ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువచేసే సంక్షేమ, విద్యా సహాయకులు మాత్రం ఇంకా సంక్షోభంలోనే కూరుకుపోయి ఉన్నారు.. ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇంటింటీకి తిరిగి అందించి, కొత్తవారికి పథకాలను దరఖాస్తు చేసే సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు మాత్రం వారి సంక్షేమం చూసే నాధుడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు.. సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యు కేషన్ అసిస్టెంట్లు ఇంకా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ దూరంగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వ శాఖలో పని చేసే ఉద్యోగి ఆ శాఖపనులు మాత్రమే చేస్తాడు.. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలకు చెందిన అన్ని పనూలు, విధులు నిర్వర్తించాలి.. ఇంత చేసినా వీరి సర్వీసు విష యంలో ప్రభుత్వం కల్పించాల్సిన సర్వీస్ రూల్స్, పదోన్నతులు, ప్రభుత్వశాఖ మాత్రం ఏర్పాటు చేయదు.. అదేమంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి సచివాలయ ఉద్యోగులు కూడా బలికావాల్సి వస్తుందనే డైలాగుని కూటమి ప్రభుత్వం ప్రతీదానికి వినియోగించడం మొదలు పెడుతోంది..!
2019 అక్టోబర్ 2 న గ్రామ, వార్డు సచివాలయాల్లో తొలుత నియామకాల్లోకి చేరిన ఉద్యోగులు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిలు. వీరి నియా మకాలు అన్నీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. కానీ వీరు మాత్రం బిసివెల్ఫేర్, సోషల్ వెల్పేర్, మైనార్టీ వెల్ఫేర్, రెవిన్యూ, ఎడ్యుకేషన్ ఇలా అన్ని విభాగాల పనులూ, విధులు చేపడుతున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న అన్ని కుటుం బాలకు సచివాలయాల నుంచి సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసి.. పథకాలు పొందేందుకు అన్ని పనులూ వీరే చేస్తుంటారు. అంతేకా కుండా పాఠశాల్లో మరుగుదొడ్ల సొగసు, శుభ్రం యొక్క ఫోటోలు కూడా వీరే తీసి ప్రభుత్వానికి మరుగు మురికి స్థితిని తెలియజే స్తుం టారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే వీరికి చాలా సంక్షేమం ప్రభుత్వం చేస్తుందని బావిస్తుంటారు.
కానీ ప్రజల సంక్షేమం చూసే వీరు మాత్రం సంక్షోభంలోనే ఉండిపోయారు. ఉద్యోగాల్లోకి చేరి ఐదేళ్లు దగ్గర పడుతున్నా.. నేటికీ వెల్ఫేర్ అసిస్టెంట్లకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గానీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదంటే నమ్ముతారా..? వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖలో పనిచేసే ఉద్యోగులకు సదరు శాఖలోని ఉద్యోగుల క్యాడర్ ను బట్టి ఆయాశాఖల సర్వీసు నిబంధనలు అమలు చేస్తారు. కానీ విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేసే ఉద్యోగులకు సక్రమంగా క్యాడర్ లేదు సరికదా.. చాలా విభాగాల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండానే వదిలేసింది.
ప్రజలకు సమయానికి పించన్లు అందకపోయినా.. పథకాలకు ప్రజల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరకపోయినా ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు ఒంటికాలిపై లేచేది ఈ వెల్ఫేర్ అస్టెంట్లపైనే. కానీ వీరి సమస్యలు, సంక్షేమం మాత్రం ఇప్పటి కొచ్చి మూడు సంక్షేమశాఖల్లో ఏ శాఖ మంత్రిగానీ, ప్రభుత్వశాఖల అధికారులు గానీ తీర్చిన పాపాన పోలేదు. దీనితో వీరి సర్వీసులో అపుడే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇకనపైనా వీరికి సర్వీసు నిబంధనలు ఏ ప్రభుత్వశాఖలోనికి అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్క ముక్కలోచెప్పాలంటే సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఏ ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉంటూ.. అన్ని శాఖల పనులు చేస్తున్నట్టుగానే వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఏ శాఖ కేటాయింపులు లేకుండా.. అన్ని సంక్షేమ శాఖల పనులు చేస్తూ.. ప్రజకలు సేవలు అందిస్తున్నారు.
గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి తమ గోడు వినిపించినా.. వీరి సమస్యలు అసెంబ్లీ గేటు కూడా దాటలేదు. అలాగని కూటమి ప్రభుత్వంలోనైనా పరిష్కారానికి నోచుకుంటుందా అంటే.. కనీసం వీరి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపించలేదు. దీనితో వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఏ ప్రభుత్వశాఖ సర్వీసు నిభందనలు అమలు చేస్తారు.. మరేశాఖ ప్రమోషన్ చార్టు కల్పిస్తారో తెలియకుండా ఉంది. వీరితోపాటు విధుల్లోకి చేరిన ఆరోగ్య సహాయకులు ఇన్ సర్వీసు శిక్షణ పొంది..కాస్త జీతం పెంచుకొని మరీ స్టాఫ్ నర్సులు అయ్యారు. ఆరోగ్యశాఖలో గ్రామీణ వ్యవసాయ సహాయకులుగా ఉన్నవారు పదోన్నతులు పొందుతూ ఏఈఓలు అవుతున్నారు.. హార్టీకల్చర్ సహాయకులు కూడా హెచ్ఈఓలుగా పదోన్నతులు పొందుతున్నారు. వీరు, మహిళా పోలీసులు మాత్రం ఉన్నచోట నుంచి కనీసం అంగుళం కూడాద కదల్లేదు.
అసెంబ్లీ ముందు జరిగిన క్యాబినెట్ సమావేశంలో వీరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించినా.. అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతున్నా ఒక్క ఎమ్మెల్యేగానీ, వెల్ఫే ర్ మంత్రులు గానీ వెల్ఫేర్ అసిస్టెంట్లకు అమలు చేయని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ పై కనీసం చర్చకు తెరలేపలేదు. క్యాబినెట్ సమావేశాల్లో మాత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేసి వారికి ఆయా ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధలు అమలు చేస్తామని నిర్ణయించారు. ఆ తరువాత ఒక్క మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తప్పితే మరే ఇతర శాఖల మంత్రులు, అధికారులు ప్రభుత్వానికి తమ శాఖ ఉద్యోగులను వెనక్కి పంపాలని లేఖలు రాయలేదు. అలా రాసిన మత్స్యశాఖ సహాయకుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే పద్దతి కొనసాగితే మరో ఐదేళ్లు గడిచినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవు.
ఇపుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతీదానికి ఒక కామన్ డైలాగుని జేబులో పెట్టుకొనే మాట్లాడుతున్నది.. అదేమంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలనే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని చెబుతోంది. గత ప్రభుత్వం తమ విశేష అధికారాలు వినియోగించి తప్పులు చేస్తే.. ఇపుడు కూటమి ప్రభుత్వం అదే విశేష అధికారులు వినియోగించి ఆ తప్పులను సరిచేయవచ్చు. కానీ అలా చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకి వేయడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా దీన స్థితిలో ఉందని మాత్రం చెబుతున్నది. వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వలన ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆర్ధిక భారం పడదు.
కానీ ప్రభుత్వం మాత్రం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు ఇంటి ముంగిటే అంది స్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో సమస్యలు పరిష్కరిం గలిగితే ప్రభుత్వానికి మేలు, పేరు వచ్చేలా ఉద్యోగులు పని చేస్తారనే గ్యారెంటీ ఉంది. అదేవిధంగా సమస్యలు పరిష్కారం కాకపోయినా.. ఇదే ఉద్యోగుల ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడా ఆ ఇద్దరికే
( ఒకటి అడిగిన వాడికి.. రెండు అడగని వాడికి) చెప్పి మచ్చతెచ్చినా తేవచ్చు.. చూడాలి ఎన్నికల ముందు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఎప్పటికి నిలబెట్టుకుంటుందో.. సమస్యలు పరిష్కరిస్తుందో..?!