గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తేడా పదోన్నతులు..?!


Ens Balu
700
visakhapatnam
2025-04-05 14:42:07

ఎస్..ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కుదించడానికే దారులు వెతుకు న్నది.. దానికోసం ఉత్తుత్తి పదోన్నతులు కల్పించి సచివాలయాల్లోని వార్డు వెల్పేర్ అండ్ ఎడ్యేకేషనల్ అసిస్టెంట్లను సంక్షేమ శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించినట్టుగా చూపి.. రాష్ట్రవ్యాప్తంగా 20శాతం మందిని మెరిట్ ప్రాతిపిదిక లాగేయడానికి రంగం సిద్దం చేసింది.. దానికోసం గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. శాఖాపరంగా జరిగిన సమావేశంలోని అంశాల ను పొందుపరుస్తూ దానిని ప్రభుత్వానికి నివేదించారు.. నేటి వరకూ సచివాలయశాఖలోని ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయని ప్రభుత్వం.. ఆయాశాఖల్లోకి జూనియర్ అసిస్టెట్లుంగా పదోన్నతి పొందిన తరువాత  వెళ్లినశాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ అక్కడ  వర్తిస్తాయని పేర్కొంటుంది..గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు తప్పా ఇతర అన్నిశాఖల్లోని సిబ్బం దిని దశలవారీగా శాఖీలు అధికంగా ఉన్నశాఖల్లోకే తరలించడానికి మార్గం సుగమం చేస్తున్నది కూటమి ప్రభుత్వం. దశలవారీగా సిబ్బం దిని పదోన్నతుల పేరులతో అత్యధిక ఖాళీలు ఉన్న ప్రభుత్వశాఖల్లోకి కుదించేస్తే ఇక గ్రామ,వార్డు సచివాలయశాఖ ఆటోమేటిక్ గా రద్దై పోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి..!

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు  తొంగి చూసిన గ్రామస్థాయి పరిపాలన, సేవల విధానమైన గ్రామ, వార్డు సచివాలయశాఖను కూటమి ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా రద్దు చేయడానికి అన్ని దారులూ వెతుకుతున్నట్టుగానే కనిపిస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తేడా పనులు, మరింత తేడా పరిపాలన, ఉద్యోగకల్పన వలన ఇపుడు గ్రామాల్లోని ప్రజలకు దగ్గరగా ఉన్న సచివాలయశాఖ కొద్ది కొద్దిగా పదోన్నతుల పేరుతో ఖాళీ చేసి.. చివరకి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తం ప్రస్తుతం ఉన్న 74 ప్రభుత్వశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగులుగా తరలించేయనున్నారు. దానికోసం ఆయాశాఖల్లోని ఖాళీలలను గుర్తించిన ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వశాఖకు అనుబంధంగా ఉన్న సచివాలయ శాఖ సిబ్బందిని ప్రభుత్వశాఖల్లోకి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వంలో ఉద్యోగుల విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో.. వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి అన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులను భర్తీచేయలేని ప్రభుత్వం అదే ప్రభుత్వశాఖలకు అనుబంధంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖల సిబ్బందిని పదోన్నతుల పేరుతో  ఆయాశాఖల్లోకి తరలించేస్తే.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతోపాటు, ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పించినట్టు అవుతుందని భావిస్తున్నది. అయితే తీవ్ర అన్యాయానికి, పేస్కేలు నష్టానికి గురైన సచివాలయ ఉద్యోగులకు ఒక రకంగా కూటమి ప్రభుత్వం రివర్స్ ప్రమోషన్ ఇస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. 

ప్రభుత్వంలో ఎక్కడైనా, ఏశాఖలోనైనా నాల్గవ తరగతి(ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ పదోన్నతి కల్పించాలి. కానీ సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో అది రివర్స్ లో జరుగుతున్నది. ప్రస్తుతం 22460 పేస్కేలు అందుకుంటున్న వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నది కల్పించి.. వారికి  రూ.25220 పేస్కేలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నది.  అంటే రూ.2760  వ్యత్యాసంతో అదే జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయడం ద్వారా పదోన్నతి కల్పించినట్టుగా ఉంటుందని.. అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను అత్యవసరంగా భర్తీచేసినట్టుగా వుంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తేడా నియామకాల వలన ప్రొబేషన్ రెండేళ్లు పూర్తయిన తరువాత అదనంగా తొమ్మిది నెలలు రూ.15వేలకే పని చేసి పూర్తి పేస్కేలుకోల్పోయి ఉద్యోగులు ఆపై..  పీఆర్సీలో ఐఆర్, డీఏలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కోల్పోయారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ఇపుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలోనూ అదే అన్యాయానికి గురవుతున్నారు సచివాలయ ఉద్యోగులు. సుమారు ఆరేళ్లు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో పనిచేసిన ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తే కనీసం సీనియర్ అసిస్టెంట్  ప్రమోషన్ ఇవ్వాలి. అంతకంటే ముందు సర్వీస్ రెగ్యులర్ టైమ్ లో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇచ్చిన తరువాత పదోన్నతులు కల్పించాల్సి వుంటుంది. అలా చేయకుండా.. కనీసం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా నేరుగా ఇతరశాఖల్లోకి బదిలీ చేయాలని చూస్తున్నది ప్రభుత్వం.

కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని చూస్తున్న వేళ ఉద్యోగులు మాత్రం ఇక్కడ ఒక్క ఉపయోగం మాత్రం కనిపిస్తున్నది అదే ఉద్యోగులకు ఇతర శాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ అమలు. అది తప్పా మిగిలినవన్నీ తీవ్రమైన నష్టాలుగా కనిస్తున్నాయి. అయితే  పూర్తిగా గుడ్డికంటే మెల్ల బెటర్ అన్నట్టుగా కనీసం రూ. 2760 అదనంగా పేస్కేలు వస్తుందని మాత్రమే సంబర పడాల్సిన దుస్తుతి. పదోన్నతులు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో ఎక్కడా పదోన్నతులు అంశాలను ప్రస్తావించి, ప్రతిపాదించిన అంశాల్లో చేర్చలేదు.  20శాతం అంటే 3వేల మంది ఉద్యోగులను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో సంక్షేమశాఖలు(బిసీవెల్పేర్, మైనార్టీ వెల్పేర్, సోషల్ వెల్పేర్, ట్రైబల్ వెల్ఫేర్) శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది.

వెల్పేర్ అసిస్టెంట్లకు ప్రభుత్వశాఖ వలన ప్రయోజనం లేని పదోన్నతులైనా వస్తున్నాయి తప్పితే మహిళా పోలీసులకైతే నేటికీ కనీసం ప్రభుత్వశాఖ కూడా లేకుండా గాల్లోనే ఉన్నారు. కాకపోతే తొలుత పోలీసుశాఖ ద్వారా వీరి నియామకాలు జరిపారు కనుక అదే శాఖలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీరి నియమాకాలపై కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలం నెట్టుకొచ్చేసింది తప్పితే వీరికి ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగని కూటమి ప్రభుత్వం అయినా ఏమైనా చేసింద అంటే  అసెంబ్లీలో హడావిడి ప్రస్తావించి, ఉద్యోగుల్లో ఆశలు రేపి వదిలేసింది తప్పితే మహిళా పోలీసుల విషయంలో ఒక్క అడుగుకూడా ముందుకి వేయలేదు. 

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1.30లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో ప్రస్తుతం వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సుమారు 14వేలకు పైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో సంక్షేమశాఖలోని ఖాళీలను భర్తీచేయడానికి 20శాతం అంటే సుమారు 3వేల మంది ఉద్యోగులను మెరిట్ అండ్ రోస్టర్ పాయింట్లను వినియోగించి ఆయాశాఖల్లోకి భర్తీచేయనుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా అంతేశాన్ని తీసుకొని వారికి ఖాళీ అయిపోయిన గ్రామపంచాయతీలకు సర్దేయడానికి కార్యాచరణ పూర్తి చేసింది. ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్స్ శిక్షణ ఇచ్చి వారిని కూడా స్థానిక పీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లోకి పంపనుంది. మరో వైపు ఇంజనీరింగ్ అసిస్టెంట్లును ఏఈలు లేదా వర్క్ ఇనెస్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని చూస్తున్నది. ఇక గ్రామీణ మత్స్య సహాయకులను కూడా ఫిషరీష్ ఇనెస్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించడానికి మెరిట్ లిస్టులు తయారు చేస్తున్నది. రెవిన్యూలో భాగంగా ఉన్న విఆర్వోలు, సర్వేయర్లను అదే శాఖలోకి మండల కేంద్రాల్లోకి తీసుకోవాలనే యోచనలో ఉంది.

 అందరికీ అన్నీ చేసినా మహిళా పోలీసులకు ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం నేటికీ ఒక నిర్ణయానికి రాలేదు. వచ్చే అవకాశాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అని అసెంబ్లీలో ప్రస్తావించినంత  వేగంగా కార్యాచరణలో మాత్రం పోలీసుశాఖలో వీరిని ఏ సేవలకు వినియోగించాలనే విషయంలో నిర్ణయానికి రాలేదు. ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. ఈ విషయంలో మహిళా పోలీసులు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.  గ్రామ, వార్డు సచివాలయశాఖలో ప్రస్తుతం రేషనలైజేషన్, ఆపై క్లస్టరైజేషన్ అంశాలు  మాత్రం వేగంగా నడుస్తున్నాయి.

ఇవన్నీ పూర్తయితే మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి ఇక్కడి సిబ్బందిని పూర్తిగా పంపించేసి గ్రామ, వార్డు సచివాలయాలకు మంగళం పాడేయనున్నారు. అయితే అది ఒకేసారి చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించి దానికి వివిధ దారులు వెతికి వాటి ద్వారా మెల్ల మెల్లగా ఈ వ్యవస్థకు చరమగీతం పాడటం కోసం అన్ని పనులు చక చకా చేసుకుపోతున్నది ప్రభుత్వం. కొత్తగా ఒక ప్రభుత్వశాఖను లెక్కా పత్రం, విధి విధానాలు లేకుండా ఏర్పాటు చేస్తే.. కావాల్సినట్టు ఇతర శాఖల్లోని ఖాళీలను భర్తీచేయడానికి ఇక్కడి సిబ్బందిని పంపేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్నది.  దానికోసం కార్యాచరణ చేసిస్పష్టంగా.. అధికారికంగా చకచకా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో మిగిలిన శాఖల సచివాలయ సిబ్బందికి ఏ విధమైన పదోన్నతులు కల్పిస్తారో, వారికి ఏ విధమైన ప్రతిపాదనలు చేస్తారో.. ఖాళీలు ఉన్న ఏశాఖలోకి వారిని పంపిస్తారో వేచి చూడాల్సిందే మరి..!

సిఫార్సు