గ్రామ సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వశాఖ లేనట్టే..?!


Ens Balu
108
visakhapatnam
2025-05-06 19:55:35

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ఇప్పట్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ శాఖ కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా..నేటికీ సచివాలయ మహిళా పోలీసులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెరవేర్చే అంశం కూడా ప్రభుత్వం వద్ద లేదని తెలుస్తుంది. ఫలితంగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ శాఖ లేకుండా, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ లేకుండా, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకి వచ్చే సాధారణ ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది.. ఇక మహిళా పోలీసుల విషయంలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి హడావిడీ చేస్తున్న కూటమి ప్రభుత్వం దానిపై స్పష్టమైన ఆదేశాలేమీ ఇవ్వలేదు. దీనితో తమకు ప్రభుత్వశాఖ రాదు.. పదోన్నతులూ ఉండవని ఉద్యోగులు ఫిక్స్ అయిపోయా రు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కష్టాలు గట్టెక్కి ప్రభుత్వశాఖ కేటాయింపు జరుగుతుందనుకుంటే ప్రకటనలు, హామీలు తప్పా పనిమాత్రం జరగడం లేదని మహిళా పోలీసులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు..!

ఆంధప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాల్సి వస్తుందనో.. లేదంటే గత ప్రభుత్వం తలా తోకా లేకుండా చేసి గాల్లో పెట్టేసిన విధానాన్ని ప్రచారానికి వాడుకోవాలని చూస్తుందో తెలీదు కానీ సచివాలయ ఉద్యోగులు, అందులోని మహిళాపోలీసులను అలాగే గాలికొదిలేసింది. ఎపుడైనా పత్రికలు, మీడియాలో కథనాలు వచ్చినపుడు మాత్రం  వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని.. వారిని సక్రమంగా..సరైన సీట్లో కూర్చోబెడతామని మాత్రం ప్రకటన చేస్తున్నది కూటమి ప్రభుత్వం. గత నెలలో కూడా హోం మంత్రి వంగలపూడి అనిత పదిరోజుల్లో మహిళా పోలీసులకు సముచిత స్థానాన్ని కల్పించి ప్రభుత్వ శాఖ కేటాయిస్తామని నాలుగైదు ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఆ తరువాత ఆ ప్రకటన చూసి పొంగిపోయిన మహిళా పోలీసులు, సచివాలయ ఉద్యోగులకు రోజులు పోయి నెలలగు గడుస్తున్నాయి తప్పితే వారి సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.

 మహిళా పోలీసుల పోస్టుల అంశం హైకోర్టులో ఉండటంతో గత ప్రభుత్వం తాత్సాహరం చేసి చేతులు దులుపుకుంది తప్పితే ఏమీ చేయలేదు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు అప్పడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామ, వార్డు వాలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లు లైవ్ లో లేరు.. వారిని కొనసాగించలేదమని చెప్పి వారికి మంగళం పాడేసి వారి క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేసేశారు. అప్పటిని నుంచి వాలంటీర్ల విధులు, ఉద్యోగుల విధులు, సచివాలయ ఉద్యోగులచే చేయాల్సి వస్తున్నది. దానితోపాటు అదనంగా రక రకాల సర్వేలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను బట్టి వారికి డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇవ్వడంతోపాటు, ఇష్టమున్నవారిని పోలీసుశాఖలోనే ఉంచుతామని కూడా ప్రకటించింది. 

ఇదంతా గత నెలలో జరిగిపోతుందని అనుకున్నారు. మీడియాలో కూడా భారీ హెడ్డింగులతో వార్తలు వచ్చాయి. అయితే అదంతా వార్తలకే పరిమితం అయిపోయింది. కానీ ఒక్క అడుగుకూడా ముందుకి పడలేదు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్, డిపార్ట్ మెంట్, రిక్రూట్ మెంట్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ చక్కగా ఏర్పాటు చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఉద్యోగులకు మొదటి పదోన్నతి రావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం తలా తోకా లేకుండా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టడంతో వారి భవితవ్యం గాల్లోనే ఉంది. అసలు ఈ శాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకటిరెండు ప్రభుత్వశాఖల సిబ్బందికి పదోన్నతులు ఇచ్చి  మమా అనిపించారు. మిగిలిన వారికి ఇద్దామనుకునే లోపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గద్దె దిగేసింది. 

వెంటనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంత హామిలిచ్చి ఉద్యోగులు నుంచి తిరుగుబాటు రాకుండా ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీడియాలో ప్రకటనలు ఇచ్చి ఒకసారి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు ఇవ్వడానికి ప్రతిపాదించామని.. మరోసారి పేరెంట్ డిపార్ట్ మెంట్ లోనే పదోన్నతులు ఇవ్వనున్నామని.. మరోసారి ప్రభుత్వశాఖలేని మహిళా పోలీసులకు ఆప్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటనలతో ఊదరకొడుతూ వచ్చారు. వాస్తవానికి అసెంబ్లీలో చర్చించిన అంశాలను ప్రభుత్వం ప్రత్యేక జీఓల ద్వారా అమలు చేయాలని. అదేంతో కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా పోలీసుల విషయంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ, శాసన మండలిలో చర్చలకు తెరలేపి. ఆ తరువాత వారిని ఏమీ చేయకుండా వదిలేయడం ఇపుడు ప్రభుత్వ వర్గాల నుంచి వ్యతిరేకతకు కారణం అవుతున్నది. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసిన తరువాత 74 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు దఫ దఫాలుగా ఉద్యోగ విరమణలు చేస్తూ వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వశాఖల్లోని భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. వాటిని భర్తీచేయాలంటే జరిగే పనికాదు. అలాగని సచివాలయ ఉద్యోగులను వారి మాత్రులశాఖలకు అటాచ్ చేస్తే ఇటు సచివాలయ ఉద్యోగులకు అటు ప్రభుత్వశాఖలకు సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని కూడా ప్లాన్ చేశారు. అయితే అవన్నీ ప్రచారాలకే పరిమితం అవతున్నాయి. ఒక సారి ఒక అంశం ప్రచారం జరిగితే అది మూడు నాలుగు నెలల వరకూ అలా నాన్చే ఉంచుతున్నారు తప్పితే వాటిపై నిర్ధిష్టంగా చర్యలు తీసుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల పరిస్థితి కూడా గత ఏడాది నుంచి కూటమిప్రభుత్వం అలా నాన్చుతూ వచ్చింది తప్పితే గాల్లో వున్నవారికి ప్రభుత్వ శాఖ కేటాయించే విషయంలో  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఒక కూటమి ప్రభుత్వంలో కూడా ప్రకటనలు తప్పితే.. ఎలాంటి ప్రయోజనం ఉండదని..ఇక ప్రభుత్వశాఖ కేటాయి కలగానే మిగిలిపోతుందని మహిళా పోలీసులు ఫిక్స్ అయిపోయారు.

 అటు మిగిలిన సచివాలయ ఉద్యోగులు కూడా తమకు గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా అలా నాన్చుకుంటూ వచ్చి ఆఖరికి చేతులెత్తేస్తుందని సామాజిక మాద్యమాల్లో చర్చలు మొదులు పెట్టారు. నిజం కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలే ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతున్నాయనడానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంశం, నేటికీ ఎలాంటి ప్రభుత్వ శాఖలేకుండా ఉన్న మహిళా పోలీసు విషయమే ప్రధాన ఉదాహరణగా మిగిలిపోయింది. చూడాలి ఏడాది దాటిన సందర్భంగా అయినా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీని కూటమిప్రభుత్వం నిలబెట్టుకుంటుందా.. పదోన్నతులు, ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందని మీడియా ప్రచారాలతోనే మిగిలిన నాలుగేళ్లు గడిపేస్తుందా అనేది..?!