ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా ఒక శాఖ సిబ్బంది ఆ శాఖ పనులు మాత్రమే చేస్తారు..ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశా ఖగా కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం సిబ్బంది ఒక ఉద్యోగం.. అన్నిప్రభుత్వశాఖల పనులూ చేస్తారు.. ఇతరశాఖ ల్లో ఏశాఖ ఉద్యోగులకు ఆ శాఖ సర్వీసు నిబంధనలుంటే.. ఇక్కడ మాత్రం ఆరు విభాగాల సిబ్బందికి మాత్రం ఒకే రకమైన సర్వీసు నిబంధ నలుంటాయి.. కానీ ప్రమోషన్ ఛానల్ మాత్రం ఉండదు.. పైగా వార్డుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు వాళ్లు చేయాల్సి పనులను ప్రక్కన పెట్టి..బిల్ కలెక్టర్లు, ఇంటింటా సర్వేలు, బిఎల్వో విధులు, జియో ట్యాటింగ్ సర్వేలతో పాటు వార్డుల్లో ఏదైనా శాఖల సిబ్బంది ఖాళీలు ఉంటే వారి పనులు కూడా వీరే చేయాలి.
వార్డు అడ్మిన్ లకు ఇంకో బోనస్ ఏంటంటే వీళ్లు ప్రజా సేవచేయడానికి వారికిచ్చే జీతం నుంచే అన్నీ ఖర్చుచేయాలి.. కార్యాలయాల్లో స్టేషనరీ, రిజస్టర్లు, తెల్లకాగితాలు, పెన్నులు,పెన్సిళ్లు, వీళ్లే కొనాలి, సెల్ ఫోనుల్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వీరే వేయించుకోవాలి, కంప్యూటర్లు, ప్రింటర్లు పాడైనా అవీ వీరే బాగుచేయించుకోవాలి.. ఇదెక్కడి ప్రభుత్వ ఉద్యోగమని ప్రశ్నిస్తే మాత్రం మున్సిపల్ అధికారులు వీరంతా టార్గెట్ అయిపోతారు.. మెమోలు, సస్పెన్లు, అధనపు పనుల షడన్ గా తెరమీదకు వచ్చేస్తాయి.. చదవడానికి వెరైటీగా ఉన్నాఇదే నిజం..!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు వారి విధులే శాపాలుగా మారుతున్నాయి.. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని తేడా సర్వీసు నిబంధనలు కనీసం అమలు కాని ప్రమోషన్ ఛానల్ ఒక్క సచివాలయశాఖలోనే ప్రభుత్వం అమలు చేసి వీరందరితోనూ పొందిన ఒక్క ఉద్యోగంతో అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయించింది గత ప్రభుత్వం.. ఆ ప్రభుత్వం చేయించగా లేనిది మనమేమన్నా తక్కువ తిన్నామా అంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా రెట్టించిన పట్టుదల, ఉత్సాహంతో మరిన్ని అదనపు విధులు వీరితో చేయిస్తోందని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. వీరందరికీ ఉద్యోగాల్లోకి రాకముందు తెలియదు. ఇచ్చిన ఒక ఉద్యోగం ఒకటే అయినా.. అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాల్సి వస్తుందని.
పైకి మాత్రం ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వంగా కీర్తి ప్రతిష్టలు పొందిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. విధుల్లోకి చేరిన తరువాత ఉద్యోగుల తిట్లు, శాపనార్ధాలను కూడా అదే స్థాయిలో మూట గట్టుకుంది. ఇపుడు కూటమి ప్రభుత్వ పరిస్థితి కూడా అదే వీరిని చేస్తామన్న న్యాయం చేయపోగా ప్రైవేటు సంస్థల కంటే దారుణంగా టార్గెట్లు, బెదిరింపులు, వేధింపులు.. వెరసీ ఉద్యోగులు ఒక్కక్కరుగా లాంగ్ లీవ్ పై వెళ్లిపోతుంటే మరికొందరు.. ఇతర పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు. 75 ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి ఖాళీలు ఏర్పడటంతో అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుందని.. మాస్టర్ ప్లాన్ వేసిన గత ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయశాఖను తెరమీదకు తీసుకువచ్చింది.
ఏకంగా ఒక ప్రభుత్వశాఖలో 1.30లక్షల ఉద్యోగాల కల్పన అంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే తొంగి చూసింది. కానీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అన్ని శాఖల పనులూ ఈశాఖ ఉద్యోగులే చేయాల్సి వస్తున్నది. కాదు కాదు చేయిస్తున్నారు. అలాగని వీరికి ప్రత్యేకంగా ఏమైనా సదుపాయాలు, ప్రయోజ నాలు కల్పించారా అంటే అదీ లేదు. ఇతర ప్రభుత్వశాఖల్లోని ప్రయోజనాలు, జీతాల కంటే తక్కువ. ఉన్నవి తీసేయడంతోపాటు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసే సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా..తలా తోకా లేని జీఓలతో ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.
వాటిని సరిచేస్తామన్న కూటమి ప్రభుత్వం కూడా పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం అన్నిశాఖల పనులకు సచివాయల ఉద్యోగుల ను ఏ విధంగా వినియోగించిందో.. ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే వినియోగిస్తున్నది. కనీసం ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ఉద్యోగులుగా కూడా వీరిని చూడటం లేదు. గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలుంటే.. వార్డుల్లో అడ్మిస్ట్రేటివ్ సెక్రటరీలను నియమిం చింది. వీరంతా పేరుకి సెక్రటరీలు, అడ్మిన్ లు మాత్రమే. చేసేవన్నీ బిల్ కలెక్టర్, సర్వేపనులు, ఇతర కార్యాలయ పనులు, జియో ట్యాగింగ్ లు, ఖాళీగా ఉన్న సిబ్బంది అదనపు విధులూ.
విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఆరు విభాగాల్లోని ఉద్యోగులకు ఒకే రకమైన సర్వీసు నిబంధనలు అమలయ్యేవిధంగా జీఓనెంబరు-286 విడుదల చేసింది. గత ప్రభుత్వం. దానినే కొనసాగిస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా. అదీ కూడా 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి వ్యతిరేకంగా. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వశాఖల్లో ఆయా శాఖలు, ఉద్యోగులు వారి కేడర్ ఆధారంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఉంటాయి. అదేంటో విచిత్రంగా వార్డు సచివాలయాల్లో ఏకంగా ఆరు ప్రభుత్వశాఖల ఉద్యోగులందరికీ కలిపి ఒకే విధంగా సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ విషయమై ఉద్యోగులు ఎన్నిసార్లు ప్రశ్నించినా.. మరెన్నిసార్లు విలన్నవించుకున్నా వారి అర్జీలన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. మిగిలిన ప్రభుత్వశాఖల్లో ప్రభుత్వం స్టేషనరీకి నిధులు విడుదల చేస్తుంది. లేదంటే జిల్లా కార్యాలయాల నుంచి పంపిణీ చేస్తుంది.
విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం కార్యదర్శిలు, అడ్మిన్లు వారికొచ్చే జీతంలో నుంచే స్టేషనరీ ఖర్చులన్నీ పెట్టుకోవాలి. అదేమంటే ప్రజల కోసం ప్రభుత్వం కోసం ఆ మాత్రం కూడా పెట్టుకోలేరా అంటూ అధికారులు ఉద్యోగులపై ఒంటికాలపై లేస్తున్నారు. సొంత శాఖ ఉద్యోగం కంటే ఇతర శాఖల్లో పనుల అధనంగా కేటాయించి అన్యాయం, స్టేషనరీలో జేబుల గుల్ల, సర్వీసు నిబంధనల్లో అన్యాయం, పేస్కేలు, పీఆర్సీ అమలులో అన్యాయం. ఇలా అడుగుడునా వీరికి కూడా అన్యాయమే జరుగుతూ వస్తున్నది. గ్రామవార్డు సచివాలయశా ఖలోని 19విభాగాల్లోని ఉద్యోగుల్లో కేవలం వ్యవసాయశాఖ, వాణిజ్యశాఖ, పంచాయతీరాజ్ విభాగాల ఉద్యోగులకు తప్పితే మరే ఇతర ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ సక్రమంగా లేవు.
వారికి ఒకటి అరా పదోన్నతులు కూడా కల్పించింది గత ప్రభుత్వం. ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు బదిలీలు చేస్తామని కేబినెట్ లో తీర్మాణం చేసి ఆపై ఏమీ చేయకుండా కూర్చుంది. కూటమి ప్రభుత్వం లోనైనా సచివాలయ ఉద్యోగులకు ఒక దారీ తెన్నూ ప్రత్యేక జీఓ ద్వారా తీసుకురాకపోతే మాత్రం మరో ఐదేళ్లు వీరికి ఎలాంటి పదోన్నతులు, సర్వీసునిబంధనలు, ఉద్యోగ భద్రత కనిపించేట్టు లేదు..చూడాలి ఏం జరుగుతుందనేది..?!