ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన తప్పులనుంచి తప్పించుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తూ.. వారి వెనుక ఉన్న సమాచార భజన బ్యాచ్ తో చేయిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. ‘లంకలో సీత ఎలా ఉందో చూసి రమ్మని ఆంజనేయుడికి పురమా యిస్తే.. లంకను మొత్తం తగులబెట్టి వచ్చినట్టు’ ఇన్చార్జి ఆర్డీడి అండ్ కో బ్యాచ్, ముడుపులు తీసుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సమాచార ప్రతినిధులు ఏకంగా ఆయుష్ సమాచారశాఖ కమిషనర్ పైనే విధులకు గైర్హాజరువుతున్నారనే తప్పుడు ప్రచారాలకు తెరలేపారనే విషయం ఇపుడు ఆరోగ్యశాఖలో గొల్లుమంటున్నది. అటుతిరిగి.. ఇటు తిరిగి ప్రోటోకాల్ అధికారులపై బురద చల్లించడానికి ఒడిగడుతు న్నారని సమాచారం.. ఆ విధంగా కథనాలు వస్తే.. విషయం ప్రక్కదారి పట్టి.. తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకొని.. ఎవరి ద్వారా అయితే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ తప్పు వారిపైకి వెళ్లిపోతుందని భావించి మోకాళ్ళ తెలివి తేటలు ప్రయోగిస్తున్నారనే విషయం ఆయుష్ కమిషనరేట్ ఒక అంచనాకి వచ్చింది..!
విశాఖలో జోన్-1 ఇచ్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ తప్పుల మీద తప్పులు చేయడం ఏంటి..? దానిపై విచారణ చేస్తున్న ఆయుష్ కమిషనర్ డి. మంజుల విధులకు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదంటూ మీడియాలో కథనాలు రావడం ఏంటి అసలు ఎక్కడైనా పోలికుందా.. అసలు ఒక జిల్లా స్థాయి అధికారి విషయంలో అఖిల భారత సర్వీసుకి చెందిన అధికారి విధులకు గైర్హాజరు కావాల్సిన పనేముంటుంది అనేది తేడా కథనాలు రాసేవారు ఆలోచించుకోవాలి అంటున్నారు కమిషనరేట్ అధికారులు. వాస్తవానికి విశాఖలోని ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ సర్వీస్ మొత్తం అంతా కూడా అడ్డదారులే. సీనియారిటీ రోస్టర్ మెరిట్ లిస్టుని కాదని వక్రంగా ఇన్చార్జి ఆర్డీడి పోస్టు తెచ్చుకో గలిగారు. దానికి ఇదే ఆయుష్ కమిషనరేట్ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ అధికారులు సహకరించారు.
తీరా ఆ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి మెరిట్ లిస్టులో ఉన్న వైద్యులపైనా.. ఆ విషయం బయటకు తెలియజేసిన వైద్యులనూ వేధించడం మొదలు పెట్టారు. ప్రతీ పనికీ కాసులు తీసుకునే అన్నీ చేశారని.. దానిని తట్టుకోలేక ఎదురు తిరిగితే తమను మాల నా కొడకా, మాదిగనా కొడకా అని తిట్టడం మొదలు పెట్టారు. అంతేకాదు ఆ విషయమై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ నేపపథ్యంలో విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలోని ఒక దళిన మహిళా ఉద్యోగినిపై చేయిచేసుకోవడంతోపాటు..కులంపేరుతో దూషించారు కూడా దీనిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు అయ్యింది. ఈ సమయంలో కూడా క్రింది స్థాయి ఉద్యోగిని తనను కొట్టిందనే విషయాన్ని ప్రముఖంగా కొన్ని పత్రికల్లో రాయించుకోగలిగారు. అసలు ఆ రాసేవారికైనా.. వినే వారికైనా కనీసం అవగాహన ఉండాలి..
ఏ దైర్యంలో ఒక క్రింది స్థాయి ఉద్యోగిని జిల్లా అధికారులపై చేయిచేసుకుంటుందని.. తీరా ఆ విషయంలో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసి సుదీర్ఘ కాలం సెలవులు పెట్టమంటే ఎక్కడ ఇన్చార్జి ఆర్డీడి పోస్టు నుంచి తప్పిస్తారోనని ఏకంగా కమిషనరే విధులకు సక్రమంగా రారని తన అనుగచరగణంతో మిలాకత్ అయిన వారితో వార్తలు రాయించారనే ఆరోపణులున్నాయి. వైద్యులను వేధించిన విషయం, కులం పేరుతో దూషించిన విషయం, కాసులతోనే పనులు చేస్తున్న విషయం ఏ నాడూ ప్రస్తావించని సదరు సమాచార ప్రతినిధులు ఇపుడు ఏ విధంగా ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో కమిషనరే సక్రమంగా విధులకు రారనే విషయాన్ని ఎలా రాయించారని వాపోతున్నారు కమిషనరేట్ అధికారులు. ఎవరు ఏం చేసినా ఆధారాలు చూపకపోతే ప్రభుత్వం, చట్టం తన పనితాను చేసుకుపోతుందంటున్నారు. కమిషనరేట్ సిబ్బంది.
ముక్కుసూటి అధికారినిగా కమిషనర్ డి. మంజులకి మంచిపేరు
ఆంధ్రప్రదేశ్ లోని వైద్యఆరోగ్యశాఖలో ఒక విభాగంగా ఉన్న ఆయుష్ కమిషనర్ గా పనిచేస్తున్న డి.మంజులకి ప్రభుత్వంలోనే ముక్కుసూటి అధికారిణిగా మంచి పేరుంది. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా తనదైన రీతిలో విచారణ చేసి ప్రభుత్వానికి మచ్చరాకుండా పరిపాలన చేస్తారని కూడా చెబుతారు. ప్రభుత్వం కూడా ఏరి కోరి గాడి తప్పుతున్న ఆయుష్ శాఖను గాడిలో పెట్టేందుకు అడ్డదారుల్లో వ్యవహారాలు నడిపేవారి చేష్టలను నియంత్రించడానికే ఈమెను ఆయుష్ శాఖ కమిషనర్ గా నియమించారనేది నేటికి ఎవరికీ తెలియని విషయం. నోటి మాటలు కాకుండా తన పరిపాలన అంతా పేపర్ పై ఆధారాలతో పెడుతూనే చర్యలు తీసుకోవడంలోగానీ, పరిపాలన చేయడంలోగానీ ఆమె దిట్ట. అంతేకాదు ప్రభుత్వంలో కూడా ఈమెను డైనమిక్ ఆఫీసర్ గా అభివర్ణిస్తారు కూడా.
ఏ సమస్యవచ్చినా.. అందునా మీడియా ఏ సమయంలో పిలిచే ఏకైక మహిళా అధికారి ఆయుష్ కమిషర్ డి.మంజుల. అలాంటి అధికారిణి ఏకంగా కమిషనరేట్ కే సక్రమంగా విధులకు రారు అనే విధంగా కథనాలు రాయించారంటే ఏ స్థాయిలో లాబీయింగ్ చేయించి ఉంటారని.. దానికి వివరణ కూడా ఇవ్వాలని, తాఖీదులు చేరవేయడానికి కూడా కమిషనరేట్ సిద్దపడుతున్నట్టు సమాచారం. అఖిల భారతస్థాయి అధికారులంటే వాస్తవానికి రాష్ట్రస్థాయి మెజిస్ట్రేట్ క్రిందే లెక్క. వాళ్లపై కథనాలు రాసే సమయంలో వాస్తవాలు తెలుసుకొని, లేదా వారి వివరణలతో రాయాల్సి వుంటుందని కమిషనరేట్ అధికారులు వాపోతున్నారు. అలా కాకుండా అడ్డదారిలో పదోన్నతి పొంది.. ఆపై వైద్యులపైనా, సిబ్బందిపైనా జులం ప్రదర్శించే అధికారుల కోసం వాస్తవాలు బయటపడే సమయంలో ఏకంగా రాష్ట్ర స్థాయి అధికారులపై ఈ విధంగా సామాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక పేరున్న సంస్థలకు చిన్నతనమే అవుతుందనే పరిశీలకుల వాదన.
అయితే సమాచారం ప్రజలకు అందించే సమయంలో ఎవరిపైనైనా వార్తలు రాసే అధికారం, అశకాశం ఒక్క సమాచార ప్రతినిధులకు మాత్రమే వుంటుంది. అదేసమయంలో పక్కా సమాచారం సమాచారం అందిస్తే.. సదరు సంస్థలకు పేరొస్తొందని.. లేదంటే ఉన్న గౌరవం పోతుందంటున్నారు. కమిషనరేట్ అధికారులు. ఇదంతా ఇన్చార్జి ఆర్డీడిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు, దళిత వైద్యులు ఫిర్యాదు చేసిన అంశం, క్రింది స్థాయి సిబ్బంది ఇబ్బందులుపెట్టే అంశంలోనే తెరపైకి రావడం అనేది ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది.