సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్..?!


Ens Balu
124
visakhapatnam
2025-02-14 14:05:35

గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగుల బాలరిష్టాలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపే విధంగా అడుగులు వేస్తోంది.. తలా తోకా లేకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయశాఖలో ఉద్యోగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తోంది.. నాలుగు పోస్టులకి కలిపిఒకే పోటీపరీక్ష రాసి పోలీసుశాఖలోని మహిళా పోలీసులుగా విధుల్లో చేరిన వీరిని కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీనితో వీరికి ఎలాంటి ప్రభుత్వశాఖ కేటాయించకుండా అనామతు ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా విధు లు మాత్రం చేయించుకుంటుందీ ప్రభుత్వం.. దానితో వీరంతా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, డిపార్ట్ మెంట్ అన్నీ కోల్పోయారు. అదే సమయంలో వీరితో పాటు చేరిన వారందరికీ పదోన్నతులు ఇస్తున్నది ప్రభుత్వం. ఇపుడు వారికి న్యాయం చేసేందుకు వీలుగా ప్రభు త్వం యోచన చేస్తుండటంతో వారికి రెండు లేదా మూడు ప్రభుత్వశాఖలను స్లైడింగ్ ఇచ్చి వారికి ఖాళీలున్న సచివాలయ పోస్టులను భర్తీచే యాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. అదే జరిగితే మహిళా పోలీసుల కష్టాలు గట్టెక్కినట్టే..!

గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ రెండేళ్లుకు పెంచేయడంతో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 75 ప్రభుత్వశాఖల్లోని వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీచేసే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ముందున్న రెండు ఉపయోగకరమైన అంశాలేంటంటే.. ఒకటి రేషనలైజేషన్, రెండవది డిపార్ట్ మెంట్ స్లైడింగ్. మొదటిది ఎలాగూ అమలు చేసి మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లో వినియోగించుకునే విధంగా జీఓనెంబరు-1 విడుదల చేసింది. ఇపుడు కోర్టుకేసులు, గత ప్రభుత్వం ఏమీ చేయకుండా వదిలేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చి వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయయడం. 

దానికోసం ఇపుడు ప్రభుత్వం వేగంగా చర్యలు మొదలు పెట్టింది. కోర్టు కేసులు ఎప్పుడు తేలతాయో తెలీదు.. అలాగని ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోతే పరిపాలనా పరమైన చిక్కులు రౌండప్ చేసేస్తాయి. వీటి నుంచి బయట పడాలంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వశాఖల్లో ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖకూ చెందని మహిళా పోలీసులకు స్లైడింగ్ ఇవ్వడం ద్వారా సదరు ఖాళీల్లో భర్తీచేయడానికి వీలుపడుతుంది. అదే సమయంలో మహిళా పోలీసుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనేి 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇవ్వడం ద్వారా వారికి ఒక ప్రభుత్వ శాఖ కేటాయించినట్టు అవుతుంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించడాకి కూడా వీలు పడుతుంది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాకు అనుబంధ శాఖలుగా ఉన్న పంచాతీయతీరాజ్ శాఖలోని పంచాయతీ కార్యదర్శిలు, పురపాలకశాఖలోని వార్డు అడ్మిన్లు సాంఘిక సంక్షేమశాఖలోని డిజిల్ అసిస్టెంట్లు, రెవిన్యూ శాఖలోని విఆర్వో పోస్టులు భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి.. వాటికి తోడు మరో 5 నెలల్లో ఉద్యోగ విరమణ చేయబోయే ఉద్యోగులతో తో మరింత ఎక్కువ ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఖాళీ అయిన పోస్టుల్లో మహిళా పోలీసులకి డిపార్ట్ మెంట్ స్లైండింగ్ ఇవ్వడం ద్వారా ప్రాధాన్యత కలిగిన పోస్టులను భర్తీచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా వార్డు సచివాలయాలు, గ్రామ, సచివాలయాలు ఇన్చార్జి సెక్రటరీలతోనే నడుస్తున్నాయి. ఖాళీలను భర్తీచేయడానికి ఇటీవలే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు మెరిట్ బేస్డ్ గ్రేడ్-4 పంచాయతీకార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం(ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా అవి నిచిలిపోయాయి తరువాత పదోన్నతులు చేపడతారు) 

అయినప్పటి ఇంకా చాలా ఖాళీలు మిగిలిపోతున్నాయి.  వాటిని భర్తీచేయాలంటే ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్లు తీయడం ఒక్కటే శరణ్యం. కానీ రాష్ట్రప్రభుత్వంలోని ఒక ఉన్నతస్థాయి అధికారి గతంలో ఓ సారి టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన డిపార్ట్ మెంట్ స్లైడింగ్ అంశాన్ని తెరమీదకు తీసుకు రావడంతో ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఎలావుంటుందో పరిశీలించాలని  ఆదేశించిందట. అలా వచ్చిన ఆలోచన ద్వారానే ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తారని చెబుతున్నారు. అది కూడా అధికారిక ఉత్తర్వులు వస్తే తప్పా క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వశాఖ లేకుండా వారికి గాల్లో పెట్టి ఉద్యోగాల్లో కొనసాగించడం కూడా ప్రభుత్వ తప్పే అవుతుంది. దానిని నుంచి బయట పడాలన్నా ప్రభుత్వం డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ని అమలు చేయాల్సి వస్తుంది. 

అదే జరిగితే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సెక్రటరీలు నియామకంతోపాటు, వార్డుల్లోని అడ్మిన్ సెక్రటరీల నియామకం, వీఆర్వో ఖాళీల బర్తీ, డిజిటల్ అసిస్టెంట్ల భర్తీ అన్ని జరిగిపోతాయి. దీనితో ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయాలని ప్రాధమికంగా ఆలోచనకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. కాగా మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల తంతు పూర్తయిన తరువాత రాష్ట్రప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చే అంశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని ప్రభుత్వశాఖలకు స్లైడింగ్ ఇస్తుంది.. ఏ పోస్టుల్లో భర్తీచేస్తుంది అనేది మాత్రం తేలాల్సి వుంది..?!