయడం
-ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతో సమానంగా కాకుండా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా.. అంటే తక్కువగా పీఆర్సీ అమలు చేయడం
-ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ఈశాఖ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రయోజనాలు ఏర్పాటు చేకపోవడం
- గ్రామ, వార్డు సచివాలయా మహిళా పోలీసు పోస్టులపై ప్రైవేటు వ్యక్లులు కేసులు వేస్తే కౌంటర్ ఫైల్ దాఖలు చేసి పరిష్కరించకపోవడం
-పోలీసుశాఖకు మహిళా పోలీసు ఉద్యోగులకు సంంధం లేదని  కోర్టుకి చెప్పి వీరికి ఏశాఖా కేటాయించకుండా వదిలేయడం.
-వెల్పేర్ అసిస్టెంట్లకు సర్వీసు నిబంధనలు, ప్రోమోషన్ ఛానల్ ఏర్పాటు చేయపోవడం
-సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు శిక్షణ ఇచ్చి.. వారికి సక్రమ పద్దతిలో ప్రమోషన్ కల్పించకపోవడం
-అదే ఇన్ సర్వీస్ విధానాన్ని ఇతర శాఖల సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడం
-ఒకే సారి వేల మంది ఏఎన్ఎంలను ఇన్ సర్వీసు జిఎన్ఎం శిక్షణకు సర్వీసు పూర్తయిన రెండేళ్లకే తీసేసుకోవడం
-ఇన్ సర్వీసులో శిక్షణ పొందిన ఏఎన్ఎంలకు జిఎన్ఎంలుగా ఏ సర్వీసు నిబంధనలతో పదోన్నతులు కల్పిస్తున్నారో చెప్పకపోడం
-సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వదిలేయడానికి డిపార్ట్ మెంటల్ టెస్టులు నిర్ధేశించకపోవడం.

కొసమెరుపు- 
2019 అక్టోబరు 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన తరువాత ఉద్యోగుల నియమాకాలు, చట్టబద్ధత, ప్రొబేషన్ డిక్లరేషన్, ప్రొభేషన్ అనంతరం ఇంక్రిమెంట్ల జోడింపు, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ఈ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రయోజనాలు, పీఆర్సీ అమలు,  సర్వీసు నిబంధనలు,  ప్రకారం  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ శాఖను నిసితంగా పరిశీలిస్తున్న టిడిపి కూటమిగా అధికారంలో వచ్చిన తరువాత ఈ శాఖపై పూర్తిగా అధ్యయనం చేయడం ప్రారంభించింది. పూర్తిగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు ఈ సచివాలయ శాఖ ఉద్యోగులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తించింది. అంతేకాకుండా ఈ శాఖకు అన్నింటికంటే ముఖ్యంగా చట్టబద్ధత తీసుకు రాలేదని.. అలా చట్టబద్ధత తీసుకురాని ప్రభుత్వశాఖను కేబినెట్ లో చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏ మాత్రు శాఖల సిబ్బంది అందరినీ కలిసి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసిన ఈ శాఖ ఉద్యోగులను మళ్లీ తిరిగి అదేశాఖకు బదలాయిస్తే ఎలావుంటుందని ఆలోచన చేయడం మొదలు పెట్టింది. అందునా గత ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనూహ్య రీతిలో వేల సంఖ్యలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి కొత్త ఉద్యోగాల కల్పన చేసే పరిస్థితి లేదు. 

ఉన్న వారితోనే  పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేర్పులు చేసుకొని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానితో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని సుమారు. 1.25 లక్షల మంది ఉద్యోగులను ఆయా మాతృ ప్రభుత్వశాఖలకు పంపితే రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో వీరు పనిచేస్తారు. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనికూడ ఉండదు. దానికోసం చేయాల్సిందల్లా ఒక్కటే గత ప్రభుత్వం చేసిన తప్పులను సాంకేతి కారణాలుగా చూపి ఉద్యోగలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖల్లో సర్ధుబాటు చేయడమే. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు క్యాబినెట్ సమావేశం తరువాత వెల్లడైంది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ‘ఉంటుందా..ఊడుతుందా..’ శీర్షికన ఈఎన్ఎస్-ఈరోజు పరిశోధనాత్మక కథనం 3నెలల ముందే అందించింది. సరిగ్గా ఇపుడు దానిని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన అంశం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. చూడాలి. నిజంగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఊడ్చేస్తుందా..? లేదంటే సిబ్బందిని మాత్రమే మాతృశాఖల్లోకి ఖాళీలను బట్టీ భర్తీ చేసి విధులు యధావిధిగా ఇక్కడా ఉంచి పనిచేయిస్తుందా.. గత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పేస్కేలు అమలు చేసిన దగ్గర నుంచి పీఆర్సీ అమలు చేసేవరకూ కుదించేసిన ప్రయోజనాలను గుర్తించి ఇతర ప్రభుత్వశాఖల్లోకి విలీనం చేసిన తరువాతనైనా అమలు చేస్తుందా.. అని..?!