విశాఖజోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడీ కి చార్జ్ మెమో -ఎట్టకేలకు కదిలిన ఆయుష్ కమిషనరేట్ అధికారులు


Ens Balu
48
visakhapatnam
2025-03-10 17:11:02

విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సుష్మలకు కమిషనర్ డి.మంజుల మెమోలు జారీచేశారు. జూనియర్ అసిస్టెంట్ కి మూడు అంశాలు, ఇన్చార్జి ఆర్డీడికి సుమారు 18 అంశాలతో మెమోలో అంశాలు పేర్కొన్నట్టు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇన్చార్జి ఆర్డీడి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఆయుష్ కమిషనరేట్ స్పందించలేదు. దీనితో మిడియాలో వరుస కథనాలు రావడంతో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలతో ఇన్చార్జి ఆర్డీడిపై వెళ్లిన ఫిర్యాదులు ఆధారంగా మెమోలు జారీచేశారని.. కమిషనరేట్ వర్గాలు తెలియజేశాయి. మెమో రాకుండా చాలా కాలం డా.లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కమిషనర్ ముందు అవేమీ పనిచేయలేదు.

 వాస్తవానికి ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉద్యోగులను సదరుశాఖ కమిషనరేట్ అధికారులు లాంగ్ లీవ్ లోకి కావాలనే పంపేస్తారు. అదే సమయంలో పరిపాలనకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఆ స్థానంలో మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. అయితే  ఆయుష్ లో మాత్రం అదేమీ జరగలేదు. చేసిన తప్పులు, వచ్చిన ఫిర్యాదులపై రాజకీయనాయకులు, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి పేషీ, ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుల ఒత్తిడితో చాలా కాలం ఆగారు. అయితే కమిషనరేట్ అధికారులు చేస్తున్న తప్పులు, కొందరు అధికారులు మామూళ్లకు లొంగిపోవడంతో మెమోలు రావడం కూడా ఆలస్యం అయ్యింది. ఎక్కువ కాలం తాత్సారం చేస్తే మొదటికేమోసం వస్తుందని.. ఏదో ఒక అంశాన్ని కాగితంపై చూపించే ప్లాన్ లో భాగంగా కమిషనరేట్ అధికారులు ఇన్చార్జి ఆర్డీడికి, జూనియర్ అసిస్టెంట్ కు మోమోలు జారీ చేశారు. 

వీరిచ్చిన సమాధానాలు, అనంతరం వీరిపై విచారణ అధికారిని నియమించిన తరువాత వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు ఉండనున్నాయి. అందునా ప్రైవేటు వ్యక్తుల ప్రలోభాలకు ఆయుష్ కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు తలొగ్గుతున్న విషయాన్ని కూడా బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఎక్కడ కమిషన్ కు సమాధానం చెప్పాల్సి వస్తుందోనని ఆయుష్ కమిషనరేట్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు వీరికి మెమోలు జారీచేశారు. అయితే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో మాత్రం ఇంకా ఆయుష్ కమిషనరేట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తప్పులు చేసినా.. అధికారుల అండదండలతో ఆమె ఇన్చార్జి ఆర్డీడిగా కొనసాగుతుండటం కొసమెరుపు.
సిఫార్సు