ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల్లో నూతనంగా కలెక్టరేట్లు, జిల్లా శాఖల కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. అదీకాకుండా ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ భవన సముదాయాల మాదిరిగానే కొత్త జిల్లాల్లో కూడా కలెక్టరేట్, అధికారుల నివాసాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మించడానికి సీఎం నారా చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. 26 జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ అద్దె భవనాలు, ఆలోచనలో పడ్డ సివిల్ సర్వీసు అధికారులు.. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు వెనక్కేనా.. అనే కథనాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోజు-ఈఎన్ఎస్ వరుసగా ప్రచురించింది. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ అధికారుల సమస్యలపై సీఎం సమీక్షించిన తరుణంలో కొత్తజిల్లాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, అద్దె కార్యాలయాల అంశం తెరమీదకు రావడంతో ముఖ్యమంత్రి కొత్తజిల్లాల్లో కూడా శాస్వత ప్రభుత్వ భవనాలను నిర్మించడానికి అంగీకారం చెప్పారు. దీనితో కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు చర్చనీయాంశం అయ్యాయి. మరోసారి ఈరోజు-ఈఎన్ఎస్ కథనాల వాస్తవికతకు ప్రభుత్వమే సాక్ష్యమైంది..!
ఈరోజు-ఈఎన్ఎస్ అందించే గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ పై ప్రభుత్వం స్పందించడం మొదలు పెట్టింది. అంతేకాదు చక చకా ఆదేశాలివ్వ డంతోపాటు, కార్యకాలపాలకు నిర్ణయాలకు కూడా ఒకే చెబుతున్నది. కొత్త జిల్లాల్లో అద్దెభవనాలు, ప్రైవేటు ఇళ్లల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నివాసాలు.. అధికారుల ఆలోచనలు.. ప్రజల ఇబ్బందులపై అందించిన కథనాలకి ఫలితాలు మొదలయ్యాయి. కూటమి ప్రభు త్వంలో కదలిక తీసుకువచ్చాయి. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసినా కార్యకలా పాలన్నీ అద్దె భవనాల్లోనే నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వానికి ఆర్ధిక భారంతోపాటు, అధికారులకి కూడా నివాస సముదాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులు పాత ఉమ్మడి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తుంటే.. మరికొందరు కొత్త జిల్లాల్లోనే కాపురాలు ఉంటున్నారు.
ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు, నివాస సముదాయాలు అంటే ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఉండాలి. కానీ అవకాశం లేక కొత్త జిల్లాల్లో ప్రైవే టు భవనాల్లోనే కాలం గడుపుతూ వస్తున్నారు. అదే విషయాన్ని వరుస కథకాల్లో ప్రచురించింది. ఇదే విషయాన్ని కలెక్టర్లు కూడా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో కొత్త జిల్లాల్లో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణాలకు మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, అధికారులకు నివాస సముదాయాలు రానున్నాయి. అపుడు అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నారు. అయితే కొత్త జిల్లాల్లో నిర్మాణాల వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తారా.. ఏ ప్రభుత్వశాఖకు ఆ ప్రభుత్వశాఖ భవనాలు అన్నట్టుగా విడివిడిగా నిర్మిస్తారానే అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది.
-పేరుకే కొత్త జిల్లాలు.. కార్యకలాపాలన్నీ ఉమ్మడి జిల్లాగానే
రాష్ట్రంలో 13జిల్లాలు జిల్లాలు 26 జిల్లాలు అయినా అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని రికార్డులకే పరిమితం అయ్యాయి. కానీ కేంద్రప్రభుత్వం దృష్టిలో మాత్రం ఇంకా 13 జిల్లాలే. కొత్త జిల్లాలకు చట్టబద్దత రావాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. కానీ ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకూ జరగలేదు. అయినా కేంద్రంలో పనిలేకుండా రాష్ట్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు విడు దల చేసి పరిపాలన విస్తరించి అమలు చేస్తున్నది. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం కొత్త జిల్లాల గుర్తింపు విషయంలో ఒక్క అడుగు కూడా వేయ లేదు. దీనితో రాష్ట్రంలో కొత్త జిల్లాలు మారినా.. పరిపాల వికేంద్రీకరణ జరిగినా.. బదిలీలు, నియామకాలు ఇతరత్రా వ్యవహారాలన్నీ పాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మాత్రమే జరుగుతున్నాయి.
వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యత ఉన్నా ఎందుకనో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల చట్టబద్దత, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు, కొత్త జిల్లా పరిషత్ లు, నూతన నియోజకవర్గాల ఏర్పాటు విషయంలో ముందుడు వేయలేపోతున్నది. తద్వారా రాష్ట్రానికి కొత్తజిల్లాలకు రావాల్సిన చాలా నిధులు కూడా కోల్పోతున్నది. ఒక రకంగా కొత్త జిల్లాలకి చట్టబద్దత వస్తే ఆ వెంటనే కొత్త జిల్లా పరిషత్ లు, కొత్త మండాలు, ఇప్పటికే ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు కూడా చట్టబద్దత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే రాష్ట్ర ఆమోద ముద్ర కావాల్సి ఉన్నది. అలా జరగాలంటే ఉబయ సభల్లోనూ బిల్లు పాస్ కావాలి. కానీ ఆ విషయాన్ని మన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడం లేదు. అయితే రాష్ట్రంలో జన గణన, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, కొత్తజిల్లా జిల్లాలకు చట్టబద్ద ఇవన్నీ ఒకేసారి జరపాలని కేంద్రం భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనే విషయంపై ఇటు రాష్ట్రప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదు. అటు కేంద్రమూ ప్రకటించలేదు. రాష్ట్ర పునర్విభజనలోని కీలకమైన ఈ అంశాలపై కేంద్రం నేటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
విభజన హామీలను అమలు చేయలేదు. అలాగని ఎంపీలు, రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కేంద్రం కొత్త జిల్లాల విషయంలో ముందడుగు వేస్తే రాష్ట్రంలో 175 ఉన్న నియోజకవర్గాలు 225 మారుతాయి. 13 కొత్త జిల్లాలకు చట్టబద్దత, 13 జిల్లాపరిషత్ ల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సంఖ్యను మరో మూడు అదనంగా చేరిస్తే వాటికి, అఖిల భారత సర్వీసు అధికారుల పెంపు, ఇలా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. కానీ వాటిని సాధించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక చేస్తున్నట్టు కనిపించడంలేదు. విషయాన్ని హోం ఎఫైర్స్, మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకొని వెళ్లి పార్లమెం టులో ప్రత్యేక బిల్లు పాస్ చేయించడం ద్వారా అనుకున్నవన్నీ కార్యరూరంలోకి వస్తాయి. మిత్ర పక్షాలుగా ఉన్న కేంద్ర, రాష్ట్రప్రభు త్వాలు ఈ విషయంలో ముందుడుగు వేయాల్సిన ఆవశ్యకత ఇపుడు ఆశన్నమైంది. చూడాలి ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి సారిస్తారా లేదా అనేది..?!