విశాఖలో జోన్-1 ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఒక దళిత ఉద్యోగినిపై చేయి చేసుకోవడం, ఆపై కులం పేరుతో దూషించిన వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనా ఆయుష్ కమిషనర్ డి.మంజుల ఆమెతో లాంగ్ లీవ్ పెట్టించలేకపోతున్నారు.. ఇదే కేసు విషయమై ఆర్డీడీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ తో లాంగ్ లీవ్ పెట్టించిన కమిషనరేట్ అధికారులు ఇన్చార్జి ఆర్డీడితో మాత్రం లీవ్ పెట్టించ లేక చేతులెత్తేశారు.. తనకి కమిషనర్ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఒకటే లిఖిత పూర్వకంగా ఆర్డర్ ఇస్తే తప్పా తాను లీవ్ పెట్టనని భీష్మించుకొని కూర్చున్నారు సదరు ఇన్చార్జి ఆర్డీడి. అలాగని విధులుకు హాజరు కాకుండా.. ఇంటి దగ్గరే ఉండి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సులు వేస్తూ.. తన కేసు విషయంలో వైద్యులు, సిబ్బంది అంతా సహాయం చేయాలని.. లేదంటే మీరు చేసిన తప్పులన్నీ బయటకు తీస్తానని బెదిరింపులకు కూడా దిగుతున్నారట.. ఇంతజరుతున్నా ఆయుష్ కమిషనర్ గానీ, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ ఈమెతో లాంగ్ లీవ్ పెట్టించలేకపోతున్నారు..ప్రస్తుతం ఈ విషయం ఆయుష్ శాఖలో హాట్ టాపిక్ అవుతోంది..!
కూటమి ప్రభుత్వంలో కూడా పైరవీలు చేసేవారికి.. తప్పులు చేసినా.. వాటికి ఆధారాలున్నా.. దళిత వైద్యులను కులం పేరుతో దూషించిన వేధింపులపై లిఖిత పూర్వక ఫిర్యాదులున్నా.. ఆయుష్ కమిషనరేట్ అధికారులు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరని తేలిపోయింది. దానికి కారణం ఒక ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ అధికారుల పిల్లలు శిక్షణ పొందడటం, ఆ లాబీయింగ్ తోనే సదరు వ్యక్తి ఆయుష్ కమిషనరేట్, మెడికల్ అండ్ హెల్త్ పెషీలో తన వారిలో అడ్డగోలు పైరవీలు చేస్తున్నారనే విషయం తేటతెల్లం అవుతందని దళిత వైద్యులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం దళితులమనే తమపై ప్రభుత్వం కూడా వివక్ష చూపుతోందని వాపోతున్నారు. కేవలం ఈ కారణంతోనే వైద్యఆరోగ్యశాఖలోని ప్రన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోని అధికారులు ఒత్తిడి వలనే ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులకి ఆధారాలున్నా..
దళిత వైద్యులను కులం పేరుతో దూషించారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా.. ఉద్యోగి రిటైర్ మెంట్ ఫంక్షన్ కోసం డిస్పెన్సరీలన్నీ మూయించి.. విశాఖజిల్లా పరిషత్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ సన్మానాలు చేయించుకున్నా..ఆయుష్ శాఖలోని ఉన్నతాధికారైన కమిషనర్ ఈమె విషయంలో కనీసం చిన్న చర్య కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురైందని ఇక్కడి అధికారులు, వైద్యులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అంటే అధికారులు తప్పులు చేయొచ్చు.. కానీ వాళ్లతో కనీసం లీవ్ కూడా పెట్టించలేని స్థితిలో కమిషనరేట్ అధికారులు ఉన్నారనడాకి జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి ఉదయంతమే ప్రధాన ఉదాహరణ అని కూడా చెబుతున్నారు.
ఏ ప్రభుత్వ శాఖలోనైనా కమిషనర్ వేసే ఆర్డర్లను క్రింది స్థాయి అధికారులు పాటించి తీరాలి. కానీ ఆయుష్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇష్టానుసారం తప్పులు చేసినా.. సర్వీసు నిబంధనలు ఉల్లించినా.. అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చేసినా.. ఆపోస్టును అడ్డం పెట్టుకొని దళిత వైద్యులను, ఉద్యోగులను వేధించినా కమిషనర్ కాదు కదా...వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు వాస్తవాలు బయటపెట్టే మీడియాని మేనేజ్ చేయడానికి వారి అనుచరులు అందరూ రంగంలోకి దిగిపోతారు. అక్షరాన్ని అమ్ముకునే తేడా మీడియా, అందులో పనిచేసే ప్రతినిధులు ఉండొచ్చు.. కానీ ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రం అలాంటి నీచమైన పనులకు తలొంచదు. ప్రభుత్వ ఉద్యోగులు, అందునా దళితులు, అంతకంటే ముఖ్యంగా దళిత మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి కూడా లేదు.
ఆ ఒక్కకారణంతోనే వరుస కథనాలు సదరు ఇన్చార్జి ఆర్డీడి విషయంలోనూ, ఆమె తప్పులు చేసినా వెనుకేసుకు వచ్చే అధికారులు ఉన్న విషయాన్ని కూడా పదే పదే ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నంలో ఈరోజు-ఈఎన్ఎస్ కి కొందరు తేడాగాళ్లు ఫోన్లు చేసి, వ్యక్తిగతంగా బెదిరింపులకు కూడా దిగినా దానిని కేర్ చేయలేదు. అంతేకాదు.. వాస్తవాలను బయటకు తీసి.. దానిని ప్రజల ముందుంచే విషయంలో తేడాగాళ్లు ఏం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వశాఖలోనైనా అధికారులు సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి అధికారులను కమిషనరేట్ అధికారులు లాంగ్ లీవ్ లోకి పంపి.. ఇన్చార్జి పోస్టుల నుంచి తప్పిస్తారు. కానీ ఆయుష్ లో మాత్రం ఆ విధంగా జరగలేదు. కనీసం చేసిన తప్పులు, దళిత మహిళా ఉద్యోగినిపై చేయిచేసుకున్న విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైనా.. సదరు ఇన్చార్జి ఆర్డీడిపై ఒక పల్లెత్తు మాట కూడా అనేదైర్యం ఉన్నతాధికారులు చేయడంలేదంటే ఏ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అధికారం, డబ్బు, పరపతితో చాలా మంది కాసులకి కక్కుర్తి పడేవారిని మేనేజ్ చేయవచ్చుగానీ.. ఈరోజు-ఈఎన్ఎస్ విషయంలో మాత్రం తేడాగాళ్ల పప్పులు ఉడకలేదు. దానితో అధికార యంత్రాగాన్నే మేనేజ్ చేస్తున్నారు. అంతేకాదు వారి బృందాన్ని విశాఖలో దింపి బెదిరింపులకు దిగుతున్నారు. మిగిలిన మీడియాని మేనేజ్ చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది. అందుకే ఇంత జరుగుతున్నా.. ఒక్క మీడియాలో కూడా జరుగుతున్న తంతుపై కథనాలు వెలువడటం లేదు. అదే విధంగా కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోనూ కొందరు అధికారులతో ఒత్తిడి తేవడం వలనే తప్పులుచేసిన ఇన్చార్జి ఆర్డీడిని పల్లెత్తు మాట అనలేక రోజులు వెల్లదీస్తున్నారు.
ఇదే విషయమై ఆయుష్ కమిషనర్ ను ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరగా.. విశాఖజోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చాయని అన్నింటినినీ పరిశీలన చేస్తున్నామని.. విచారణ కొనసాగుతందనే చెప్పుకొస్తున్నారు. గత నెల 25 నుంచి చెప్పిన డైలాగే మార్చకుండా చెబుతన్నారు మీడియాతో. ఇప్పటికే ఇదే విషయమై జాతీయ ఎస్సీ కమిషన్, లోకాయుక్తాలకు బాధితులు, దళిత వైద్యులు ఫిర్యాదులు కూడా చేశారు. చూడాలి.. చేసిన తప్పులకి రుజువులు ఉన్నా, ఆపై ఫిర్యాదులు వచ్చినా.. ఎఫ్ఐఆర్ లు నమోదైనా.. సర్వీసు రూల్స్ ఉల్లంగించినా ఇంకెన్ని రోజులు తప్పుచేసిన ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఆమెకు ఏమీ కాకుండా తప్పించడానికి ఇంకెన్ని రోజులు సమయంతీసుకొని మేనేజ్ చేస్తారనేది..?!